రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ రక్షణ, సాయుధ దళాల మంత్రిత్వశాఖ సన్నద్ధతపై సమీక్ష జరిపారు.

Posted On: 20 APR 2021 4:35PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రక్షణశాఖ, సాయుధ దళాల సంసిద్ధతను సమీక్షించడానికి 2021 ఏప్రిల్ 20న న్యూ ఢిల్లీలో రక్షణమంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావణే, డైరెక్టర్ జనరల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (ఎఎఫ్ఎంఎస్) సర్గ్ వైస్ అడ్మిరల్ రజత్ దత్తా, కార్యదర్శి (రక్షణ ఉత్పత్తి) శ్రీ రాజ్ కుమార్, కార్యదర్శి శాఖ డిఫెన్స్ ఆర్ అండ్ డి మరియు ఛైర్మన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి మరియు ఇతర సీనియర్ సివిల్ & మిలిటరీ అధికారులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు.

పౌర పరిపాలనకు సహాయం అందించడంలో ఏఎఫ్‌ఎంఎస్‌, డిఆర్‌డివో, డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ (డిపిఎస్‌యులు), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు (ఓఎఫ్‌బి) మరియు రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క ఇతర సంస్థలు జాతీయ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సిసి) తీసుకున్న చర్యల గురించి శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. సంక్షోభ సమయంలో సివిల్ అడ్మినిస్ట్రేషన్ / రాష్ట్ర ప్రభుత్వాలకు త్వరగా ఆక్సిజన్ సిలిండర్లు మరియు అదనపు పడకలను అందించడానికి డిపిఎస్‌యులు, ఓఎఫ్‌బి, డిఆర్‌డిటో యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని ఆయన సూచించారు. సాయుధ దళాలు రాష్ట్ర ప్రభుత్వాలతో సన్నిహితంగా ఉండాలని, అవసరమైన సహాయం అందించడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. క్లిష్ట సమయాల్లో స్పందించడానికి అవసరమైన అత్యవసర అధికారాలను కూడా  రక్షణ మంత్రి వారికి అప్పగించారు.

కొవిడ్-19 బాధితులకు చికిత్సను అందించేందుకు న్యూఢిల్లీలో డిఆర్‌డివో అభివృద్ధి చేసిన కేంద్రం మళ్లీ పనిచేస్తుందని, త్వరలోనే పడకల సంఖ్యను 250 నుండి 500 కు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని రక్షణమంత్రికి తెలిపారు. పాట్నాలోని ఈఎస్‌ఐసీ కోవిడ్ ఆసుపత్రిగా మార్చబడిందని..500 పడకలతో పనిచేయడం ప్రారంభించిందని డాక్టర్‌ రెడ్డి తెలిపారు. లక్నోలో 450 పడకల ఆసుపత్రి, వారణాసిలో 750 పడకల ఆసుపత్రి, అహ్మదాబాద్‌లో 900 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసే పని యుద్ధప్రాతిపదికన జరుగుతోందని ఆయన తెలియజేశారు.

ఎల్‌సిఎ తేజస్ కోసం అభివృద్ధి చేసిన ఆన్ బోర్డ్ ఆక్సిజన్ జనరేషన్ టెక్నాలజీ ఆధారంగా నిమిషానికి 1000 లీటర్ల సామర్థ్యం గల ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల సాంకేతిక పరిజ్ఞానం పరిశ్రమకు ఇవ్వబడిందని..ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అలాంటి ఐదు ప్లాంట్లను ఆర్డర్ చేసిందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌కు తెలిపారు. ఆసుపత్రి అవసరాలను తీర్చడానికి పరిశ్రమల ద్వారా మరిన్ని ప్లాంట్లను సరఫరా చేయవచ్చని డాక్టర్ రెడ్డి రక్షణ మంత్రికి తెలియజేశారు. భారీ ఎత్తులో విధులు నిర్వహిస్తున్న సైనికుల కోసం అభివృద్ధి చేయబడిన ఎస్‌పిఓ2 (బ్లడ్ ఆక్సిజన్ సంతృప్త) ఆధారిత అనుబంధ ఆక్సిజన్ డెలివరీ వ్యవస్థ కోవిడ్ రోగులకు వారి పరిస్థితులు సారూప్యంగా మారడానికి ఉపయోగపడతాయని ఆయన అన్నారు.డిఆర్‌డివో అందించిన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పరిశ్రమలు తయారు చేసిన ఉత్పత్తి త్వరలో మార్కెట్లో అందుబాటులోకి రానుంది.

ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవటానికి పౌర పరిపాలన / రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేయడానికి టీకాలు వేసిన రిటైర్డ్ సాయుధ దళాల సేవలను ఉపయోగించుకోవాలని రక్షణ మంత్రి సూచించారు.

ఈ సమావేశంలో శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సాయుధ దళాల సిబ్బంది మరియు రక్షణ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న అధికారులు / సిబ్బందిలో కొవిడ్-19 వ్యాప్తి చెందే అవకాశాలపైచర్చించారు. కార్యాలయాల్లోకొవిడ్ నియంత్రణ చర్యలపై దృష్టి పెట్టాలని అన్ని సమయాల్లో మాస్క్‌లు ధరించడం మరియు భౌతిక దూరాన్ని పాటించడం వంటి అన్ని చర్యలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు.

***



(Release ID: 1713074) Visitor Counter : 190