ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ టీకాలలో మరో మైలురాయి దాటిన భారత్;14 కోట్లకు పైగా టీకా డోసులు


99 రోజుల్లోనే 14 కోట్ల డోసులిచ్చిన అత్యంత వేగవంతమైన దేశంగా భారత్

గత 24 గంటల్లో 2.17 లక్షలకు పైగా కోలుకున్న కోవిడ్ బాధితులు

గత 24 గంటల్లో కోవిడ్ మరణాలు నమోదు కాని 5 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు

Posted On: 25 APR 2021 11:33AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కొవిడ్ టీకా డోసులు 14 కోట్లు దాటాయి. ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం

20,19,263 శిబిరాల ద్వారా 14,09,16,417  టీకా డోసులు ఇచ్చారు.  ఇందులో ఆరోగ్య సిబ్బందికిచ్చిన 92,90,528  మొదటి డోసులు,

59,95,634 రెండో డోసులు, కోవిడ్ యోధులకిచ్చిన మొదటి డోసులు 1,19,50,251 రెండో డోసులు 62,90,491, 60 ఏళ్ళు పైబడ్డ వారికిచ్చిన  మొదటి డోసులు 4,96,55,753, రెండో డోసులు   77,19,730, 45-60 ఏళ్ళ మధ్య వయసున్నవారికిచ్చిన మొదటి డోసులు  

4,76,83,792 , రెండో డోసులు 23,30,238  ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 -60  ఏళ్ళ మధ్యవారు

60 ఏళ్ళపైబడ్డవారు

 

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

92,90,528

59,95,634

1,19,50,251

62,90,491

4,76,83,792

23,30,238

4,96,55,753

77,19,730

14,09,16,417

 

కోవిడ్-19 టీకాలు వేగంగా ఇవ్వటంలో భారతదేశం అత్యంత వేగవంతమైన దేశంగా గుర్తింపు సాధించింది. కేవలం 99 రోజుల్లో 14 కోట్ల

మైలురాయి దాటింది.

ఇప్పటిదాకా ఇచ్చిన టీకాలలో 58.83% ఎనిమిది రాష్ట్రాలలోనే కావటం గమనార్హం.   

 

గడిచిన 24 గంటల్లో 25 లక్షలకు పైగా టీకా డోసులిచ్చారు. టీకాల కార్యక్రమం మొదలైన 99వ రోజైన ఏప్రిల్24న 25,36,612 

డోసులివ్వగా అందులో 16,43,864 మంది లబ్ధిదారులు 25,732 శిబిరాలలో మొదటి డోస్ తీసుకోగా 8,92,748 మంది రెండో డోస్

తీసుకున్నారు.   

 

తేదీ: 24 ఏప్రిల్, 2021 ( 99వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 మధ్య వయసు

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

22,518

44,558

98,606

95,640

10,12,252

1,98,158

5,10,488

5,54,392

16,43,864

8,92,748

 

దేశంలో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,40,85,110  కి చేరుకోగా కోలుకున్నవారి శాతం 83.05%.

గత 24 గంటలలో 2,17,113 మంది కోలుకోగా పది రాష్ట్రాల్లోనే 81.73% మంది ఉన్నారు. .

గత 24 గంటలలో 3,49,691 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. పది రాష్టాలు – మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక, కేరళ,

చత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ లలో  ఈ కొత్త కేసుల్లో 74.53% నమోదయ్యాయి. అందులో అత్యధికంగా

 మహారాష్ట్రలో 67,160 కేసులు, ఉత్తరప్రదేశ్ లో 37,944, కర్నాటకలో 29,438 ఉన్నాయి.

 

ఈ క్రింద చూపిన విధంగా 12 రాష్ట్రాలలో కోవిడ్ కేసుల పెరుగుదల కనబడుతోంది.

 

దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ ప్రస్తుతం 26,82,751 కు చేరింది. ఇది పాజిటివ్ కేసులలో 15.82% 

గడిచిన 24 గంటలలో చికిత్స పొందుతున్నవారి సంఖ్యలో పెరుగుదల 1,29,811 గా నమోదైంది.

ఎనిమిది రాష్ట్రాలు- మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, కేరళ  కలిసి చికిత్సపొందుతున్న కేసులలో

69.94% వాటా పొందాయి.

 

ఈ దిగువ చిత్రపటం పెరుగుతున్న కోవిడ్ నిర్థారణ పరీక్షల సంఖ్యను, పాజిటివ్ కేసులను చూపుతోంది.

 

జాతీయ స్థాయిలో కోవిడ్ కేసులలో మరణాల శాతం తగ్గుతూ ప్రస్తుతం 1.13% గా నమోదైంది.

గత 24 గంటలలో 2,767 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. . ఇందులో 10 రాష్ట్రాల వాటా 80.23% ఉండగా మహారాష్ట్రలో అత్యధికంగా

 676 మరణాలు, ఆ తరువాత స్థానంలో ఉన్న ఢిల్లీలో 357 మరణాలు నమోదయ్యాయి.

గత 24 గంటలలో ఐదు రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు.

అవి: డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, త్రిపుర, లక్షదీవులు  సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ 

 

****



(Release ID: 1714071) Visitor Counter : 166