ప్రధాన మంత్రి కార్యాలయం

కేంద్రబ‌డ్జెటు 2020-21 స‌మ‌ర్ప‌ణ అనంత‌రం ప్ర‌ధాన మంత్రి జారీ చేసిన ప్ర‌క‌ట‌న‌

Posted On: 01 FEB 2020 5:42PM by PIB Hyderabad

ఈ ద‌శాబ్దం లోని ఒక‌టో బ‌డ్జెటు ను దార్శ‌నిక‌త, కార్యాచ‌ర‌ణ .. ఈ రెండిటి ని కలిగి ఉన్న బడ్జెటు ను తీసుకువచ్చినందుకు ఆర్థిక మంత్రి నిర్మ‌ల సీతార‌మ‌ణ్ గారిని, ఆమె జ‌ట్టు ను నేను అభినందిస్తున్నాను.

 

బ‌డ్జెటు లో ప్ర‌క‌టించిన కొత్త సంస్క‌ర‌ణ‌లు ఆర్థిక వ్య‌వ‌స్థ కు జోరు ను అందించ‌డం లో సాయ‌ప‌డ‌తాయి. అంతేకాదు, దేశం లో ప్ర‌తి ఒక్క వ్య‌క్తి ని ఆర్థికం గా బ‌ల‌ప‌ర‌చ‌డ‌ంతో పాటు ఈ దశాబ్ది లో ఆర్థిక వ్య‌వ‌స్థ పునాది ని ప‌టిష్టం చేస్తాయి కూడాను.

 

  • , మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, వ‌స్త్రాలు, సాంకేతిక విజ్ఞాన రంగాలనేవి ఉపాధి క‌ల్ప‌న లో ప్ర‌ధాన‌ం అయిన‌టువంటి రంగాలు గా ఉన్నాయి. ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న ను పెంచ‌డం కోసం ఈ నాలుగు అంశాల పైన ఈ బ‌డ్జెటు లో గొప్ప ప్రాముఖ్యాన్ని కట్టబెట్టడం జరిగింది.

 

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దృష్టి తో, 16 కార్యాచ‌ర‌ణ అంశాల ను తీసుకోవడ‌మైంది. అవి గ్రామీణ ప్రాంతాల‌ లో మరిన్ని ఉద్యోగ అవ‌కాశాల‌ ను అందిస్తాయి. ఈ సంవ‌త్స‌రం బ‌డ్జెటు లో వ్య‌వ‌సాయ రంగం కోసం ఒక స‌మ‌గ్ర‌ వైఖ‌రి ని అనుస‌రించ‌డ‌మైంది. ఇది తోట పంట‌లు, చేప‌ల ప‌రిశ్ర‌మ‌, ప‌శు పోష‌ణ రంగాల లో విలువ జోడింపు ను అధికం చేయడమే కాకుండా మ‌రింత మందికి ఉపాధిని కూడా కల్పించ‌నుంది. నీలి ఆర్థిక వ్య‌వ‌స్థ లో భాగం గా యువ‌తీయువకులు సైతం ఫిశ్ ప్రోసెసింగ్‌, మార్కెటింగ్ రంగం లో కొత్త అవ‌కాశాల ను ద‌క్కించుకోనున్నారు.

 

టెక్నిక‌ల్ టెక్స్ టైల్స్ కోసం ఒక కొత్త అభియాన్ ను ప్ర‌క‌టించ‌డ‌మైంది. భార‌త‌దేశం లో వ్య‌క్తులు త‌యారు చేసే ఫైబ‌ర్ ఉత్ప‌త్తి లో ఉప‌యోగించే ముడి పదార్థం తాలూకు సుంకాల స్వ‌రూపం లోనూ సంస్క‌ర‌ణ‌ ల‌ను తీసుకు రావ‌డం జ‌రిగింది. ఈ సంస్క‌ర‌ణ కావాలంటూ గ‌డచిన మూడు ద‌శాబ్దులు గా పెద్ద సంఖ్య లో పట్టుబట్టుతూ వచ్చారు.

 

ఆయుష్మాన్ భార‌త్ యోజ‌న దేశ ఆరోగ్య రంగాని కి ఒక సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. వైద్యులు, న‌ర్సులు, స‌హాయ‌కులు వంటి మాన‌వ వ‌న‌రుల కు తోడు ఈ రంగం లో వైద్య ఉప‌క‌ర‌ణాల త‌యారీ కి భారీ ఆస్కారం ఉంది. దీనిని వృద్ధి చేయడానికి ప్ర‌భుత్వం కొత్త నిర్ణ‌యాల‌ ను తీసుకొంది.

