ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 కోసం, భారత జన్యు సంబంధ వ్యవస్థ-2021, జన్యువుల అనుక్రమణ సమాచారాన్ని, 2021 మార్చి, 26వ తేదీ నుండి అనేక సార్లు, రాష్ట్రాలకు అందజేసింది.
భారతదేశంలో ఉపయోగిస్తున్న ఆర్.టి.పి.సి.ఆర్. పరీక్షలు యు.కే., బ్రెజిల్, దక్షిణాఫ్రికా, డబుల్ మ్యూటాంట్ వేరియంట్ లను తప్పకుండా గుర్తిస్తున్నాయి.
జన్యువుల అనుక్రమణ కోసం, భారత జన్యు సంబంధ వ్యవస్థ, ఇప్పటివరకు 13,000 నమూనాలను విశ్లేషించింది.
Posted On:
16 APR 2021 7:01PM by PIB Hyderabad
మొత్తం జన్యువుల అనుక్రమణ (డబ్ల్యూ.జి.ఎస్) ద్వారా భారతదేశంలో సార్స్-కోవ్-2 యొక్క జన్యు మార్పులను నిరంతరం పర్యవేక్షించడం కోసం, భారత సార్స్-కోవ్-2 జన్యు సంబంధ వ్యవస్థ, (ఐ.ఎన్.ఎస్.ఏ.సి.ఓ.జి) అనేది 2020, డిసెంబర్ లో స్థాపించబడిన పది ప్రయోగశాలల నెట్-వర్క్.
ఐ.ఎన్.ఎస్.ఏ.సి.ఓ.జి. యొక్క వివరణాత్మక మార్గదర్శకాలు 2020 డిసెంబర్ 27వ తేదీన ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. వెబ్-సైట్ పొందుపరచడం జరిగింది.
యు.కె. లో గుర్తించబడిన సార్స్-కోవ్-2 వైరస్ యొక్క కొత్త వేరియంట్ నేపథ్యంలో, సాంక్రమిక రోగ విజ్ఞాన నిఘా మరియు ప్రతిస్పందన కోసం రూపొందించిన ఎస్.ఓ.పి. లను అన్ని రాష్ట్రాలకు పంపడం జరిగింది. అదేవిధంగా, 2020 డిసెంబర్ 22వ తేదీన మంత్రిత్వ శాఖ వెబ్- సైట్ లో కూడా పొందుపరచడం జరిగింది.
ఐ.ఎన్.ఎస్.ఏ.సి.ఓ.జి. మార్గదర్శకాల ప్రకారం, మొత్తం జన్యువుల అనుక్రమణ కోసం, పోజిటివ్ నమూనాలను వీటి నుండి సేకరించడం జరిగింది :
1. ఆర్.టి-పి.సి.ఆర్. ద్వారా పోజిటివ్ గా గుర్తించిన అంతర్జాతీయ ప్రయాణికులు.
2. రాష్ట్ర నిఘా అధికారులు, కమ్యూనిటీ నమూనాలను, సమన్వయ పరుస్తారు. వారు వివిధ జిల్లాలు / ప్రయోగశాలల నుండి నియమించబడిన ఐ.ఎన్.ఎస్.ఏ.సి.ఓ.జి. ప్రయోగశాలలకు నమూనాలను బదిలీ చేయడానికి వీలు కల్పిస్తారు. అన్ని రాష్ట్రాలను నిర్దిష్ట ఐ.ఎన్.ఎస్.ఏ.సి.ఓ.జి. ప్రయోగశాలలకు అనుసంధానించడం జరిగింది.
3. విశేషమైన వ్యాప్తి ఉన్న జిల్లాల నుండి నమూనాలు.
