రైల్వే మంత్రిత్వ శాఖ

2019-20 సాధారణ సంవత్సరంతో పోలిస్తే సరుకు లోడింగ్‌లో 10% కంటే ఎక్కువ పెరుగుదల నమోదు చేసిన రైల్వే


2019 ఏప్రిల్‌లో 101.04 మిలియన్ టన్నులు సరకుల రవాణా

2021 ఏప్రిల్ లో 111.47 మిలియన్ టన్నుల సరకుల లోడింగ్

కోవిడ్ సవాళ్ళను ఎదుర్కొంటూ వరుసగా ఎనిమిది నెలలపాటు గత రికార్డులను తిరగ రాసిన రైల్వే

సరకు రవాణా ద్వారా 11163.93 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిన రైల్వేలు

Posted On: 01 MAY 2021 7:21PM by PIB Hyderabad

భారత రైల్వేల 2021 ఏప్రిల్ నెలలో ఆదాయం, సరుకుల లోడింగ్ పరంగా వృద్ధి రేటును కొనసాగించాయి. 

2019-20 సంవత్సరంతో పోల్చి చూస్తే రైల్వేలు సరకు రవాణాలో 10% వృద్ధి రేటును సాధించాయి. 2019 ఏప్రిల్ లో 101.04 మిలియన్ టన్నుల సరకులను రైల్వే రవాణా చేసింది. 2021 ఏప్రిల్ నెలలో రైల్వే 111.47 మిలియన్ టన్నుల సరకులను రవాణా చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఏప్రిల్ లో రవాణా చేసిన సరుకుల్లో 

51.87 మిలియన్ టన్నుల బొగ్గు, 14.83 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం, 3.47 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 2.53 మిలియన్ టన్నుల ఎరువులు, 3.58 మిలియన్ టన్నులు  మినరల్ ఆయిల్, 7.1 మిలియన్ టన్నుల సిమెంట్ (క్లింకర్ మినహా) మరియు 4.88 మిలియన్ టన్నుల క్లింకర్ ఉన్నాయి. 

2021 ఏప్రిల్ నెలలో సరకుల రవాణా ద్వారా రైల్వేలు 11163.93 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించాయి.

రైల్వేద్వారా  సరుకు రవాణా చేయడాన్ని ప్రోత్సహించడానికి  భారతీయ రైల్వే అనేక రాయితీలు / తగ్గింపులు ఇస్తోంది. 

 సరుకు రవాణా కదలికలలో మెరుగుదలలు సంస్థాగతీకరించి  మరియు రాబోయే సున్నా ఆధారిత సమయ పట్టికలో చేర్చబడతాయి.

 కోవిడ్ 19 ను భారత రైల్వే అన్నిరంగాల్లో సామర్థ్యాలను పెంపొందించడానికి పనితీరును మెరుగుపరుచుకోవడానికి ఒక అవకాశంగా వినియోగించుకుంది.  

***



(Release ID: 1715454) Visitor Counter : 116