ప్రధాన మంత్రి కార్యాలయం

దేశం లో కోవిడ్-19 కి సంబంధించిన స్థితి ని సమీక్షించడానికి జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి


వైద్య సంబంధి మౌలిక సదుపాయాల లభ్యత పై సమీక్షించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి కి ప్రెజెంటేశన్ ను ఇచ్చిన 3 సాధికార సమూహాలు


ఆరోగ్య సంబంధి మౌలిక సదుపాయాల ను వెంటనే ఉన్నతీకరించాలంటూ అధికారుల ను ఆదేశించిన ప్రధాన మంత్రి

Posted On: 27 APR 2021 8:33PM by PIB Hyderabad

దేశం అంతటా కోవిడ్-19 సంబంధి స్థితి ని సమీక్షించడం కోసం నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.  ఆయన దేశం లో ఆక్సీజన్ అందుబాటు, మందులు, ఆరోగ్య సంరక్షణ పరమైన మౌలిక సదుపాయాలు, వగైరాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న స్థితి ని సమీక్షించారు.

ప్రాణవాయువు సరఫరా ను పెంచడానికి కృషి చేస్తున్న సాధికార సమూహం దేశం లో ఆక్సీజన్ లభ్యత, సరఫరా ల దిశ లో జోరు ను తీసుకురావడానికి జరుగుతున్న ప్రయాసల ను గురించి ప్రధాన మంత్రి కి వివరించింది.  రాష్ట్రాలకు ఆక్సీజన్ కేటాయింపు ను పెంచడం గురించి వారు ప్రధాన మంత్రి కి తెలియజేశారు.  దేశం లో 2020 ఆగస్టు నాటికి లిక్విడ్ మెడికల్ ఆక్సీజన్ (ఎల్ఎమ్ఒ) ఉత్పత్తి రోజు కు 5,700 ఎమ్ టి గా ఉండగా, ప్రస్తుతం (2021 ఏప్రిల్ 25 నాటి కి) 8922 ఎమ్ టి కి పెరిగిందన్న సంగతి కూడా చర్చ కు వచ్చింది.  ఎల్ఎమ్ఒ దేశీయ ఉత్పత్తి 2021 ఏప్రిల్ ఆఖరు కల్లా రోజు కు 9250 ఎమ్ టి ని మించవచ్చన్న అంచనా ఉంది.




 



పిఎస్ఎ ఆక్సీజన్ ప్లాంటుల ను వీలైనంత త్వరగా ప్రారంభించడానికి రాష్ట్రాల ప్రభుత్వాల తో కలసి పనిచేయాలని ఉన్నతాధికారుల కు ప్రధాన మంత్రి దిశానిర్దేశం చేశారు.   పిఎస్ఎ ఆక్సీజన్ ప్లాంటుల ను స్థాపించేలా రాష్ట్రాల ను ప్రోత్సహిస్తున్నట్లు అధికారులు కూడా ప్రధాన మంత్రి కి తెలిపారు.

ఆక్సీజన్ ఎక్స్ ప్రెస్ రైల్వే సేవ లను నడుపుతున్న సంగతి ని, ఆక్సీజన్ టాంకర్ లను ఒక చోటు నుంచి మరొక చోటు కు తీసుకుపోవడానికి భారతీయ వాయు సేన చేపడుతున్న దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాలను గురించి ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకురావడం జరిగింది.

పడక లు, ఐసీయూ ల లభ్యత ను పెంచడం కోసం చేపడుతున్న చర్యలను గురించిన సమాచారాన్ని వైద్య సంబంధి మౌలిక సదుపాయాల కల్పన- కోవిడ్ నిర్వహణ విధులలో నిమగ్నమైన సాధికార సమూహం ప్రధాన మంత్రి కి తెలిపింది.  సంక్రమణ గొలుసు ను తెగగొట్టడానికి తీసుకొంటున్న ప్రయాసల ను గురించి కూడా ప్రధాన మంత్రి కి తెలియజేయడమైంది.  రాష్ట్రాల లో సంబంధిత ఏజెన్సీ ల ద్వారా కోవిడ్ నిర్వహణ కు సంబంధించిన ప్రత్యేక మార్గదర్శనం, వ్యూహాలు సరైన పద్ధతి లో అమలు లోకి వచ్చేటట్టు  శ్రద్ధ తీసుకోవాలి అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.

కోవిడ్ కు సంబంధించిన ప్రవర్తన శైలి ని  గురించి ప్రజలలో అవగాహన ను పెంచేందుకు చేపట్టిన చర్యలను కమ్యూనికేశన్ పై పనిచేస్తున్న సాధికార సమూహం ప్రధాన మంత్రి కి తెలిపింది.


ఈ సమావేశం లో కేబినెట్ సెక్రట్రి, హోం శాఖ కార్యదర్శి, ఆర్ టి & హెచ్ సెక్రట్రి, ఐ ఎండ్ బి సెక్రట్రి, ఫార్మాస్యూటికల్స్ సెక్రట్రి, నీతి ఆయోగ్ మెంబరు, ఐసిఎమ్ ఆర్ డిజి, బయోటెక్నాలజీ సెక్రట్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

***



(Release ID: 1714470) Visitor Counter : 164