ఆయుష్

కోవిడ్ -19 మ‌హమ్మారి స‌మ‌యంలో ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు కోసం యోగా అనే ఆన్‌లైన్ ఈవెంట్‌కు ఆయుష్ మంత్రిత్వ‌శాఖ‌, ప్ర‌ముఖ యోగా సంస్థ‌లు క‌ల‌సి క‌ట్టుగా ముందుకు వ‌చ్చాయి.

Posted On: 24 APR 2021 8:05PM by PIB Hyderabad

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐక్య‌త ,శ్రేయ‌స్సుకోసం యోగం -2021 కార్య‌క్ర‌మాల‌లో భ‌గంగా ఆయుష్ మంత్రిత్వ‌శాఖ దేశంలోని కొన్ని ప్ర‌ముఖ యోగా సంస్థ‌ల‌తో క‌లిసి వ‌ర్చువల్ ప్లాట్‌ఫాం ద్వారా ప్ర‌జ‌ల‌కు యోగా వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌పై వారు ఇళ్ల వ‌ద్ద‌నుంచే తెలుసుకునే స‌దుపాయం క‌ల్పిస్తోంది.  కోవిడ్ -19 స‌మ‌యంలో శ్రేయ‌స్సుకు సంబంధించిన ఈ ప్ర‌త్యేక ఒక రోజు కార్య‌క్ర‌మాన్ని 2021 ఏప్రిల్ 25 వ తేదీన  నిర్వ‌హిస్తున్నారు.

 కోవిడ్ మ‌హ‌మ్మారి ప్ర‌భావం ప్ర‌జ‌ల శారీర‌క‌, మాన‌సిక ఆరోగ్యంపై పెరుగుతుండ‌డంపై ఆందోళ‌న వ్య‌క్త‌మౌతోంది.యోగాకు గ‌ల వివిధ ప్ర‌యోజనాల‌ను దృష్టిలో ఉంచుకున్న‌ప్పుడు ఇది ప్ర‌జ‌ల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతున్న‌ది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో యోగా వ‌ల్ల ఆరోగ్యం కుదుట‌ప‌డ‌డ‌మే కాక‌, ఒత్తిడిని కూడా ఇది త‌గ్గిస్తుంది. 2021 ఏప్రిల్ 25న జ‌రిగే ఒక రోజు ఈవెంట్ ఈ సందేశాన్ని ప్ర‌జ‌ల‌లోకి తీసుకువెళుతుంది. ఈ ఈవెంట్‌ను ఫేస్‌బుక్ (https://www.facebook.com/moayush/) , యూట్యూబ్ (https://youtube.com/c/MinistryofAYUSHofficial)ద్వారా ఆయుష్ మినిస్ట్రీ హాండిల్స్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేస్తారు. దీనితోపాటు మొరార్జీ దేశాయ్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా (ఎండిఎన్ఐ వై) అభివృద్ధి చేసిన కోవిడ్ నివార‌ణ ప్రొటోకాల్స్‌కు సంబంధించిన కీల‌క విభాగం కూడా ఉంది. 

ఈ సెగ్మెంట్ పై హాండిల్స్ లో ఉద‌యం 8 గంట‌ల‌కు అందుబాటులో ఉంటుంది . మ‌రొ ముఖ్య‌మైన సెగ్మెంట్ కోవిడ్ -19 పై వెబినార్ .ఇది 5 గంట‌ల‌కు అందుబాటులో ఉంటుంది. ఇందులో ప‌లువురు ప్ర‌ముఖులు మాట్లాడ‌తారు. ఇందులో ర‌క్ష‌ణ శాఖ స‌హాయ‌మంత్రి శ్రీ శ్రీ‌పాద నాయ‌క్‌, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కార్య‌ద‌ర్శి వైద్య రాజేష్ కొటెచా, డైర‌క్ట‌ర్ ఎండి.ఎన్ ఐవై డాక్ట‌ర్ ఐవి బ‌స‌వారెడ్డి సందేశాలు ఉంటాయి. ఈ ఈవెంట్‌లో యోగ్ రిషి స్వామి రామ్‌దేవ్ డాక్ట‌ర్ హెచ్‌.ఆర్ నాగేంద్ర‌, చాన్స‌ల‌ర్ ఆఫ్ స్వామి వివేకానంద యోగా అధ్య‌య‌న సంస్థాన్ (ఎస్‌వివైఎఎస్ఎ( బెంగ‌ళూరు, శ్రీ క‌మలేష్ ప‌టేల్‌(దాజి), శ్రీ‌రామ‌చంద్ర మిష‌న్ పాల్గొంటారు. 

