ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్‌-19 ని ఎదుర్కోవడానికి సార్వజనిక ఆరోగ్య సన్నాహాల పై సమీక్ష ను నిర్వహించిన ప్ర‌ధాన‌ మంత్రి


టెస్టింగ్‌, ట్రేకింగ్‌, చికిత్స ల కంటే ప్ర‌త్యామ్నాయం లేదు :   ప్ర‌ధాన‌ మంత్రి

కోవిడ్ రోగుల‌కు ఆసుపత్రి పడక లు అందుబాటు లో ఉండేలాగా వాటి సంఖ్య ను పెంచే చ‌ర్య‌లు అన్నిటిని తీసుకోవాలి:  ప్ర‌ధాన‌ మంత్రి


ప్ర‌జ‌ల ఆవేద‌న‌ల ను, ఆందోళ‌న‌ల ను స్థానిక యంత్రాంగం మరింత అధిక సక్రియాత్మకంగాను, సున్నితత్వం తోను ప‌రిశీలించాలి :  ప్ర‌ధాన‌ మంత్రి

రెమ్ డెసివిర్‌, ఇతర ఔష‌ధాల స‌ర‌ఫ‌రా స్థితి పై సమీక్ష ను నిర్వహించిన ప్ర‌ధాన‌ మంత్రి

అనుమ‌తి పొందిన మెడిక‌ల్ ఆక్సీజన్ ప్లాంటు ల ఏర్పాటు ను వేగ‌వంతం చేయాలి :  ప్ర‌ధాన‌ మంత్రి

టీకా మందు ఉత్ప‌త్తి ని పెంచడం  కోసం దేశం లో ఉన్న యావత్తు సామర్థ్యాన్ని సంపూర్ణం గా వినియోగించుకోండి:  ప్ర‌ధాన‌ మంత్రి

Posted On: 17 APR 2021 9:40PM by PIB Hyderabad

ప్ర‌స్తుత కోవిడ్-19 మ‌హ‌మ్మారి ని ఎదుర్కోవడానికి సాగుతున్న సన్నాహాల పై సమీక్ష కోసం ఏర్పాటు చేసిన ఒక సమావేశానికి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అధ్య‌క్ష‌త‌ వహించారు.  మందు లు, ఆక్సీజన్, వెంటిలేట‌ర్ లు, ప్రజల కు టీకా మందు ను ఇప్పించే కార్యక్రమానికి సంబంధించి వివిధ అంశాల‌ పై ఈ స‌మావేశం లో చ‌ర్చించడం జరిగింది.

భారతదేశం గ‌త ఏడాది కలసికట్టుగా ఉంటూ కోవిడ్ ను ఓడించిందని, అవే సూత్రాలను పాటిస్తూ మ‌రింత వేగం గాను, మ‌రింత స‌మ‌న్వ‌యంతోను కృషి చేయ‌డం ద్వారా ఈ సారి కూడా భారతదేశం మరోసారి కోవిడ్ ను ఓడించగలుగుతుందని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు.

టెస్టుల ను నిర్వ‌హించ‌డం, ట్రేక్ చేయ‌డం, చికిత్స ను అందించడం.. వీటికి మించి ప్ర‌త్యామ్నాయం ఏదీ లేదు అని ప్ర‌ధాన‌ మంత్రి నొక్కి చెప్పారు.  మ‌ర‌ణాల శాతాన్ని త‌గ్గించాలి అంటే ప్రాథమిక స్థాయి లోనే పరీక్షల నిర్వహణ, స‌రైన‌ ట్రేకింగ్ కీల‌క‌ం అని ఆయన అన్నారు.  ప్ర‌జ‌ల ఆందోళ‌న‌ ల ప‌ట్ల స్థానిక యంత్రాంగాలు సానుభూతి తో సానుకూలం గా వ్య‌వ‌హ‌రించాలి అని కూడా ఆయన అన్నారు.

