ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

సీరమ్ ఇన్ స్టిట్యూట్ టీకామందు కేంద్రానికే ఇచ్చేలా ఒప్పందం నిజం కాదు


తగ్గింపు ధరలకు రాష్ట్రాలు కూడా కొనుక్కోవచ్చు

Posted On: 22 APR 2021 7:24PM by PIB Hyderabad

సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ ఐ ఐ) లో తయారైన టీకామందు మొత్తాన్ని 2021 మే 25 వరకు కేంద్రప్రభుత్వానికి మాత్రమే ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు, అప్పటిదాకా రాష్ట్రాలు అక్కడినుమ్చి కొనుగోలు చేయటానికి వీల్లేదని మీడియాలో వార్తలు వెలువడ్డాయి.

అయితే ఈ వార్తలు పూర్తిగా అబద్ధం, నిరాధారమైనవి.  

దేశవ్యాప్త టీకాల కార్యక్రమాన్ని విస్తరించటానికి, సరళీకృతం చేయటానికి కేంద్ర ప్రభుత్వం 2021 ఏప్రిల్ 19న ఉదార ధర విధానం, వేగవంతమైన కోవిడ్-19 టీకాల కార్యక్రమ వ్యూహం ప్రకటించింది. అది మే 1వ తేదీ నుమ్చి అమలులోకి వస్తోంది.

ఈ  సరళీకృత ధర, వేగవంతమైన జాతీయ కోవిడ్-19 టీకా వ్యూహంలో కీలకమైన అంశాం ఏంటంటే,  టీకామందు తయారీదారులు తాము ఉత్పత్తి చేసిన మందులో 50% మేరకు భారత ప్రభుత్వానికి ఇచ్చి మిగతా 50% డోసులను స్వేచ్చగా రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు స్వేచ్ఛగా టీకామందు సరఫరాదారులనుంచి టీకా డోసులు కొనుగోలు చేసుకోవచ్చు.

అందువలన ప్రతి నెలా ఉత్పత్తిలో 50% డోసులు కేంద్రానికి ఇచ్చినా, మిగిలిన 50% డోసులు రాష్ట్రాలు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కొనసాగుతుంది.

ఈ వ్యూహాన్ని ఇక్కడ చూడవచ్చు:  https://www.mohfw.gov.in/pdf/LiberalisedPricingandAcceleratedNationalCovid19VaccinationStrategy2042021.pdf

పత్రికాప్రకటన ఇక్కడ చూడవచ్చు:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1712710 (19th April 2021)

****



(Release ID: 1713492) Visitor Counter : 146