ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల కార్యక్రమం – 105వ రోజు


సాయంత్రం 8 గంటలవరకు వేసిన కోవిడ్ టీకాలు 26 లక్షలు

ఇప్పటివరకు వేసిన టీకాల మొత్తం 15.48 కోట్లు

Posted On: 30 APR 2021 8:52PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 15.48 కోట్లు దాటింది. ఈ రోజు సాయంత్రం 8 గంటల  వరకు ఇచ్చిన టీకాలు 26 లక్షలు దాటాయి. టీకాల కార్యక్రమం మొదలైన నాటి నుంచి నేటి సాయంత్రం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 15,48,54,096 టీకాలు ఇచ్చారు. అందులో ఆరోగ్య సిబ్బందికిచ్చిన  మొదటి డోసులు 94,10,892,  రెండో డోసులు 62,40,077, కోవిడ్ యోధులకిచ్చిన మొదటి డోసుల 1,25,48,925, రెండో డోసులు   68,11,824, 45-60 ఏళ్ళ మధ్యవయసున్నవారికిచ్చిన మొదటి డోసులు 5,26,53,077 , రెండో డోసులు 37,59,948, 60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చ మొదటి డోసులు 5,23,51,313, రెండో డోసులు  1,10,78,040 ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ళ్ళ మధ్యవారు

60 పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

94,10,892

62,40,077

1,25,48,925

68,11,824

5,26,53,077

37,59,948

5,23,51,313

1,10,78,040

12,69,64,207

2,78,89,889

 

దేశవ్యాప్త టీకాల కార్యక్రమం మొదలైన 105వ రోజైన ఏప్రిల్ 30 సాయంత్రం 8 గంటలవరకు 26,08,948 టీకాడోసుల పంపిణీ జరిగింది. అందులో  14,77,309 మంది లబ్ధిదారులు మొదటి డోస్ అందుకోగా  11,31,639 మంది రెండో డోస్ తీసుకున్నారు. తుది నివేదిక అర్థరాత్రికి అందుతుంది.  

తేదీ: ఏప్రిల్ 30, 2021 ( 105వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ళ్ళ మధ్యవారు

60 పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

24,007

48,959

1,28,972

1,03,962

8,74,235

3,42,037

4,50,095

6,36,681

14,77,309

11,31,639

 ****



(Release ID: 1715356) Visitor Counter : 107