వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
పంజాబ్ రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే 8,180 కోట్ల రూపాయల జమ
గోధుమ పంట విక్రయాల ద్వారా ఎటువంటి జాప్యం లేకుండా తొలిసారిగా చెల్లింపులు పొందుతున్న రైతులు
సెంట్రల్ పూల్ లో 26.04.2021 నాటికి 222.34 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను కేంద్ర ప్రభుత్వ , ఇతర సంస్థల నుంచి సేకరించిన భారత ఆహార సంస్థ
గత ఏడాది ఇదే కాలానికి 77,57 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల సేకరణ
ప్రస్తుత రబీ పంటకాలంలో కనీస మద్దతు ధర చెల్లింపు ద్వారా సాగుతున్న కార్యక్రమాల వల్ల 21.17 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తూ 43,912 కోట్ల రూపాయల విలువ చేసే పంటల సేకరణ
2021-22 రబీ పంటకాలంలో పూర్తి స్థాయిలో సాగుతున్న పంటల సేకరణ
పూర్తి స్థాయిలో రూపుదిద్దుకున్న"వన్ నేషన్, వన్ ఎంఎస్పి, వన్ డిబిటి" కార్యక్రమం
Posted On:
26 APR 2021 1:33PM by PIB Hyderabad
గోధుమ పంట అమ్మకాలకు ద్వారా వస్తున్న ఆదాయం పంజాబ్ రైతులు బ్యాంకు ఖాతాల్లో తొలిసారిగా జమ అవుతోంది. ఇప్పటికే 8,180 కోట్ల రూపాయలు నేరుగా పంజాబ్ రైతుల ఖాతాలోకి బదిలీ అయ్యాయి. ప్రస్తుత రబీ మార్కెటింగ్ సీజన్ లో అమలులో వున్న ధరల మద్దతు పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తూ వారి నుంచి పంటలను సేకరిస్తోంది.
గోధుమల సేకరణ పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, చండీఘర్ , మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు ఇతర రాష్ట్రాలు మరియు యుటిలలో వేగంగా సాగుతోంది. 2021 ఏప్రిల్ 25 వరకు 222.34 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను కొనుగోలు చేసింది. గత ఏడాది ఇదే కాలానికి 77,57 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల సేకరణ జరిగింది.
కొనుగోలు చేసిన మొత్తం 222.34 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలలో పంజాబ్ నుంచి 84.15 లక్షల మెట్రిక్ టన్నులను ( 37.8%), హర్యానాలో 71.76 లక్షల మెట్రిక్ టన్నులను(32.27%), మధ్యప్రదేశ్ లో 51.57 లక్షల మెట్రిక్ టన్నులను(23.2%) . 2021 ఏప్రిల్ 25 నాటికి కొనుగోలు చేశారు.
ప్రస్తుత రబీ పంటకాలంలో కనీస మద్దతు ధర చెల్లింపు ద్వారా సాగుతున్న కార్యక్రమాల వల్ల 21.17 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తూ వారి నుంచి 43,912 కోట్ల రూపాయల విలువ చేసే గోధుమలను సేకరించారు.
2021 ఏప్రిల్ 25 నాటికి పంజాబ్‌లో సుమారు 8,180 కోట్ల రూపాయలు , హర్యానాలో సుమారు 4,668 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలోకి బదిలీ అయ్యాయి.
ఈ ఏడాది హర్యానా మరియు పంజాబ్ ప్రభుత్వ సేకరణ నూతన చరిత్ర ప్రారంభం అయ్యింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రెండు రాష్ట్రాలు కనీస మద్దతు ధర చెల్లింపులను పరోక్ష చెల్లింపు పద్దతిలో కాకుండా అన్ని సేకరణ ఏజెన్సీల ద్వారా రైతుల బ్యాంక్ ఖాతాకు ఆన్‌లైన్ ప్రయోజనాలను నేరుగా బదిలీ చేయడం ప్రారంభించాయి. దీనిపట్ల రైతుల కర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము కష్టపడి పండించిన పంటలపై ఆదాయాన్ని ఎటువంటి కోతలు, జాప్యం లేకుండా నేరుగా పొందుతున్నామని పంజాబ్ / హర్యానా రైతులు అంటున్నారు.ఈ విధానం వల్ల "వన్ నేషన్, వన్ ఎంఎస్పి, వన్ డిబిటి" పథకం పూర్తి స్థాయిలో అమలు కావడం ప్రారంభించింది.
***
(Release ID: 1714183)
Visitor Counter : 180