రైల్వే మంత్రిత్వ శాఖ

గ‌డిచిన‌ 10 రోజుల్లో మహారాష్ట్ర నుండి 432 ప్రత్యేక రైలు సేవలను, ఢిల్లీ ప్రాంతం నుండి 1166 ప్రత్యేక రైలు సేవలను నిర్వ‌హించిన భార‌త రైల్వేలు


- ప్రస్తుతం రోజుకు సగటున మొత్తం 1512 ప్రత్యేక రైలు సేవలను నడుపుతున్న‌
భారత రైల్వే

- మొత్తంగా 5387 సబర్బన్ రైలు సర్వీసులు, 981 ప్యాసింజర్ రైలు సర్వీసులు కూడా పని చేస్తున్నాయి

Posted On: 21 APR 2021 6:22PM by PIB Hyderabad

భారతీయ రైల్వే ప్రయాణికుల సౌలభ్యానికి దేశ వ్యాప్తంగా ప్రత్యేక రైలు సేవలను నడుపుతోంది. ఈ సేవల్లో మెయిల్/ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు మరియు సబర్బన్ రైళ్లు ఉన్నాయి. సాధారణ రైలు సర్వీసులు కాకుండా అదనపు రైళ్లను ఏప్రిల్-మే, 2021 నెలల్లో వేసవి ప్రత్యేక రైళ్ల‌ను నడుపుతోంది. 20.04.2021వ తేదీ నాటికి, భారతీయ రైల్వే రోజుకు సగటున మొత్తంగా 1512 ప్రత్యేక రైలు సేవలను (మెయిల్ / ఎక్స్‌ప్రెస్ మరియు ఫెస్టివల్ స్పెషల్స్) నడుపుతోంది.
మొత్తం 5387 సబర్బన్ రైలు సర్వీసులు, 981 ప్యాసింజర్ రైలు సర్వీసులు కూడా పని చేస్తున్నాయి. 21.04.2021 నాటికి భారత రైల్వే ఉత్తర రైల్వే (ఢిల్లీ ప్రాంతం) నుండి 53 ప్రత్యేక రైలు సర్వీసుల‌ను, సెంట్రల్ రైల్వే 41 ప్రత్యేక రైలు సర్వీసుల‌ను, వెస్ట్రన్ రైల్వే 5 ప్రత్యేక రైలు సర్వీసులను దేశ వ్యాప్తంగా వివిధ గమ్యస్థానాలకు నిర్వహిస్తోంది. 12.04.2021 నుండి 21.04.2021 వరకు, భారత రైల్వే సెంట్రల్ మరియు వెస్ట్రన్ రైల్వేల నుండి మొత్తం 432 ప్రత్యేక రైలు సేవలను, ఉత్తర రైల్వే (ఢిల్లీ ప్రాంతం) నుండి 1166 ప్రత్యేక రైలు సేవలను నిర్వహించింది. భారతీయ రైల్వే వివిధ మార్గాల్లో డిమాండ్ ప్రకారం ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా ప్రయాణించేలా చూడటానికి భారత రైల్వే అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఏదైనా ప్రత్యేక మార్గాల‌లో త‌క్కువ కాలంలో రైళ్లను నడపడానికి భారత రైల్వే పూర్తిగా సిద్ధంగా ఉంది. కోవిడ్ వైర‌స్ వ్యాప్తి దృష్ట్యా, కోవిడ్ మార్గదర్శకాలు మరియు ప్రోటోకాల్‌లకు సంబంధించి రైల్వే ప్రయాణికులు మరియు సాధారణ ప్రజలలో అవగాహన పెంచడానికి భారత రైల్వే అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
                             

*****


(Release ID: 1713368) Visitor Counter : 218