యోగాను క్ర‌మంత‌ప్ప‌కుండా ఆచ‌రించ‌డం వ‌ల్ల ఆరోగ్యం మెరుగుప‌డ‌డ‌మే కాక‌, స‌హ‌జ‌సిద్ధంగా రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. యోగా వ‌ల్ల మెట‌బాలిజ‌మ్ మెరుగుప‌డుతుంది.  ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగుప‌డుతుంది. వివిధ అనారోగ్యాల బారిన ప‌డే ముపు అంటే శ్వాస సంబంధ ఇబ్బందులు, గుంగె సంబంధ వ్యాధులు , డ‌యాబిటీస్ వంటి వాటి ముప్పును త‌గ్గిస్తుంది. యోగా మాన‌సిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. భ‌యం, ఆతృత‌, ఒత్తిడి, బోర్‌గా ఫీల్ కావ‌డం వంటి వాటినుంచి, మాన‌సిక ఆందోళ‌న‌, నిస్పృహ వంటి వాటినుంచి త‌ట్టుకోవ‌డానికి ఉప‌క‌రిస్తుంది.

ప్ర‌స్తుత సంక్లిష్ట స‌మ‌యంలో ఇలాంటి జ‌బ్బులు సాధారణ‌మై పోయాయి. రానున్న అంత‌ర్జాతీయ‌యోగా దినం -2021 ను పుర‌స్క‌రించుకుని ( ప్ర‌తి ఏడాది జూన్ 21న యోగా దినోత్స‌వం జ‌రుపుకుంటారు). అందువ‌ల్ల యోగా గురించి మాట్లాడుకోవ‌డానికి ఇది స‌రైన స‌మ‌యం. ప్ర‌జ‌ల రోజు వారి జీవితంలో యోగా గురించి ఆలోచ‌న‌ల‌ను తీసుకురావాలి. యోగా ఐక్య‌త కోసం, ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు కోసం -2021 కార్య‌క్ర‌మం ప్ర‌స్తుతం 6 వ వారం నిర్వ‌హిస్తున్నారు. ఈ ల‌క్ష్యంతోనే దీనిని ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఓక‌రోజు కార్య‌క్ర‌మం ఈ ల‌క్ష్యంలో భాగంగానే నిర్వ‌హింప‌బ‌డుతోంది. 

ప్ర‌స్తుతం కోవిడ్ మ‌హ‌మ్మారి విస్త‌రిస్తున్న‌దానిని దృష్టిలో ఉంచుకుని ఐడ‌వై -2021 కి సంబంధించి అన్ని ముంద‌స్తు చ‌ర్య‌ల‌ను ఆన్‌లైన్ , వ‌ర్చువ‌ల్ విధానంలో చేప‌డుతున్నారు. దీనితో యోగాకుసంబంధించి నిపుణుల స‌ల‌హాల‌ను పాటిస్తూ యోగాను ఇంటివ‌ద్దే పాటించేందుకు అద్భుత అవ‌కాశం ప్ర‌జ‌ల‌కు క‌లుగుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్స‌వానికి సంబంధించి వివిధ స్టేక్ హోల్డ‌ర్లు సందేశాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. ప్ర‌జారోగ్యంలో యోగా ప్రాధాన్య‌త గురించి తెలియ‌జేయ‌డంతోపాటు, ప్ర‌జారోగ్యంలో యోగా పాత్ర‌ను తెలియజేస్తూ, సాధార‌ణ యోగా ప్రోటోకాల్‌ను పాటిస్తూ అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం 2021ని ఇంటి వ‌ద్దే పాటించ‌డం గురించి ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తున్నారు. ఇంట్లోనేఉండండి, యోగా తో ఉండండి అన్న సందేశం వ్యాప్తి చేస్తున్నారు. 