 

ఈ బ‌డ్జెటు లో సాంకేతిక విజ్ఞాన రంగం లో ఉపాధి క‌ల్ప‌న‌ ను ప్రోత్స‌హించ‌డం కోసం మేం అనేక ప్ర‌త్యేక ప్ర‌యాస‌ల‌ ను చేప‌ట్టాం. కొత్త స్మార్ట్ సిటీస్‌, ఎల‌క్ట్రానిక్ మేన్యుఫాక్చ‌రింగ్‌, డేటా సెంట‌ర్‌ పార్క్ స్, బ‌యోటెక్నాల‌జీ, క్వాంట‌మ్ టెక్నాల‌జీ ల వంటి రంగాల లో అనేక విధాన ప‌ర‌మైన కార్య‌క్ర‌మాల ను చేప‌ట్ట‌డం జ‌రిగింది. త‌త్ఫ‌లితం గా భార‌త‌దేశం గ్లోబ‌ల్ వేల్యూ చైన్ లో ఒక అంత‌ర్భాగం అయ్యే దిశ లో ముందంజ వేయగలుగుతుంది.

 

బ‌డ్జెటు లో యువ‌త కు నైపుణ్యాల అభివృద్ధి సాధ‌న ప‌రం గా కొత్త కొత్త కార్య‌క్ర‌మాల ను కూడా ప్ర‌క‌టించ‌డ‌మైంది. ఉదాహ‌ర‌ణ కు డిగ్రీ కోర్సుల లో అప్రెంటిస్ శిప్ స్, స్థానిక సంస్థ‌ల లో ఇంట‌ర్న్ శిప్ స్, అలాగే ఆన్‌లైన్ డిగ్రీ కోర్సు ల ఏర్పాటుల‌ను గురించి చెప్పుకోవ‌చ్చును. ఉద్యోగాలు చేయ‌డం కోసం విదేశాల కు వెళ్ళ‌ద‌ల‌చుకొన్న భార‌త‌దేశ యువ‌జ‌నుల కు బ్రిడ్జ్ కోర్సుల‌ ను కూడా అందించ‌డం జ‌రుగుతోంది.

 

ఉపాధి క‌ల్ప‌న‌ కు అండ‌ గా ఎగుమ‌తి, ఎమ్ఎస్ఎమ్ఇ రంగం ఉంటోంది. ఎగుమ‌తుల‌ ను పెంచేందుకు గాను బ‌డ్జెటు కొత్త ప‌థ‌కాల ను ప్ర‌క‌టించింది. చిన్న వాణిజ్య సంస్థ‌ల కు ఆర్థిక స‌హాయాన్ని అందించ‌డానికి ఎన్నో కొత్త కార్య‌క్ర‌మాల‌ ను తీసుకోవ‌డం జ‌రిగింది.

 

ఆధునిక భార‌త‌దేశం ఆవిష్కారాని కి అధునాత‌న‌మైన‌టువంటి మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కీల‌కం. మౌలిక స‌దుపాయాల రంగం కూడా ఒక పెద్ద ఉపాధి క‌ల్ప‌న సామ‌ర్ధ్యం క‌లిగిన రంగం గా ఉంది. 100 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల వ్య‌యం తో అమలయ్యేట‌టువంటి 65 వంద‌ల ప్రాజెక్టులు ఉపాధి అవ‌కాశాల ను పెద్ద ఎత్తున పెంచ‌నున్నాయి. నేశ‌న‌ల్ లాజిస్టిక్స్ పాలిసీ సైతం వ్యాపారం, వాణిజ్యం, ఉపాధి.. ఈ మూడు రంగాల కు ప్ర‌యోజ‌నాన్ని అందించ‌నుంది. దేశం లో 100 విమానాశ్ర‌యాల ను తీర్చిదిద్దాల‌న్న ల‌క్ష్యం సాధార‌ణ పౌరుల కు నింగి లో విహ‌రించే అనుభ‌వాన్ని ఒక కొత్త శిఖర స్థాయి కి చేర్చడం తో పాటు భార‌త‌దేశ ప‌ర్య‌ట‌న రంగానికి ఒక కొత్త ఉత్సాహాన్ని కూడా ఇవ్వ‌గ‌లదు. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న రంగం లో స్టార్ట్ అప్ స్ ద్వారా, ప్రాజెక్టు అభివృద్ధి కార్య‌క్ర‌మం ద్వారా యువ శ‌క్తి కి మేము ద‌న్ను గా నిలబడతాం.

