పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 వాక్సిన్ల‌ను ప్ర‌యోగాత్మ‌కంగా బ‌ట్వాడా చేసేందుకు డ్రోన్ల‌ను ఉప‌యోగించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వానికి అనుమ‌తి


డ్రోన్ల‌ను ఉప‌యోగించి వాక్సిన్ల‌ను బ‌ట్వాడా చేయ‌డాన్ని అధ్య‌య‌నం చేసేందుకు ఐసిఎంఆర్‌కు అనుమ‌తి

ఆరోగ్య సంర‌క్ష‌ణ మ‌రింత మెరుగ్గా అందుబాటులో ఉండాల‌న్న ల‌క్ష్యాన్ని సాధించడం అనుమ‌తుల వెనుక ఉద్దేశ్యం

Posted On: 30 APR 2021 3:08PM by PIB Hyderabad

తెలంగాణ ప్ర‌భుత్వం డ్రోన్ల ఏర్పాటుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (ఎంఒసిఎ), డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డిజిసిఎ) ష‌ర‌తుల‌తో కూడిన మిన‌హాయింపును మంజూరు చేశారు. డ్రోన్ల‌ను ఉప‌యోగించి దృశ్య‌మాన ప‌రిధిలో (విజువ‌ల్ లైన్ ఆఫ్ సైట్ (విఎల్ఒఎస్‌)ఉన్న‌వారికి కోవిడ్‌-19 మందులు ఇచ్చే ప్ర‌యోగాల‌ను నిర్వ‌హించేందుకు వాటి వినియోగానికి అనుమ‌తిని ఇచ్చారు. ఈ మిన‌హాయింపుల‌తో కూడిన అనుమ‌తి ఒక ఏడాది లేక త‌దుప‌రి ఉత్త‌ర్వులు జారీ అయ్యేవ‌ర‌కూ వ‌ర్తిస్తుంది. అయితే, సంబంధిత సంస్థల కోసం పేర్కొన్న అన్ని షరతులు, పరిమితులు ఖచ్చితంగా కట్టుబడి ఉంటేనే ఈ మినహాయింపులు వ‌ర్తిస్తాయి.
జ‌నాభా, ఏమేర‌కు ఐసొలేష‌న్‌లో  ఉన్నారు, డ్రోన్ డెలివ‌రీలు నిర్ధిష్టంగా అవ‌స‌ర‌మైన ప్రాంతాల‌ను గుర్తించ‌డం వంటి వాటిని అంచ‌నా వేయ‌డంలో, తోడ్ప‌డంలో  కూడా ఈ ట్ర‌య‌ల్స్ సాయం చేస్తాయి.
ఈ నెల మొద‌ట్లో, ఇటువంటి అనుమ‌తినే ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్‌కు (ఐసిఎంఆర్‌), ఐఐటి కాన్పూర్‌తో భాగ‌స్వామ్యంతో డ్రోన్ల ద్వారా కోవిడ్‌-19 వాక్సిన్ డెలివ‌రీకి గ‌ల సాధ్య‌త‌ను అధ్య‌యనం చేసేందుకు ఇచ్చింది. 
ఈ అనుమ‌తులు ద్వంద్వ ల‌క్ష్యాలైన వాక్సిన్ డెలివ‌రీ, మెరుగైన ఆరోగ్య సంర‌క్ష‌ణ సేవ‌లను దిగువ‌న పేర్కొన్న సేవ‌ల ద్వారా అందుబాటులోకి తీసుకు వ‌స్తాయి. 
పౌరుల గ‌డ‌ప‌లోకి ప్రాథ‌మిక ఆరోగ్య సేవ‌లు అందేలా చూడ‌డం
కోవిడ్ సోకిన వారి నుంచి మరొక‌రికి సోక‌కుండా వ్య‌క్తుల రాక‌పోక‌ల‌ను  ప‌రిమితం చేయ‌డం లేదా కోవిడ్ వ‌చ్చే ప్రాంతాల‌కు ఆకాశ‌మార్గాన బ‌ట్వాడా చేయ‌డం
ఆరోగ్య సేవ‌ల‌ను చివ‌రి మైలు వ‌ర‌కూ, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల‌లో అందుబాటులో ఉండేలా చూడ‌డం
దీర్ఘ‌ప‌రిధిగ‌ల డ్రోన్ల‌కు వైద్య వ్యూహ‌ర‌చ‌న‌ను మ‌ధ్య మైలులో స‌మ‌న్వ‌యం చేసే సాధ్య‌త‌
 ముఖ్యంగా, త్వ‌ర‌లోనే మూడ‌వ వాక్సిన్‌ను ప్రారంభించి, ల‌క్ష‌లాది డోసుల‌ను భార‌త వ్యాప్తంగా ర‌వాణా చేసేందుకు వైద్య స‌ర‌ఫ‌రా లంకెను, మెరుగుప‌ర‌చ‌డం.
డ్రోన్ల ఉప‌యోగం అనుమ‌తికి సంబంధించిన ప‌బ్లిక్ నోటీసు దిగువ‌న ఇచ్చిన లింక్‌లో అందుబాటులో ఉంది. 
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2021/apr/doc202143031.pdf

 

***(Release ID: 1715216) Visitor Counter : 154