కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు ఈపీఎఫ్ లో 69.58 లక్షల మంది చందాదారులు చేరారు.
Posted On:
20 APR 2021 5:08PM by PIB Hyderabad
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 12.37 లక్షల మంది నికర చందాదారులతో కొత్తగా చేరారని ఎంప్లాయ్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) మంగళవారం విడుదల చేసిన తాత్కాలిక పేరోల్ డేటా వెల్లడించింది. కొవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ, ఈపీఎఫ్ఓ లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 69.58 లక్షల మంది చందాదారులుగా చేరారు. ఈ సంవత్సరం జనవరి పోలిస్తే ఫిబ్రవరిలో చందాదారుల పెరుగుదలలో 3.52శాతం వృద్ధి కనిపించింది. గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో నికర చందాదారులలో 19.63శాతం పెరుగుదలను సాధ్యపడింది. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ఏబీఆర్వై, పీఎంజీకేవై, పీఎంఆర్పీవై పథకాల ద్వారా ఆర్థిక వ్యవస్థను లాంఛనప్రాయంగా మార్చడానికి విధాన మద్దతు ఇవ్వడం, నిరంతరాయంగా సేవలు అందించడానికి ఈపీఎఫ్ఓ తీసుకున్న కార్యక్రమాలు కూడా ఈ విజయానికి కొంతవరకు కారణమని చెప్పవచ్చు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో చేరిన 12.37 లక్షల నికర చందాదారులలో, సుమారు 7.56 లక్షల మంది కొత్త సభ్యులు మొదటిసారి ఈపీఎఫ్ఓ సామాజిక భద్రతా పరిధిలోకి వచ్చారు. సుమారు 4.81 లక్షల మంది చందాదారులు వెళ్లిపోయినప్పటికీ, తరువాత కొత్త ఉద్యోగాల ద్వారా తిరిగి ఈపీఎఫ్ఓలో తిరిగి చేరారు. ఫైనల్ సెటిల్మెంట్ కోరుకోకుండా అకౌంట్ల ట్రాన్స్ఫర్స్/మెర్జ్ల ద్వారా సభ్యత్వాన్ని నిలుపుకున్నారు. వ్యక్తులు / సంస్థలు, యజమానులు అప్‌లోడ్ చేసిన డేటా ఆధారంగా వెళ్లిపోయిన చందాదారుల సంఖ్యను లెక్కిస్తారు. అయితే కొత్త చందాదారుల సంఖ్య కొత్తగా పెరిగిన యూనివర్సల్ అకౌంట్ నంబర్లపై (యుఎఎన్) పై ఆధారపడి ఉంటుంది. వీళ్లకు నాన్–జీరో సభ్యత్వం ఉంటుంది. వయస్సు వారీగా వివరాలను గమిస్తే 2021 ఫిబ్రవరిలో 22-25 ఏళ్ల మధ్య వయస్సు వాళ్లు అత్యధిక సంఖ్యలో ఈపీఎఫ్లో చేశారు. ఈ వయసు బ్రాకెట్లో సుమారు 3.29 లక్షల నికర చందాదారులు ఉన్నారు. దీని తరువాత 29-35 ఏళ్ల వయస్సు-బ్రాకెట్లో 2.51 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. వీరిని అనుభవజ్ఞులైన కార్మికులుగా పరిగణించవచ్చు. కెరీర్ పురోగతి కోసం వీళ్లు ఉద్యోగాలను మార్చారు. ఈపీఎఫ్ఓ లో సభ్యత్వాన్ని ఉంచుకోవాలని కోరుకున్నారు. పరిశ్రమల వారీగా డేటాను చూస్తే ఫిబ్రవరి 2021 లో మొత్తం ఎక్స్పర్ట్ సర్వీసెస్ కేటగిరి ఎక్కువగా ఉంది. 4.99 లక్షల మంది చేరారు. తరువాత ‘ట్రేడింగ్-వాణిజ్య సంస్థల’ వర్గం నుంచి సుమారు 84,000 మంది చందాదారులు చేరారు.
మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కొత్త చందాదారుల చేరికలో ముందంజలో ఉన్నాయని ఈపీఎఫ్ఓ డేటా ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 38.14 లక్షల నికర చందాదారులను చేర్చుకోవడం ద్వారా ఈపీఎఫ్ఓల ఈ ఐదు రాష్ట్రాల వాటా 54.81 శాతానికి చేరింది. ఆడామగల వారీగా విశ్లేషిస్తే 2021 ఫిబ్రవరి నెలలో సుమారు 2.60 లక్షల మంది మహిళా చందాదారులను పీఎఫ్ ఖాతా తీసుకున్నారు. నెలలో మొత్తం కొత్త చందాదారుల్లో వీరి వాటా 21శాతం ఉంది. 2020 జనవరి మునుపటి నెలతో పోలిస్తే సుమారు 12.74శాతం పెరుగుల కనిపించింది.
ఉద్యోగుల రికార్డును నవీకరించడం నిరంతర ప్రక్రియ కాబట్టి పేరోల్ డేటాను తాత్కాలిక సమాచారమని భావించాలి. పాత డేటాను ప్రతి నెలా నవీకరిస్తారు. సెప్టెంబర్ 2017 కాలం వరకు ఉన్న పేరోల్ డేటా సహా ఎప్పటికప్పుడు కొత్త డేటాను ఏప్రిల్, 2018 నుండి ఈపీఎఫ్ఓ విడుదల చేస్తోంది. ఇందులో అదే నెల చేరినవారి డేటాతోపాటు చందా కట్టిన వారి వివరాలను ప్రచురిస్తారు. కోవిడ్ 19 మహమ్మారి క్లిష్ట సమయంలో, ఈపీఎఫ్ఓ తన చందాదారులందరికీ సహాయం అందించడానికి కట్టుబడి ఉంది. నిరంతరాయమైన సేవలను అందించేడానికి నవీన సామాజిక భద్రతా సంస్థగా అవతరిస్తోంది.
***
(Release ID: 1713075)
Visitor Counter : 144