మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఐఐఎం రోహ్తక్ వార్షిక సమావేశంలో ప్రసంగించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
Posted On:
19 APR 2021 4:28PM by PIB Hyderabad
కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ ఈ రోజు ఐఐఎం రోహ్తక్ వార్షికోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కాన్వొకేషన్ కార్యక్రమానికి ఎంబీఏ ప్రోగ్రాం నుంచి మొత్తం 480 మంది విద్యార్థులు, డాక్టోరల్ కార్యక్రమం నుంచి 12 మంది విద్యార్థులు హాజరయ్యారు. గ్రాడ్యుయేషన్ పొందిన విద్యార్థుల విజయాన్ని ప్రశంసిస్తూ శ్రీ పోఖ్రియాల్ అభినందనలు తెలిపారు. మన దేశానికి, సమాజానికి మేలు చేసేలా కష్టపడి పనిచేయాలని కూడా మంత్రి ఈ సందర్భంగా విద్యార్థులను ప్రోత్సహించాడు. విద్యార్థులు తమ ప్రతిభను ఉత్తమమైన రీతిలో ఉపయోగించుకోవాలని సూచించారు. భారతదేశ @ 75 మిషన్ సాకారానికి గాను విద్యార్థులు అర్ధవంతంగా సహకరించాలని మంత్రి కోరారు. విద్యార్థుల భవిష్యత్ ప్రయత్నాలలో విజయం చేకూరాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఐఐఎం తన విద్యార్థుల జనాభాలో లింగం, విద్యా వైవిధ్యాన్ని మెరుగుపరిచేలా అనూహ్యంగా పని చేసినందుకు మంత్రి అభినందించారు. ప్రధాన మంత్రి దృష్టి కోణమైన "బేటి బచావో మరియు బేటి పడావో.." మిషన్ దృష్టిని గ్రహించేందుకు గాను ఇన్‌స్టిట్యూట్ యొక్క ప్రయత్నాలు సహాయపడతాయని అన్నారు. గురుగ్రామ్‌లో కొత్త క్యాంపస్‌ను ప్రారంభించినందుకు, కొత్త కార్యక్రమాలు, నిర్వహణ విద్యలో మహిళలను సాధికారత సాధించినందుకు ఐఐఎం రోహ్తక్‌ను కేంద్ర మంత్రి శ్రీ పోఖ్రియాల్ అభినందించారు. పరిశోధన మరియు విధాన పనులకు ప్రేరణనిచ్చే ప్రయత్నాలను ప్రశంసించారు. దేశ యువతకు మేటి నాణ్యత గల విద్యను పొందటానికి ఎక్కువ అవకాశాలను కల్పించడానికి.. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఐఐఎంలు, ఐఐటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాల సంఖ్యను కూడా పెంచిందని శ్రీ పోఖ్రియాల్ పేర్కొన్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారతీయ విద్యాసంస్థలు తమ స్థానాన్ని మెరుగుపరుస్తున్నాయని, విద్యా ర్యాంకింగ్స్‌లో ఐఐఎం రోహ్తక్ కూడా మెరుగుపడిందని ఆయన పేర్కొన్నారు. అయిదు సంవత్సరాల ఇంటి గ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ లా (బీబీఏ-ఎల్ఎల్‌బీ) ను ఈ సంవత్సరం ఇన్స్టిట్యూట్ అందిస్తోంది. ఈ తరహా కార్యక్రమాన్ని ప్రారంభించిన మొదటి మరియు ఏకైక ఐఐఎం సంస్థ ఐఐఎం రోహ్తక్.
******
(Release ID: 1712754)
Visitor Counter : 137