శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
వయోజనులలో ఒక మాదిరి కోవిడ్ -19 లక్షణాలకు చికిత్స చేసేందుకు డిబిటి-బిఐఆర్ ఎ సి మద్దతుతో జైడూస్ నుంచి తయారవుతున్న విరాఫిన్‌కు లభించిన అత్యవసర ఆమోదం.
(7 రోజుల చికిత్సనాటికి 91.15 శాతం మంది పేషెంట్లకు ఆర్‌టి-పిసిఆర్ నెగటివ్ సూచించింది. ఈ చికిత్స పేషెంట్లకు సప్లిమెంటల్ ఆక్సిజన్ సమయాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది.
ఇది డిబిటి-బిఐఆర్ఎసి క్రినికల్ పరీక్షల కోసం కోవిడ్ -19 పరిశోధన కన్సార్టియం మద్దతుకలిగి ఉంది.
Posted On:
24 APR 2021 12:10PM by PIB Hyderabad
ఒక మాదిరి కోవిడ్ -19 లక్షణాలు కలిగిన పేషెంట్లకు చికిత్స అందించేందుకు జైడుస్ కాడిలా వారి విరాఫిన్ ను అత్యవసర పరిమిత వినియోగానికి వాడడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) అనుమతి ఇచ్చింది. విరాఫిన్ అనేది పెగిలేటెడ్ ఇంటర్‌ఫెరాన్ ఆల్ఫా-2బి (పెగ్ ఐఎఫ్ఎన్), దీనిని పేషెంట్ కు ఇన్‌ఫెక్షన్ తొలిదశలో సూదిగా వేసినట్టయితే, అలాంటి వారు త్వరగా కోలుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
విరాఫిన్ అభివృద్ధికి, రెండో దశ మానవ క్లినికల్ ట్రయల్స్‌కు ఎన్‌బిఎం ద్వారా డిబిటి- బిఐఆర్ఎసి కోవిడ్ -19 రిసెర్చ్ కన్సార్టియం మద్దతును జైడూస్ తీసుకుంది. విరాఫిన్ వైరల్ లోడ్‌ను తగ్గిస్తుందని, వ్యాధిని అదుపు చేయడానికి మెరుగైన రీతిలో పనిచేస్తుందని అధ్యయనాలు నివేదించాయి. ఇది సప్లిమెంటల్ ఆక్సిజన్ అవసరాన్ని తగ్గిస్తుంది. తద్వారా తక్కువ ఆక్సిజన్ స్థాయిల కారణంగా శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితిని తగ్గిస్తుంది.
ఈ విజయం గురించి చెబుతూ డిబిటి కార్యదర్శి, బిఐఆర్ ఎసి ఛైర్‌పర్సన్ డాక్టర్ రేణు స్వరూప్ ,“ కోవిడ్ -19 మహమ్మారిని నిర్మూలించే దిశగా మన పరిశ్రమలు చేపట్టే చర్యలు వాటి వ్యూహాలకు అన్నిరకాలుగా సాధ్యమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. విరాఫిన్‌కు అత్యవసరంగా అనుమతి మంజూరు చేయడం, వైద్య సదుపాయాలు కల్పించేవారికి మరో మైలురాయిగా నిలవనుంది. ఈ విజయం సాధించడానికి జరిగిన కృషిని నేను ఎంతగానో అభినందిస్తున్నాను” అని అన్నారు.
ఈ ప్రకటనతో ఆనందం వ్యక్తం చేసిన కాడిలా హెల్త్‌కేర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ షార్విల్ పటేల్, వ్యాధి తొలిదశలో ఈ చికిత్సతో వైరల్ లోడ్‌ను తగ్గించగలమని తెలిసింది. ఇది వ్యాధి నియంత్రణలో ఉపయోగపడుతుంది. ఇది అత్యంత కీలక సమయంలో పేషెంట్లకు అందుబాటులోకి వస్తున్నది. అందరం కలిసి కోవిడ్ -19 పై పోరాటం చేయడంలో భాగంగా దీనిని చికిత్సలో అందుబాటులోకి తీసుకువస్తాం ” అని అన్నారు.
మూడవ దశ క్లినికల్ ప్రయోగ పరీక్షల అధ్యయనాల ప్రకారం, విరాఫిన్ నువాడిన చాలా మంది పేషెంట్లకు 7 వ రోజు నాటికి ఆర్‌టి-పిసిఆర్ పరీక్షలో నెగటివ్ వచ్చింది. అలాగే ఇతర యాంటీ వైరల్ ఏజెంట్‌లతో పోల్చినపుడు ఇది మరింత వేగంగ ఉపశమనం కలిగిస్తున్నట్టు నమోదైంది.
డిబిటి గురించి : డిపార్టమెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ (డిబిటి) మినిస్ట్రీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ కింద పనిచేస్తున్నది. ఇది వ్యవసాయం, హెల్త్‌కేర్, పశువైద్యం, పర్యావరణం, పరిశ్రమల రంగాలలో బయోటెక్నాలజీని వినియోగించడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది బయోటెక్నాలజీ పరిశోధన రంగంలో నూతన శిఖరాలు అందుకోవడంపై దృష్టిపెడుతుంది. బయోటెక్నాలజీని ప్రధానమైన ఉపకరణంగా చేసుకుని సంపద సృష్టికి , సామాజిక న్యాయానికి ప్రత్యేకించి పేదల సంక్షేమానికి కృషి చేస్తుంది. www.dbtindia.gov.in
బిఐఆర్ఎసి గురించి : బయో టెక్నాలజీ ఇండస్ట్రీ రిసెర్చి అసిస్టెన్స్ కౌన్సిల్ (బిఐఆర్ ఎసి) లాభార్జన కోసం కాక, సెక్షన్ 8, షెడ్యూలు బి , పబ్లిక్‌సెక్టర్ ఎంటర్ ప్రైజ్. దీనిని భారత ప్రభుత్వానికి చెందిన డిపార్టమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఏర్పాటు చేసింది. బయోటెక్ ఎంటర్ ప్రైజ్‌లకు సాధికారత కల్పించి వాటిఇ బలోపేతం చేసేందుకు ఒక ఇంటర్‌ఫేస్ ఏజెన్సీగా దీనిని ఏర్పాటు చేశారు.వ్యూహాత్మక
పరిశోధన, ఆవిష్కరణలకోసం, దేశీయంగా అవసరమైన ఉత్పత్తులను అబివృద్ది అవసరాలను తీర్చడానికి దీనిని ఏర్పాటు చేవారు.
www.birac.nic.in
జైడూస్ కాడిలా: దీనినే కాడిలా హెల్త్‌కేర్ లిమిటెడ్ గా కూడా సుపరిచితం. ఇది గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గల భారతీయ బహుళజాతి ఔషధ సంస్థ.ఇది ప్రధానంగా జెనిరిక్ ఔషధాల తయారీలోని సంస్థ. మరింత సమాచారం కోసం లాగాన్ కండిhttp://www.zyduscadila.com/
***
(Release ID: 1713808)
Visitor Counter : 282