మంత్రిమండలి

ఆర్థిక బిల్లు, 2021 లో సవరణల కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 20 APR 2021 3:42PM by PIB Hyderabad

ఆర్థిక బిల్లు, 2021 లో ప్రభుత్వ సవరణ ల కు (వీటికి 2021 మార్చి నెల 28న ఆర్థిక చట్టం, 2021 పేరిట చట్టరూపాన్ని ఇవ్వడమైంది) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.

ఈ ప్రతిపాదనలకు స్పష్టత ను, హేతుబద్ధత ను ఇవ్వడానికి, దానితో పాటు ఆర్థిక బిల్లు లో ప్రతిపాదించిన సవరణల విషయం లో తత్సంబంధిత ప్రయోజనాలు ఇమిడివున్న వర్గాల తాలూకు ఆందోళనలను తొలగించడానికి
ఈ సవరణలు అవసరమయ్యాయి.

ఉద్దేశ్యాలు:

ఆర్థిక బిల్లు, 2021 లలో ప్రభుత్వ సంస్కరణల తో బిల్లు లో ప్రతిపాదించినటువంటి సంస్కరణ ల ప్రభావం పై సంబంధిత వర్గాల లో ఎదురయ్యే ఆందోళనలను పరిష్కరించి పన్ను ల చెల్లింపుదారులందరి కి సమానమైనటువంటి, సమ్మిళితమైనటువంటి  వాతావరణాన్ని సమకూర్చడం జరుగుతుంది.

ఆర్థిక బిల్లు, 2021 లో ప్రభుత్వం చేయదలచుకొన్న సవరణ లు ముఖ్యంగా పన్నుల తాలూకు ప్రతిపాదన లు.  అవి ప్రభుత్వానికి సమయానికి ఆదాయాన్ని సంపాదించిపెట్టడం తో పాటు పన్ను ల చెల్లింపుదారుల ఫిర్యాదుల ను దూరం చేసి, తద్వారా ఇప్పుడు అమలు అవుతున్న ఏర్పాటుల ను సువ్యవస్థితం చేస్తాయి కూడా.



 

***
 


(Release ID: 1713077) Visitor Counter : 234