పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

12 వ జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని, 2021 ఏప్రిల్, 24వ తేదీన, దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించనున్న - కేంద్ర ప్రభుత్వం


దేశవ్యాప్తంగా ఉత్తమంగా పనిచేస్తున్న పంచాయతీలు / రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు యుటిలకు అవార్డులు ప్రదానం చేయనున్న - కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ

ప్రప్రథంగా, అవార్డు నగదు పురస్కారాన్ని (గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ గా) వెంటనే, సంబంధిత పంచాయతీల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేయనున్న - ప్రధానమంత్రి

2021 ఏప్రిల్, 24వ తేదీన, స్వామిత్వ పధకాన్ని, దేశానికి అంకితం చేయనున్న - ప్రధానమంత్రి

స్వామిత్వ పథకం కింద 5,002 గ్రామాలకు చెందిన దాదాపు 4,09,945 మంది లబ్దిదారులకు ఆస్తి కార్డులు / ఆస్తి హక్కు పత్రాలు (సంపత్తి పత్రక్) ను, ఎలక్ట్రానిక్ విధానం ద్వారా పంపిణీ చేయనున్న - ప్రధానమంత్రి

Posted On: 23 APR 2021 6:31PM by PIB Hyderabad

దేశంలో రెండవ దశ కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఉద్భవించిన అసాధారణ పరిస్థితి కారణంగా,  జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని, 2021 ఏప్రిల్, 24వ తేదీ, శనివారం రోజున, దృశ్యమాధ్యమం ద్వారా జరుపుకోవాలని నిర్ణయించారు.  సాధారణంగా, జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకుంటారు. అనేక సందర్భాల్లో, ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి హాజరయ్యారు.  ఈ ఏడాది న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్‌ లో ఈ జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు.

రాజ్యాంగ (73 వ సవరణ) చట్టం, 1992 ద్వారా పంచాయతీ రాజ్ సంస్థాగతీకరణతో, క్షేత్ర స్థాయి ప్రాంతాలకు అధికారాన్ని వికేంద్రీకరించిన చరిత్రలో, 1993 ఏప్రిల్, 23వ తేదీ, ఒక నిర్ణయాత్మక క్షణాన్ని సూచిస్తుంది, ఇది ఆ రోజు నుండే, అమల్లోకి వచ్చింది.   ఈ తేదీన 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చినందున కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఏప్రిల్, 24వ తేదీని జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం (राष्ट्रीय पंचायती राज  दिवस - ఎన్‌.పి.ఆర్‌.డి) గా జరుపుకుంటోంది.  దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీ ప్రతినిధులతో ప్రత్యక్ష సంభాషణకు, ఈ కార్యక్రమం అవకాశం కల్పిస్తుంది, అదేవిధంగా వారికి సాధికారత కల్పించడానికీ, వారిని ప్రోత్సహించడానికీ, వారి విజయాలను గుర్తించదానికీ కూడా ఇది ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. 

సేవలు, ప్రజా వస్తువుల పంపిణీని మెరుగుపర్చడానికి, దేశవ్యాప్తంగా ఉత్తమంగా పనిచేసే పంచాయతీలు / రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు, వారు చేసిన మంచి కృషికి గుర్తింపుగా పంచాయతీల ప్రోత్సాహకం కింద, కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ, ఈ సందర్భంగా, ప్రతీ ఏటా, అవార్డులు, ప్రదానం చేస్తోంది.  దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ శశక్తీ కరణ్ పురస్కార్ (డి.డి.యు.పి.ఎస్.పి), నానాజీ దేశ్ ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కర్ (ఎన్.డి.ఆర్.జి.జి.ఎస్.పి), చైల్డ్-ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ అవార్డు (సి.ఎఫ్‌.జి.పి.ఎ), గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జి.పి.డి.పి) అవార్డు తో పాటు, ఈ-పంచాయతీ పురస్కర్ (రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు మాత్రమే ఇవ్వబడుతుంది) వంటి వివిధ కేటగిరీలలో ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. 

