రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

పైథాన్-5 ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ తొలి ట్ర‌య‌ల్స్‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన డీఆర్‌డీఓ

Posted On: 28 APR 2021 1:18PM by PIB Hyderabad

భారత్‌ స్వదేశీయంగా త‌యారు చేసిన తేలిక పాటి యుద్ధ విమానం తేజస్‌కు 5వ తరం ఎయిర్-టు-ఎయిర్ పైథాన్-5 క్షిపణిని (ఏఏఎం) జోడించి 2021 ఏప్రిల్ 27 న తన ఆయుధ సామర్ధ్యంలో చేర్చింది. తేజస్‌పై ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ డెర్బీ బియాండ్ విజువల్ రేంజ్ (బీవీఆర్) ఏఏఎం  మెరుగైన సామర్ధ్యం ధ్రువీక‌ర‌ణ‌ ల‌క్ష్యంగా ట్రయల్స్ నిర్వ‌హించారు. క్లిష్ట సవాలుగా నిలిచే పరిస్థితులలోనూ దాని పని తీరును ధ్రువీకరించడానికి వీలుగా గోవాలో ఈ క్షిపణి పరీక్షల శ్రేణిని పూర్తి చేశారు. డెర్బీ క్షిపణి హై-స్పీడ్ యుక్తి క‌చ్చిత వైమానిక లక్ష్యాన్ని ప్రత్యక్షంగా సాధించింది. పైథాన్ క్షిపణులు కూడా 100% ల‌క్ష్యాన్ని సాధించాయి. తద్వారా వాటి పూర్తి సామర్థ్యం ధ్రువీక‌రించబ‌డింది. ఈ ప్ర‌యోగాత్మ‌క ప‌రీక్ష‌లు అన్ని ర‌కాల ప్రణాళిక లక్ష్యాలను చేరుకున్నాయి. ఈ ప్రయోగాల‌కు ముందు, తేజస్ విమానంలో విమాన వ్యవస్థలతో కూడిన క్షిపణిని ఏకీకృతం చేయడాన్ని అంచనా వేయడానికి బెంగళూరులో విస్తృతమైన క్షిపణి క్యారేజ్ త‌ర‌హా విమాన పరీక్షలు నిర్వ‌హించారు. గోవాలో, విజయవంతమైన విభజన ప్రయత్నాల తరువాత, బాన్షీ లక్ష్యంలో క్షిపణిని ప్రత్యక్షంగా ప్రయోగించడం జరిగింది. పైథాన్-5 త‌ర‌హా క్షిపణి ప్రత్యక్ష కాల్పులు అన్ని అంశాల ధ్రువీక‌ర‌ణ‌కు మరియు దృశ్య పరిధికి మించి లక్షిత‌ నిశ్చితార్థాన్ని ధ్రువీక‌రించ‌డానికి వీలుగా ఈ ప్ర‌యోగ‌ ప‌రీక్ష‌ల‌ను నిర్వహించడం జ‌రిగింది. అన్ని లైవ్ ఫైరింగుల‌లో ఈ క్షిపణి వైమానిక లక్ష్యాన్ని చేదించింది. నేషనల్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్‌కు (ఎన్‌ఎఫ్‌టీసీ) చెందిన భారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్) టెస్ట్ పైలట్లు ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) తేజాస్ విమానం నుంచి ఈ క్షిపణులను ఇక్క‌డ ప్ర‌యోగించారు. ఏడీఏ
మరియు హెచ్ఏఎల్‌-ఏఆర్‌డీసీల శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు మరియు సాంకేతిక పుణుల బృందం కొన్ని సంవ‌త్స‌రాలుగా చేసిన క‌ఠోర శ్ర‌మ‌తో పాటు సిమిలాక్,
డీజీ-ఏక్యూఏ, ఐఏఎఫ్ పీఎంటీ, ఎన్‌పీఓ (ఎల్‌సీఏ నేవీ) మరియు ఐఎన్ఎస్ హంసాల‌ నుండి ప్రశంసనీయమైన సహకారంతో ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతంగా సాధ్యమైంది. ఈ ప్ర‌యోగాల‌లో పాల్గొన్న డీఆర్‌డీఓ, ఏడీఏ, భారత వైమానిక దళం, హెచ్ఏఎల్‌తో కూడిన బృందాన్ని రక్ష‌ణ శాఖ‌ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ ఈ సంద‌ర్భంగా అభినందించారు. ప్ర‌యోగంలో పాలుపంచుకున్న ఆయా సంస్థలు, పరిశ్రమలకు చెందిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు మరియు సాంకేతిక నిపుణుల కృషిని రక్షణ శాఖ ఆర్‌అండ్‌డీ విభాగం కార్యదర్శి, డీఆర్‌డీఓ ఛైర్మన్  డాక్టర్ జి.సతీష్ రెడ్డి ఈ సంద‌ర్భంగా ప్రశంసించారు.

                             

***(Release ID: 1714729) Visitor Counter : 13