ప్రధాన మంత్రి కార్యాలయం
స్వామిత్వ పథకం లో భాగం గా ఇ-ప్రాపర్టీ కార్డుల పంపిణీ ని ఏప్రిల్ 24న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
‘జాతీయ పంచాయతీ అవార్డులు 2021’ ని కూడా ప్రధాన మంత్రి ప్రదానం చేయనున్నారు
Posted On:
23 APR 2021 6:08PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 ఏప్రిల్ 24 (జాతీయ పంచాయతీ రాజ్ దినం) నాడు మధ్యాహ్నం 12 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా స్వామిత్వ పథకం లో భాగం గా ఇ- ప్రాపర్టీ కార్డు ల పంపిణీ ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భం లో 4.09 లక్షల మంది సంపత్తి యజమానుల కు వారి ఇ- ప్రాపర్టీ కార్డుల ను ఇవ్వడం జరుగుతుంది. దీనితో దేశ వ్యాప్తం గా స్వామిత్వ పథకం అమలు లోకి రావడం మొదలవుతుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింహ్ తోమర్ కూడా హాజరు అవుతారు.
ప్రధాన మంత్రి జాతీయ పంచాయతీ రాజ్‌దినాన్ని పురస్కరించుకొని 2021 సంవత్సరానికి జాతీయ పంచాయత్ పురస్కారాలను కూడా ప్రదానం చేయనున్నారు. ‘జాతీయ పంచాయత్ పురస్కారాలు 2021’ ని ఈ కింద ప్రస్తావించిన శ్రేణుల లో భాగం గా ఇవ్వడం జరుగుతుంది:
దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తీకరణ్ పురస్కారాన్ని 224 పంచాయతీలకు, నానాజీ దేశ్ ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ్ సభా పురస్కారాన్ని 30 గ్రామ పంచాయతీల కు, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక పురస్కారాన్ని 29 గ్రామ పంచాయతీలకు, చిన్న పిల్లల పట్ల స్నేహభావం చూపే గ్రామ పంచాయతీ కి పురస్కారాన్ని 30 గ్రామ పంచాయతీల కు ఇస్తారు; వీటితో పాటు, ఇ- పంచాయతీ పురస్కారాన్ని 12 రాష్ట్రాల కు అందజేయడం జరుగుతుంది.
గౌరవనీయ ప్రధాన మంత్రి ఒక మీట ను నొక్కడం ద్వారా, 5 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు విలువైన పురస్కారాల ధన రాశి ని (సహాయ నిధి రూపం లో) బదలాయిస్తారు. ఈ ధన రాశి రియల్ టైమ్ ఆధారితం గా పంచాయతీల తాలూకు బ్యాంక్ ఖాతాల లో నేరు గా బదిలీ కానుంది. ఇలా మొదటి సారి చేయడం జరుగుతోంది.
స్వామిత్వ పథకాన్ని గురించి -
ప్రధాన మంత్రి సామాజిక- ఆర్థిక సాధికారిత, స్వావలంబిత గ్రామీణ భారతదేశాన్ని ప్రోత్సహించేందుకు ఒక కేంద్ర రంగ పథకం రూపం లో 2020 ఏప్రిల్ 24 న స్వామిత్వ ( సర్వే ఆఫ్ విలేజెస్ ఎండ్ మేపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా) ను ప్రారంభించారు. ఈ పథకం లో మేపింగ్ కు, సర్వేక్షణ కు ఆధునిక సాంకేతిక సాధనాల ను ఉపయోగించడం వల్ల గ్రామీణ భారతదేశం లో పరివర్తన ను తీసుకు వచ్చేందుకు ఆస్కారం ఉంది. దీనితో రుణాన్ని పొందడం కోసం గాని, ఇతర ద్రవ్యపరమైన లాభాన్ని పొందడం కోసం గాని గ్రామీణులు వారి సంపత్తి ని ఒక ఆర్థిక సంపద రూపం లో వినియోగించుకొనేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ పథకం లో 2021- 2025 మధ్య కాలం లో యావత్తు దేశం లో దాదాపు గా 6.62 లక్షల గ్రామాల ను చేర్చడం జరుగుతుంది.
ఈ పథకం తాలూకు ప్రయోగాత్మక దశ ను మహారాష్ట్ర, కర్నాటక, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు, పంజాబ్, రాజస్థాన్ ల లో ఎంపిక చేసిన గ్రామాల లో 2020-21 మధ్య అమలుపరచడమైంది.
***
(Release ID: 1713674)
Visitor Counter : 246
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam