సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఐఐఎస్‌ అధికారి శ్రీ పుష్పవంత్‌ శర్మ కన్నుమూత

Posted On: 30 APR 2021 9:47PM by PIB Hyderabad

'ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌'కు చెందిన మరో సీనియర్‌ అధికారి శ్రీ పుష్పవంత్‌ శర్మ కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌తో తుదిశ్వాస విడిచారు. కొవిడ్‌తో సుదీర్ఘంగా పోరాడి, నొయిడాలోని జేపీ ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత రెండు వారాలుగా, కొవిడ్‌తోపాటు ఆస్థ్మాకు వివిధ ఆసుపత్రుల్లో ఆయన చికిత్సలు తీసుకున్నారు.

    డెప్యూటీ డైరెక్టర్‌ హోదాలో ఉన్న 58 ఏళ్ల పుష్పవంత్‌ శర్మ, భారత వార్తాపత్రికల రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ ప్రెస్‌ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. ఐఐఎస్‌ అధికారిగా కొనసాగిన 34 ఏళ్ల ఉద్యోగ జీవితంలో పీఐబీ (ముజఫర్‌పూర్‌ & పట్నా), డీఎఫ్‌పీ (ముజఫర్‌పూర్‌), ఎయిర్‌ న్యూస్‌ (రాంచీ), డీడీ న్యూస్‌ (పట్నా & న్యూదిల్లీ) సహా కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ ఆధ్వర్యంలోని వివిధ మీడియా విభాగాల్లో సేవలు అందించారు. ఐఐఎస్‌ సంఘం అధ్యక్షుడిగానూ పని చేశారు. శ్రీ పుష్పవంత్‌ శర్మకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

    పుష్పవంత్‌ శర్మ మరణం పట్ల కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సీనియర్‌ అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. వృత్తిలో చూపిన నైపుణ్యం, ప్రజాసేవ పట్ల కనబరిచిన నిబద్ధతతో శ్రీ పుష్పవంత్‌ శర్మ చిరస్మరణీయులు.

    ఏప్రిల్‌ నెలలోనే, ముగ్గురు ఐఐఎస్‌ అధికారులు నరేంద్ర కౌశల్‌ (పీఐబీ ఏడీజీ), మణికాంత్‌ ఠాకూర్‌ (కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మీడియా విభాగాధిపతి), సంజయ్‌ కుమార్‌ (పీఐబీ డెప్యూటీ డైరెక్టర్‌) కూడా కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌తో తుదిశ్వాస విడిచారు.

***



(Release ID: 1715354) Visitor Counter : 121