మ‌హ‌మ్మారి ని అదుపు చేసే విష‌యంలో రాష్ట్రాల తో స‌న్నిహిత స‌మ‌న్వ‌యాన్ని నెలకొల్పుకొని తీరాలి అని ప్ర‌ధాన‌ మంత్రి ఆదేశించారు.  కోవిడ్ రోగుల చికిత్స కోసం ఆసుపత్రుల లో ప‌డ‌క‌లు పెంచేందుకు త‌గు చ‌ర్య‌ల‌న్నీ తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. తాత్కాలిక ఆసుపత్రులు, ఐసలేశన్ సెంటర్ ల ఏర్పాటు ద్వారా అద‌నం గా ప‌డ‌క‌ ల స‌ర‌ఫ‌రా ను పెంచేందుకు కృషి చేయాల‌ని ఆయ‌న కోరారు.

క‌రోనా చికిత్స‌ లో ఉప‌యోగించే కీల‌క ఔష‌ధాలకు పెరిగిన డిమాండు ను త‌ట్టుకునేందుకు భార‌తదేశ ఫార్మస్యూటికల్ ప‌రిశ్ర‌మ పూర్తి సామ‌ర్థ్యాలు వినియోగించుకోవ‌ల‌సిన అవ‌స‌రం గురించి కూడా ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌స్తావించారు.  రెమ్ డెసివిర్‌, ఇత‌ర ఔష‌ధాల స‌ర‌ఫ‌రా తాజా స్థితి ని గురించి ఆయ‌న స‌మీక్షించారు. రెమ్ డెసివిర్ అందుబాటు ను పెంచేందుకు తీసుకొంటున్న చ‌ర్య‌ల‌ ను స‌మావేశంలో ప్ర‌ధాన‌ మంత్రి దృష్టి కి తీసుకురావడం జరిగింది.  ప్ర‌భుత్వం కృషి ఫలితం గా జ‌న‌వ‌రి- ఫిబ్ర‌వ‌రి నాటికి ఉన్న నెల‌ కు 27-29 ల‌క్ష‌ల  వ‌య‌ల్స్ గా ఉన్న రెమ్ డిసివిర్ ఉత్పాద‌క సామ‌ర్థ్యం మే నెల కల్లా దాదాపు 74.10 ల‌క్ష‌ల వ‌య‌ల్స్ కు పెరిగిందని ప్రధాన మంత్రి కి వివ‌రించడమైంది.  స‌ర‌ఫ‌రా కూడా ఏప్రిల్ 11 న 67,900 వ‌య‌ల్స్ గా ఉండగా, ఏప్రిల్ 15 నాటికి 2,06,000 వ‌య‌ల్స్ కు పెరిగింద‌ని తెలిపారు.  కేసు లు ఆందోళ‌న‌క‌రం గా పెరుగుతూ అధిక డిమాండు గ‌ల రాష్ట్రాల‌పై ప్ర‌త్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతోంది.  ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం పెరగడాన్ని గురించి తెలుసుకొన్న ప్ర‌ధాన‌ మంత్రి రాష్ట్రాల కు వాస్తవ కాల ప్రాతిపదిక న సరఫరా వ్యవస్థ ను నిర్వహించడానికి సంబంధించి ఏవైనా సమస్య లు ఉంటే వాటిని సత్వరం   ప‌రిష్క‌రించితీరాలి అంటూ ఆదేశించారు.  అనుమ‌తించిన వైద్య మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణం గానే రెమ్ డెసివిర్‌, ఇత‌ర మందుల వినియోగం ఉండేలా చూడాల‌ని, అవి దుర్వినియోగం కాకుండాను, నల్ల బజారు విక్రయాలను కఠినం గా అరిక‌ట్టాల‌ని ప్ర‌ధాన‌ మంత్రి ఆదేశించారు.