 

ప‌న్నుల సంబంధింత స్వ‌రూపం లో మౌలిక‌మైన‌టువంటి మార్పులను ప్రవేశపెట్టిన కార‌ణం గా భార‌త‌దేశం లో అనేక రంగాల లో విలువ జోడింపు అవ‌కాశం సైతం పెంపొందనుంది.

 

పెట్టుబ‌డి అనేది ఉద్యోగ క‌ల్ప‌న కు ఒక అతి పెద్ద చోద‌క శ‌క్తి గా ప‌ని చేస్తుంది. ఈ దిశ లో కొన్ని చ‌రిత్రాత్మ‌క‌మైన నిర్ణ‌యాల‌ ను తీసుకోవ‌డం జ‌రిగింది. బాండ్ మార్కెట్ ను ప‌టిష్ట ప‌ర‌చ‌డానికి, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కు దీర్ఘ‌ కాల ప్రాతిప‌దిక‌ న ఆర్థిక స‌హాయాన్ని అందించ‌డాన్ని బ‌లోపేతం చేయడానికి కొన్ని ఏర్పాటుల‌ ను కూడా చేయ‌డం జ‌రిగింది.

 

డివిడెండ్ డిస్ట్రిబ్యూశన్ టాక్సు ను తొల‌గించినందువ‌ల్ల కంపెనీ ల చేతి లోకి 25 వేల కోట్ల రూపాయ‌లు వ‌స్తాయి. ఇది ఆయా కంపెనీ లు మళ్లీ పెట్టుబ‌డి పెట్టుకోవడం లో తోడ్పడనుంది. భార‌త‌దేశం లోకి విదేశీ పెట్టుబ‌డి ని ఆక‌ర్షించ‌డానికి గాను వివిధ ప‌న్నుల సంబంధిత రాయితీ లను ఇవ్వ‌డ‌మైంది. స్టార్ట్ అప్ స్ కు, స్థిరాస్తి రంగానికి కూడా ప‌న్నుల ప‌రం గా ప్ర‌యోజ‌నాల ను క‌ల్పించ‌డ‌ం జరిగింది. ఈ నిర్ణ‌యాలు అన్నీ ఆర్థిక వ్య‌వ‌స్థ కు జోరు ను అందించి, యువ‌త కు కొత్త ఉద్యోగ అవ‌కాశాల ను ఇవ్వ‌నున్నాయి.

 

ఇక వివాద్ సే విశ్వాస్దిశ లో మ‌నం ఆదాయ ప‌న్ను వ్య‌వ‌స్థ‌ లో ఒక ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టాం.

 

ఇంత‌వ‌ర‌కు మ‌న కంపెనీ చ‌ట్టాల లో సివిల్ స్వ‌భావం తాలూకు పొర‌పాటులకు ఆస్కారం ఉన్న వాటిలో కొన్నిటిని డి-క్రిమినలైజ్ చేసేందుకు ఒక ప్ర‌ధాన‌ నిర్ణ‌యాన్ని తీసుకోవ‌డ‌ం జరిగింది. ప‌న్ను చెల్లింపుదారుల హ‌క్కుల ను ఒక ప‌న్ను చెల్లింపుదారు నియామ‌వ‌ళి ద్వారా వివ‌రించ‌డం జ‌రుగుతుంది.

 

ఎమ్ఎస్ఎమ్ఇ ల‌తో అనుబంధం క‌లిగిన‌టువంటి చిన్న, న‌వ పారిశ్రామిక‌వేత్త‌ల పై మా ప్ర‌భుత్వం ఎల్ల‌ప్ప‌టికీ భరోసా పెట్టుకొంటూ వ‌చ్చింది. 5 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ట‌ర్నోవ‌ర్ పైన లెక్క‌ ల త‌నిఖీ ఇక ఎంత‌మాత్ర‌ం ఉండ‌బోదు. తీసుకొన్న మ‌రొక పెద్ద నిర్ణ‌యం ఏమిటి అంటే, అది డిపాజిట‌ర్ లకు సంబంధించిన బీమా. డిపాజిట‌ర్ ల డ‌బ్బు బ్యాంకుల లో సుర‌క్షితం గా ఉండేట‌ట్లు చూడ‌టం కోసం డిపాజిట్ బీమా ప‌రిమితి ని ఒక ల‌క్ష రూపాయ‌ల నుంచి పెంచి 5 ల‌క్ష‌ల రూపాయ‌లుగా చేయడం జ‌రిగింది.