ఈ సంవత్సరం, అనేక అవరోధాలు, పరిమితులు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా పంచాయతీలలో చాలా మంది ఉత్తమ సేవలను అందించారు. ఉన్నారు.  అవార్డు కింద నగదు పురస్కారాన్ని (గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ గా) 5 లక్షల నుండి 50 లక్షల రూపాయల వరకు మొత్తాన్ని నేరుగా, అప్పటికప్పుడు సంబంధిత పంచాయతీల బ్యాంకు ఖాతాకు బదిలీ అయ్యే విధంగా, ప్రధానమంత్రి బటన్‌ ను నొక్కుతారు.   ఈ విధానం ప్రప్రథమంగా చేపట్టడం జరుగుతోంది.  2021 సంవత్సరానికి గాను జాతీయ పంచాయతీ పురస్కారాలను - దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ శశక్తీ కరణ్ పురస్కార్ (224 పంచాయతీలకు); నానాజీ దేశ్ ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కర్ (30 గ్రామ పంచాయితీలకు); గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (29 గ్రామ పంచాయితీలకు); చైల్డ్-ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ అవార్డు (30 గ్రామ పంచాయితీలకు); ఈ-పంచాయతీ పురస్కర్ (12 రాష్ట్రాలకు) వంటి వివిధ కేటగిరీలలో ప్రదానం చేస్తున్నారు. 

ప్రోత్సాహకరంగా, జాతీయ పంచాయతీ పురస్కారాలు పంచాయతీల విజయాల గురించి దేశవ్యాప్తంగా అవగాహన మరియు జ్ఞానాన్ని పంచుకోవడానికి ఒక మాధ్యమంగా మారాయి, తద్వారా, భాగస్వాములందరి నిబద్ధత స్థాయి పెరుగుతుంది, ఫలితంగా, దేశానికి ప్రయోజనం చేకూరుతుంది.  మన దేశానికి చెందిన పంచాయతీ రాజ్ సంస్థలు బలమైన భారతీయ దేశాన్ని నిర్మించడంలో మద్దతు ఇవ్వడంతో పాటు, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఇతర దేశాలకు ఒక ప్రత్యేక మహత్తరమైన ఉదాహరణగా నిలుస్తున్నాయి. 

జాతీయ పంచాయతీ అవార్డుల కోసం 2021 (2019-20 మదింపు / అంచనా సంవత్సరానికి) మూడు స్థాయిల పంచాయతీ రాజ్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్ర పాలిత (యు.టి) ప్రాంతాల ప్రభుత్వాల నుండి - దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ శశక్తీ కరణ్ పురస్కార్; నానాజీ దేశ్ ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కర్;  గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అవార్డు;  చైల్డ్-ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ అవార్డు - అనే నాలుగు విభాగాల క్రింద ఆన్‌-లైన్ నామినేషన్లను ఆహ్వానించారు.  ఈ అవార్డుల కోసం 74,000 మందికి పైగా పంచాయతీలు విజయవంతంగా దరఖాస్తు చేసుకున్నాయి, ఇది ఇంతకు ముందు సంవత్సరం కంటే, సుమారుగా 28 శాతం ఎక్కువ. 

గ్రామీణ ప్రజల సామాజిక-ఆర్థిక సాధికారత మరియు వారికి స్వావలంబన కల్పించే లక్ష్యాల కోసం, “గ్రామీణ ప్రాంతాలలో సర్వే మరియు గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన సాంకేతికతతో మ్యాపింగ్’ (స్వామిత్వ), అనే కేంద్ర పథకాన్ని, 2020 ఏప్రిల్, 24వ తేదీన ప్రధానమంత్రి ప్రారంభించారు.  ఈ పథకం యొక్క పైలట్ దశ 2020–2021 ఆర్ధిక సంవత్సరంలో, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోనూ, అలాగే, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలలోని కొన్ని సరిహద్దు గ్రామాలలోనూ,  అమలు చేయబడింది. స్వామిత్వ పథకాన్ని 2021 ఏప్రిల్,  24వ తేదీన ప్రధానమంత్రి మొత్తం దేశానికి అంకితం చేస్తారు.  4.09 లక్షల మంది ఆస్తి యజమానులకు ఇ-ప్రాపర్టీ కార్డుల పంపిణీని కూడా గౌరవ ప్రధానమంత్రి, ఈ సందర్భంగా ప్రారంభిస్తారు.

