గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

భారతదేశం మరియు జర్మనీలు ‘సిటీస్ కంబాటింగ్‌ ప్లాస్టిక్ ఎంటరింగ్‌ ది మెరైన్‌ ఎన్విరాన్‌మెంట్‌’పై ఒప్పందం కుదుర్చుకున్నాయి


స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రాజెక్ట్ ఫలితాలు

కాన్పూర్, కొచ్చి మరియు పోర్ట్ బ్లెయిర్‌లకు ఈ ప్రాజెక్ట్ కింద మద్దతు పొందనున్నాయి

Posted On: 19 APR 2021 3:18PM by PIB Hyderabad

 

భారత ప్రభుత్వానికి చెందిన గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంవోహెచ్‌యుఏ) జర్మనీ ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్‌, నేచుర్ కంజర్‌వెటింగ్‌ అండ్ న్యూక్లియర్ సెప్ట్‌టీ తరఫున డాయిష్ గెసెల్స్‌చాఫ్ట్ ఫర్ ఇంటర్నేషనల్ జుసామెనార్‌బీట్ (జిఐజడ్‌) జిఎమ్‌బిహెచ్ ఇండియాలు ‘సిటీస్ కంబాటింగ్‌ ప్లాస్టిక్ ఎంటరింగ్‌ ది మెరైన్‌ ఎన్విరాన్‌మెంట్‌’అనే పేరుతో సాంకేతిక సహకారానికి సంబంధించి న్యూఢిల్లీలో జరిగిన వర్చువల్‌ కార్యక్రమంలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. కార్యక్రమంలో ఎంవోహెచ్‌యుఏ కార్యదర్శి శ్రీ దుర్గా శంకర్ మిశ్రా మాట్లాడుతూ “2021 మన ఇరు దేశాల మధ్య 63 సంవత్సరాల ఫలవంతమైన అభివృద్ధికి సంబంధించిన సహకారాన్ని సూచిస్తుంది. మా జర్మన్ భాగస్వామితో ఈ కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ప్రాజెక్ట్ యొక్క ఫలితాలు స్వచ్ఛమైన భారత్ మిషన్-అర్బన్ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయి మరియు 2022 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను తొలగించాలన్న గౌరవ ప్రధానమంత్రి విజన్‌ మేరకు ఇవి ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణపై దృష్టి సారించాయి ” అని తెలిపారు.


శ్రీ కమ్రాన్ రిజ్వి అదనపు కార్యదర్శి, ఎంవోహెచ్‌యుఏ, డా. రెజీనా దుబె,  డైరెక్టర్‌ జనరల్‌, జర్మన్ ఫెడరల్‌ మినిస్ట్రీ ఫర్‌ ది ఎన్విరాన్‌మెంట్‌, నెచుర్‌ కంజర్‌వెటింగ్‌ అండ్‌ న్యూక్లియర్‌ సెఫ్టీ(బిఎంయు) డా.అంట్జే బెర్గర్‌, ఫస్ట్‌ సెక్రటరి, క్లైమెట్‌ అండ్ ఎన్విరాన్‌మెంట్‌, జర్మనీ రిపబ్లిక్‌ ఎంబసీ, డా.జూలీ రివైర్‌, జిఐజెడ్‌ ఇండియా కంట్రీ డైరెక్టర్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వర్చువల్ సదస్సులో ఉత్తర ప్రదేశ్, కేరళ మరియు అండమాన్ & నికోబార్ దీవుల రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు మరియు కాన్పూర్, కొచ్చి మరియు పోర్ట్ బ్లెయిర్ నగరాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు.


రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మరియు ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీలు 2019 లో సంతకం చేసిన 'ప్రివేన్షన్‌ మెరైన్ లిట్టర్'సహకారానికి సంబంధించిన ఉమ్మడి డిక్లరేషన్ యొక్క ఆకృతుల క్రింద ఈ ప్రాజెక్ట్ నిర్వహించబడింది. సముద్రంలోకి ప్లాస్టిక్ వ్యర్ధాలు ప్రవేశించకుండా నిరోధించే పద్ధతులను పెంచే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ జాతీయ స్థాయిలో (ఎంవోహెచ్‌యు) ఎంపిక చేయబడ్డ ఉత్తర ప్రదేశ్, కేరళ మరియు అండమాన్ & నికోబార్ రాష్ట్రాల్లోని  కాన్పూర్, కొచ్చి మరియు పోర్ట్ బ్లెయిర్ నగరాల్లో మూడున్నర సంవత్సరాల పాటు చేపట్టబడుతుంది.


సముద్రవ్యర్ధాలు పర్యావరణ వ్యవస్థలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా మత్స్య మరియు పర్యాటక పరిశ్రమలపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తున్నాయి.తద్వారా ప్రతికూల ఆర్థిక ప్రభావంతో పాటు, మైక్రో ప్లాస్టిక్ గురించి పెరిగిన ఆందోళనలు మరియు ఆహార సరఫరాలోకి  కణాలు వచ్చే ప్రమాదం ఉన్నందున ఇది ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇటీవలి కాలంలో మన్నికైన సింథటిక్ పదార్థాల ఉత్పత్తి మరియు వాడకం ద్వారా మన మహాసముద్రాలు మరియు సముద్ర పర్యావరణ వ్యవస్థలలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాల స్థాయి ప్రజలను మరియు విధాన రూపకర్తలను అప్రమత్తం చేసింది. మొత్తం ప్లాస్టిక్‌లలో 15-20% నది పర్యావరణ వ్యవస్థల ద్వారా మహాసముద్రాలలోకి ప్రవేశిస్తున్నట్లు అంచనా వేయబడింది. వీటిలో 90% ప్రపంచంలోని అత్యంత కలుషితమైన నదులలో 10 ఉన్నాయి. వీటిలో రెండు నదీ వ్యవస్థలు భారతదేశంలో ఉన్నాయి. అవి గంగా మరియు బ్రహ్మపుత్ర.


దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు సముద్రపు కాలుష్యంపై ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేనప్పటికీ ఈ ప్రాజెక్ట్ స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ అమలుకు మద్దతు ఇస్తుంది. ప్లాస్టిక్ వ్యర్ధాలు నదులు మరియు నీటి వనరులలోకి ప్రవేశించకుండా నిరోధించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఆ మేరకు ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, వేరుచేయడం మరియు మార్కెటింగ్ మెరుగుపరచడానికి, నీటి వనరులకు ప్లాస్టిక్ పారవేయడాన్ని నివారించడానికి మరియు పోర్ట్,సముద్ర వ్యర్థాల నిర్వహణను మెరుగుపరుస్తుంది. అలాగే ఇది డేటా మేనేజ్‌మెంట్ మరియు రిపోర్టింగ్ సిస్టమ్స్, సివిల్ సొసైటీ ప్రమేయం మరియు రీసైక్లర్ పరిశ్రమతో డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా నగరాలకు సహకారం అందిస్తుంది. మునిసిపాలిటీలలో వ్యర్థాలను వేరుచేయడం, సేకరించడం, రవాణా చేయడం, శుద్ధి చేయడం మరియు పారవేయడం వంటి కార్యక్రమాలను మరింత మెరుగు పరుస్తుంది.  సమర్థవంతమైన వ్యవస్థ ఏర్పాటు ద్వారా ఇది నదులు లేదా మహాసముద్రాలలోకి వ్యర్థాలు  రాకుండా చూస్తుంది.


ఇండో జర్మన్ ద్వైపాక్షిక అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్థిరమైన పట్టణాభివృద్ధికి పనిచేస్తున్న మరో విజయవంతమైన సహకార ప్రయత్నంగా ఈ కొత్త ప్రాజెక్ట్  రూపొందించబడింది.


మరింత సమాచారం కోసం దయచేసి అనుసరించండి:


Facebook Swachh Bharat Mission - Urban | @SUID.India

Twitter - @SwachhBharatGov| @giz_gmbh, giz_india 

 

***



(Release ID: 1712714) Visitor Counter : 251