 

ఈ బ‌డ్జెటు క‌నీస స్థాయి ప్ర‌భుత్వం, గ‌రిష్ఠ స్థాయి పాల‌న తాలూకు వ‌చ‌న బ‌ద్ధ‌త ను మ‌రింత‌గా బ‌లోపేతం చేసింది.

 

ఫేస్‌లెస్ అపీలు కు అవ‌కాశం, ప్ర‌త్య‌క్ష ప‌న్నుల సేక‌ర‌ణ‌ కు సంబంధించి స‌రికొత్త‌దీ, సుల‌భ‌మైందీ అయినటువంటి వ్య‌వ‌స్థ, పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ కు పెద్ద పీట వేయడం, ఆటో ఇన్ రోల్ మెంట్ పద్ధ‌తి లో యూనివర్సల్ పెన్శన్ కు వెసులుబాటు, యూనిఫైడ్ ప్రొక్యూర్ మెంట్ సిస్టమ్ దిశ గా ప‌య‌నించడం.. ఇవి ఎటువంటి అడుగులు అంటే , ఇవి ప్ర‌జల జీవ‌నం లో ప్ర‌భుత్వం ప్ర‌మేయాన్ని త‌గ్గిస్తాయి; వారికి జీవ‌న సౌల‌భ్యాన్ని ఇనుమ‌డింపజేస్తాయి.

 

గ‌రిష్ఠ స్థాయి పాల‌న లో భాగం గా ఒక ల‌క్ష గ్రామ పంచాయ‌తీల లో ఆంగ‌న్‌వాడీ ల‌ను, పాఠ‌శాల‌ లను, హెల్థ్ ఎండ్ వెల్‌ నెస్ సెంట‌ర్ స్ ను, పోలీసు ఠాణా లను బ్రాడ్ బ్యాండ్ తో జ‌త ప‌ర‌చ‌డమనేది ఒక చ‌రిత్రాత్మ‌క‌మైన ఆరంభం కానుంది.

 

ప్ర‌స్తుతం ఒక ప్ర‌భుత్వోద్యోగాన్ని చేజిక్కించుకోవాలి అంటే యువ‌జ‌నులు అనేక వేరు వేరు ప‌రీక్ష‌ల కు హాజరు కావ‌ల‌సి ఉంటుంది. ఈ ప‌ద్ధ‌తి ని మార్చివేసి, ఇప్పుడు నేశ‌న‌ల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ద్వారా ఆన్‌లైన్ మాధ్య‌మం లో ఉమ్మ‌డి ప‌రీక్ష రూపం లో నియామకాలు జ‌రుగ‌నున్నాయి.

 

రైతుల‌ కోసం వారు వారి ఉత్ప‌త్తుల ను సరి అయిన విధం గా మార్కెట్ చేసుకోవడానికి, ర‌వాణా చేసుకోవ‌డానికి వీలు గా కిసాన్ రైల్‌, కృషి ఉడాన్ ప‌థ‌కాల ద్వారా స‌రికొత్త వ్యవస్థలను అందుబాటు లోకి తీసుకు రావ‌డం జ‌రుగుతుంది.

 

ఈ బ‌డ్జెటు ఆదాయాన్ని, పెట్టుబ‌డిని పెంచుతుందని, గిరాకీ ని, వినియోగాన్ని అధికం చేస్తుంద‌ని, అంతేకాకుండా

 

ఆర్థిక వ్య‌వ‌స్థ తో పాటు, ప‌ర‌ప‌తి మంజూరు కు కూడా నూత‌న స్ఫూర్తి ని ను అందిస్తుంద‌న్న నాకు నమ్మకం ఉంది.

 

ఈ బ‌డ్జెటు దేశం ప్ర‌స్తుతం అవ‌స‌రాల‌నే కాకుండా, ఈ ద‌శాబ్దం లో భ‌విష్య‌త్తు తాలూకు ఆకాంక్ష‌ల ను కూడా నెర‌వేర్చ‌ుతుంది.

 

నేను మరో సారి దేశానికి, నిర్మ‌ల గారి కి, మ‌రి ఆర్థిక మంత్రిత్వ శాఖ జ‌ట్టు కు ఈ బ‌డ్జెటు ను తీసుకు వ‌చ్చినందుకు గాను అభినందనలు తెలియజేస్తున్నాను.

 

అనేకానేక ధ‌న్య‌వాదాలు.

 

***

 



(Release ID: 1713190) Visitor Counter : 101