2020 ఏప్రిల్, 24వ తేదీన, జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ యొక్క కేంద్ర ప్రభుత్వ పథకం-స్వామిత్వ ను, ప్రధానమంత్రి ప్రారంభించారు.  గ్రామీణ అబాడి ప్రాంతాల్లోని, గ్రామీణ గృహ యజమానులకు ‘ఆస్తి హక్కుల రికార్డు’ అందించడం, ఆస్తి హక్కుల కార్డులు జారీ చేయడం, ఈ పథకం లక్ష్యాలు. 

ఐదేళ్ల (2020-2025) కాలంలో దశలవారీగా దేశవ్యాప్తంగా 566.23 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పథకం అమలుకు ఆమోదించబడింది.  మొత్తం దేశంలోని సుమారు 6.62 లక్షల గ్రామాలలో, ఇది అమలౌతుంది.  

2020-21 మధ్య కాలంలో పైలట్ దశలో భాగంగా - హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల వ్యాప్తంగా, నిరంతర ఆపరేటింగ్ విధానం (సి.ఓ.ఆర్.ఎస్) స్టేషన్ల నెట్‌వర్క్ ఏర్పాటుతో పాటు, ఆంధ్రప్రదేశ్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని దాదాపు 40,000 వేల గ్రామాల్లోనూ, అలాగే, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని సరిహద్దు గ్రామాల్లోనూ, డ్రోన్ ఎగరే ప్రక్రియ పూర్తయ్యింది. 

2021 ఏప్రిల్, 24వ తేదీన, 12వ జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా, పంచాయతీ రాజ్ సంస్థలకు వివిధ జాతీయ అవార్డుల ప్రదానంతో పాటు, ప్రధానమంత్రి, స్వామిత్వ పథకం కింద, 5,002 గ్రామాలలో దాదాపు 4,09,945 ఆస్తి హక్కు దారులకు, ఆస్తి హక్కు కార్డులు / టైటిల్-డీడ్స్ (సంపత్తి పత్రక్) ను ఎలక్ట్రానిక్ విధానం ద్వారా పంపిణీ చేస్తారు.  చాలా మంది ఆస్తి హక్కు దారులు తమ మొబైల్ ఫోన్లలో వచ్చిన ఎస్.ఎమ్.ఎస్. లింక్ ద్వారా వారి ఆస్తి కార్డులను డౌన్‌-లోడ్ చేసుకోగలుగుతారు.  ఆ తర్వాత, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు తగిన కోవిడ్ నియమ నిబంధనలను అనుసరించి,  ఆస్తి హక్కు కార్డులు / టైటిల్-డీడ్ల యొక్క భౌతిక పంపిణీని, నిర్వహిస్తాయి. 

తదనంతరం, 5,002 గ్రామాలలో నివసించేవారికి, తగిన కోవిడ్ నిబంధనలను అనుసరించి ఆస్తి కార్డుల భౌతిక పంపిణీ పూర్తవుతుంది. వీటిలో - హర్యానా నుండి 1,308 గ్రామాలు; కర్ణాటక నుండి 410;  మహారాష్ట్ర నుండి 99; మద్ద్యప్రదేశ్ నుండి 1399; రాజస్థాన్ నుండి 39; ఉత్తరప్రదేశ్ నుండి 1409; ఉత్తరాఖండ్ నుండి 338 గ్రామాలు ఉన్నాయి. 

2020-2025 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా, దశల వారీగా, మొత్తం దేశంలోని సుమారు 6.62 లక్షల గ్రామాలకు విస్తరించి, అమలు చేయడానికి గాను, ప్రధానమంత్రి, స్వామిత్వ పథకాన్ని కూడా ప్రారంభించనున్నారు.  ఇప్పటివరకు పథకం అభ్యాసాలు, సవాళ్ళు మరియు విజయాల యొక్క వివిధ అంశాలను వివరిస్తూ, స్వామిత్వ పై రూపొందించిన చిన్న పుస్తకాన్ని (కాఫీ టేబుల్ బుక్) కూడా ప్రధాన మంత్రి ఈ సందర్భంగా విడుదల చేయనున్నారు.

