రక్షణ మంత్రిత్వ శాఖ
భారత, వియత్నాం రక్షణ మంత్రిత్వ శాఖల వెబ్‌నార్ కమ్ ఎక్స్‌పో నిర్వహణ
Posted On:
20 APR 2021 4:59PM by PIB Hyderabad
భారత రక్షణ మంత్రిత్వ శాఖ, వియత్నాం జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య ఏప్రిల్ 20, 2021న వెబ్‌నార్ కమ్ ఎక్స్‌పో నిర్వహించారు. ‘భారత- వియత్నాం రక్షణ సహకారం’ అనే
ఇతివృత్తంతో ఈ వెబ్‌నార్ నిర్వహించడం జరిగింది. మన దేశానికి చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ ఫోర్జ్, ఎకనామిక్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ మరియు ఇంజనీర్స్, గోవా షిప్‌యార్డ్స్ లిమిటెడ్, హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్, లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్, మహీంద్రా డిఫెన్స్, ఎంకేయు, ఎస్‌ఎమ్‌పీపీ, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ వంటి వివిధ కంపెనీలు, తమ రక్షణ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచాయి. మొత్తం ముప్పై ఏడు కంపెనీలు ఎక్స్‌పోలో వర్చువల్ ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. హనోయ్‌లో భారత రాయభారి శ్రీ
ప్రణయ్ వర్మ, వియత్నాం జాతీయ రక్షణ శాఖకు చెందిన చీఫ్ ఆఫ్ జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ లెఫ్టినెంట్ జనరల్ ట్రాన్ హాంగ్ మిన్ మరియు ఇరువైపుల ఇతర సీనియర్ అధికారులు ఈ వెబ్‌నార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంయుక్త కార్యదర్శి (డిఫెన్స్ ఇండస్ట్రీస్ ప్రొడక్షన్) శ్రీ అనురాగ్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ స్వయం-రిలయంట్ ఇండియా’ ఉద్దేశం కేవలం స్వీయ అవసరాలను చూడటం మాత్రమే కాదని, తక్కువ ఖర్చుతో కూడిన నాణ్యమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడం, మొత్తం ప్రపంచానికి ముఖ్యంగా స్నేహపూర్వక దేశాలకు అవసరాలకు తగ్గట్టుగా అందించడమని నొక్కి చెప్పారు. భారతీయ నౌకా నిర్మాణం ఈ రంగంలో అద్భుతమైన నైపుణ్యాన్ని సాధించిందని అన్నారు. భారతీయ షిప్‌యార్డులు వియత్నాం షిప్ యార్డులతో కలిసి ప్లాట్‌ఫారమ్‌ల నిర్మాణం, మరమ్మత్తు, నిర్వహణ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఫిక్కీ ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖ రక్షణ ఉత్పత్తి విభాగం ఆధ్వర్యంలో ఈ వెబ్‌నార్ నిర్వహించబడింది. రక్షణ ఎగుమతులను పెంచడానికి మరియు 2025 నాటికి 5 బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతి లక్ష్యాన్ని సాధించడానికి స్నేహ పూర్వక విదేశీ దేశాలతో నిర్వహించబడుతున్న వెబ్‌నార్ల శ్రేణిలో భాగంగా దీనిని నిర్వహించారు.
***
(Release ID: 1713071)