ఆయుష్ మంత్రిత్వ‌శాఖ సోష‌ల్‌మీడియా హాండిల్స్‌,లో సివైపి కి సంబంధించి నాణ్య‌మైన స‌మాచారం ఉంది. దీనిని యోగా శిక్ష‌కులు వినూత్న విధానంలో వినియోగించుకోవ‌చ్చు. అలాగే పౌరులు ఇళ్ల‌లోనేఉండి యోగా సాధ‌న చేయ‌వ‌చ్చు.
వంద రోజుల యోగా ఫ‌ర్ యూనిటీ , వెల్ బీయింగ్ కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర‌ప‌తి శ్రీ రామ్ నాథ్ కోవిండ్ 2021 మార్చి 14న వ‌ర్చువ‌ల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం (ఐడివై) పై దృష్టిపెట్టింది. ఆ రోజుతో ఇది ముగుస్తుంది. ఈ కార్య‌క్ర‌మానికి ఆయుష్ మంత్రిత్వ‌శాఖ మ‌ద్ద‌తునిస్తోంది. ఇందుకు శ్రీ‌రామ‌చంద్ర మిష‌న్ (హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్‌), స్వామివివేకానంద యోగా  అనుసంధాన సంస్థాన (ఎస్‌వివైఎఎస్ె), ప‌తంజ‌లి యోగ పీఠం స‌మ‌ష్టి కృషి ని అందిస్తున్నాయి.

ఈ కార్య‌క్ర‌మం సంప్ర‌దాయ‌, అధీకృత‌యోగా పాఠ‌శాల‌లు 100 రోజుల యోగా సిరీస్‌ను మెరుగైన జీవన విధానం కోసం ప్రారంభించ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది. ఈ అన్ని కార్య‌క్ర‌మాలూ ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌ర్చువ‌ల్ విధానంలో వివిధ భాష‌ల‌లో అందించ‌డం జ‌రుగుతోంది.యోగా ఫ‌ర్ యూనిటీ, వెల్ బీయింగ్ కార్యక్ర‌మానికి ఇప్ప‌టి వ‌ర‌కు 144 దేశాల నుంచి ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిజిస్ట‌ర్ చేయించుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న‌ది. ఈ కార్య‌క్ర‌మంలో రోజువారీ ప్రాక్టీస్ సెష‌న్‌లు ఉన్నాయి. సైన్సు, యోగా విజ్ఞానంపైఅన్ని కోణాల‌లో ఉప‌న్యాస ప‌రంప‌ర  ఉంది. హిస్ట‌రీ, మెడిసిన్‌, సైకాల‌జీ, రీసెర్చ్ మేనేజ్‌మెంట్‌, విద్య‌, లింగ్విస్టిక్‌, సామాజిక శాస్త్రాలు, క్రీడ‌ల‌కు సంబంధించిన 50 మంది కి పైగా నిపుణులైన బోధ‌కులు ఇందులో భాగంగా ఉన్నారు.
కోవిడ్‌- 19కు వ్య‌తిరేకంగా పోరాటంలో, మీరు ప్ర‌జ‌ల‌కు గ‌ట్టి మ‌ద్ద‌తుదారుగా ఉండ‌వ‌చ్చు అలాగే ప్ర‌పంచంలోని మూల మూల‌ల‌కూ దీని ద్వారా చేరుకోవ‌చ్చు. ఐడివై 2021 సంద‌ర్భంగా యోగా విష‌యంలో ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతుల‌ను చేయ‌డంతోపాటు ఈకార్య‌క్ర‌మంలో వారు పాల్గొనేట్టుచేయ‌వ‌చ్చు.

***


(Release ID: 1714023) Visitor Counter : 173