పైలట్ దశలో ఉన్న 9  రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాలు చాలావరకు గ్రామీణ అబాడి ప్రాంతం యొక్క డ్రోన్ సర్వే మరియు పథకం అమలు కోసం సర్వే ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియ చివరి దశలో ఉన్నాయి.  ఈ రాష్ట్రాలు డిజిటల్ ప్రాపర్టీ కార్డు / టైటిల్-డీడ్ నమూనా ఖరారు, ప్రాపర్టీ కార్డులు / టైటిల్-డీడ్ల కేటాయింపుతో పాటు, అబాడి ప్రాంతాల సర్వే కోసం వారి చట్టంలో అవసరమైన సవరణలను కూడా ప్రారంభించాయి. 

ఆస్తి యాజమాన్య కార్డుల కోసం వేర్వేరు రాష్ట్రాలు వేర్వేరు పేర్లను ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు - హర్యానాలో 'టైటిల్-డీడ్', కర్ణాటకలో 'గ్రామీణ ఆస్తి యాజమాన్య రికార్డులు (ఆర్‌.పి.ఓ.ఆర్)', మధ్యప్రదేశ్‌లో 'అధికార్-అభిలేఖ్', మహారాష్ట్రలో 'సన్నాద్', రాజస్థాన్‌లో 'పట్టా', ఉత్తరాఖండ్‌ లో  'స్వామిత్వా అభిలేఖ్', ఉత్తరప్రదేశ్ లో  'ఘరానీ' అని, ఆస్తి యాజమాన్య కార్డులను వ్యవహరిస్తూ ఉంటారు. 

ఈ పథకం గ్రామీణ భారతదేశ స్వరూపాన్ని మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.  పట్టణాలు, నగరాల్లో మాదిరిగా రుణాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను తీసుకోవటానికి గ్రామస్తులు తమ ఆస్తిని, ఆర్థిక అవసరాలకు అనువుగా ఉపయోగించుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది.  అంతేకాకుండా, మిలియన్ల మంది గ్రామీణ ఆస్తి యజమానులకు ప్రయోజనం చేకూర్చడానికి, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా ఇదే మొదటిసారి.

ఎన్‌.పి.ఆర్‌.డి-2021 కార్యక్రమం డిడి-న్యూస్, దాని ప్రాంతీయ కేంద్రాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. దృశ్యమాధ్యమం ద్వారా నిర్వహిస్తున్న, ఈ ముఖ్యమైన కార్యక్రమంలో, పంచాయతీ రాజ్ విభాగాల అధికారులతో పాటు రాష్ట్ర / జిల్లా / బ్లాక్ / పంచాయతీ స్థాయిలో ఇతర వాటాదారులు కూడా, కోవిడ్-19 నియమ,నిబంధనలు, ప్రజారోగ్య లక్ష్యాలు, కోవిడ్-19 నివారణ చర్యలు, చేతి పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం వంటి ప్రమాణాలపై. రాజీ పడకుండా, పాల్గొంటారు.  2021 ఏప్రిల్, 24వ తేదీ, మధ్యాహ్నం 12:00 గంటలకు "వెబ్-స్ట్రీమింగ్", ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి https://pmindiawebcast.nic.in/  అనే వెబ్-సైట్ లింకు తో లాగిన్ అవ్వండి.

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం (24.04.2021) సందర్భంగా, దేశవ్యాప్తంగా ప్రారంభమౌతున్న స్వామిత్వ పధకంలో పాల్గొనేవారు  https://pmevents.ncog.gov.in/  అనే వెబ్-సైట్ లింకు ద్వారా  ఆన్‌-లైన్‌ లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

 

*****



(Release ID: 1713708) Visitor Counter : 495