మెడిక‌ల్ ఆక్సీజన్ సరఫరా అంశం పై ప్రధానమంత్రి  మాట్లాడుతూ, ఇప్ప‌టికే ఆమోదం పొందిన మెడిక‌ల్ ఆక్సీజన్ ప్లాంటు ల స్థాపన ను వేగవంతం చేయాలి అంటూ ఆదేశించారు.  పిఎమ్ కేర్స్ స‌హాయం తో 32 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల లో 162 పిఎస్ఎ ఆక్సీజన్ ప్లాంటు లను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఒక ల‌క్ష సిలిండ‌ర్ ల ను సేక‌రిస్తున్నట్లు, వాటిని త్వ‌ర‌లోనే రాష్ట్రాల‌కు స‌ర‌ఫ‌రా చేయనున్నట్లు అధికారులు ప్ర‌ధాన మంత్రి కి వివ‌రించారు.  కేసుల భారం అధికంగా ఉన్న 12 రాష్ట్రాల లో మెడిక‌ల్ ఆక్సీజన్ ప్ర‌స్తుత అవ‌స‌రాలను, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను అంచనా వేస్తూ ఆయా రాష్ట్రాల కు నిలకడగా స‌ర‌ఫ‌రాలను అందజేస్తున్నట్లు అధికారులు ప్రధాన మంత్రి కి తెలిపారు. కేసుల భారం అధికంగా ఉన్న 12 రాష్ట్రాల‌ కు ఏప్రిల్ 30వ తేదీ వ‌ర‌కు అందించిన మెడిక‌ల్ ఆక్సీజన్ స‌ర‌ఫ‌రా తాలూకు మేపింగ్ ప్లాను ను కూడా అమలుపరుస్తున్నట్లు వారు తెలిపారు.   మ‌హ‌మ్మారి ని పరిష్కరించడానికి మందులు, ఉపకరణాల ఉత్పత్తి కి అవ‌స‌రం అయిన ఆక్సీజన్ కూడా స‌ర‌ఫ‌రా అయ్యేటట్లు చూడాల‌ని ప్ర‌ధాన‌ మంత్రి సూచించారు.

వెంటిలేట‌ర్ ల ల‌భ్య‌త‌ ను, స‌ర‌ఫ‌రా స్థితి ని కూడా ప్ర‌ధాన‌ మంత్రి స‌మీక్షించారు.  వీటి స‌ర‌ఫ‌రా ను గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకునేందుకు వాస్త‌విక స్థితి ప‌ర్య‌వేక్ష‌ణ వ్య‌వ‌స్థ‌ ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.  ఈ వ్య‌వ‌స్థ‌ ను ఉప‌యోగించుకోవ‌లసిందంటూ రాష్ట్రాల‌ను చైత‌న్య‌వంతం చేయవలసింది గా ఆయ‌న ఆదేశించారు.

వ్యాక్సీనేశన్ అంశం పై ప్రధాన మంత్రి మాట్లాడుతూ, దేశం లో వ్యాక్సీన్ ఉత్పత్తి ని పెంచే విషయం లో దేశం లో ప్రభుత్వ రంగం, ప్రయివేటు రంగం లో ఉన్న మొత్తం సామర్థ్యాన్ని వినియోగించుకొనేందుకు తగ్గ ప్రయత్నాలు చేయవలసింది గా అధికారుల ను ఆదేశించారు.

ప్రధాన మంత్రి తో పాటు కేబినెట్ సెక్రటరి, ప్ర‌ధాన‌ మంత్రి కి ప్రిన్సిప‌ల్ సెక్రటరి, కేంద్ర హోం సెక్రటరి, కేంద్ర ఆరోగ్య కార్య‌ద‌ర్శి, ఫార్మా సెక్రటరి, నీతి ఆయోగ్ కు చెందిన డాక్ట‌ర్ వి.కె.పాల్ లు కూడా ఈ స‌మావేశం లో పాల్గొన్నారు.



 

***



(Release ID: 1712525) Visitor Counter : 199