ఐ.ఎన్.ఎస్.ఏ.సి.ఓ.జి. కన్సార్షియం గుర్తింపు పొందిన 10 ప్రయోగశాలలు వాటి అనుక్రమణ సమాచారాన్ని, జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం [ఎన్.సి.డి.సి] యొక్క కేంద్ర నిఘా యూనిట్ కు నివేదిస్తాయి; అక్కడ నుండి, ఆ సమాచారం, కేంద్ర నిఘా యూనిట్ (సి.ఎస్.యు) ద్వారా ఐ.డి.ఎస్.పి. యొక్క రాష్ట్ర నిఘా యూనిట్ల తో (ఎస్.ఎస్.యు.లతో) ఈ-మెయిల్ ద్వారా మరియు ఎన్.సి.డి.సి. సాధారణ సమావేశాల ద్వారా రాష్ట్ర నిఘా అధికారులకు చేరుతుంది. వారు ఆరోగ్య కార్యదర్శుల నుండి కార్యాచరణ ప్రతిస్పందనను తీసుకుంటారు. అందువల్ల, రాష్ట్రాల్లో వేరియంట్ వైరస్ లు కనుగొనబడినట్లు రాష్ట్రాలకు నిరంతరం సమాచారం ఇవ్వబడుతుంది.
కొన్ని సందర్భాల్లో, ఐ.ఎన్.ఎస్.ఏ.సి.ఓ.జి. ప్రయోగశాలలు కూడా ఫలితాలను నేరుగా రాష్ట్రాలకు తెలియజేస్తున్నాయి.
ఎన్.సి.డి.సి. కూడా రాష్ట్ర నిర్దిష్ట ఫలితాలను ఎప్పటికప్పుడు సంబంధిత రాష్ట్రాలకు అధికారికంగా తెలియజేస్తుంది.
ఉదాహరణకు :-
o హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు ఏప్రిల్, 8వ తేదీన తెలియజేయడం జరిగింది.
o పంజాబ్ ఫలితాలు మార్చి, 26వ తేదీన తెలియజేయడం జరిగింది.
o రాజస్థాన్ ఫలితాలు ఏప్రిల్, 10వ తేదీన తెలియజేయడం జరిగింది.
o మహారాష్ట్ర ఫలితాలు 2021 మార్చి, 12వ తేదీ నుండి 2021 ఏప్రిల్ 16వ తేదీ వరకు తొమ్మిది వేర్వేరు సందర్భాలలో తెలియజేయడం జరిగింది.
మరింత కఠినమైన చర్యల ఆవశ్యకతపై వ్రాతపూర్వక సమాచారాన్ని, అధిక భారం ఉన్న రాష్ట్రాలకు మాత్రమే కాకుండా, అన్ని రాష్ట్రాలకు కార్యదర్శి (హెచ్), ఎ.ఎస్. (హెచ్), డైరెక్టర్ ఎన్.సి.డి.సి. మరియు ఐ.డి.ఎస్.పి. చేత పంపబడింది; రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు; ఎ.సి.ఎస్. (ఆరోగ్యం); ఎస్ఎస్.ఓ. లు, డి.హెచ్. ఎస్. లు మొదలైన వారికి కూడా, ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతోంది. వివిధ దేశాల నుండి వచ్చే కొత్త వైరస్ రకాలు, అన్-లాక్ నిబంధనల దృష్ట్యా కఠినమైన జాగరూకతతో ఉండాలనీ, కఠినమైన ప్రజారోగ్య చర్యలు చేపట్టాలనీ, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలను పదేపదే కోరడం జరిగింది.
ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. ఎప్పటికప్పుడు, పత్రికా విలేఖరుల సమావేశాలు నిర్వహించి, ఆందోళనలకు కారణమౌతున్న వేరియంట్లు, కొత్తగా వస్తున్న వైరస్ వ్యాప్తి, మరియు పెరుగుతున్న, తీవ్రమవుతున్న ప్రజారోగ్య జోక్యాలపై ఒత్తిడికి సంబంధించి, ప్రస్తుత స్థితిపై నిర్దిష్ట తాజా సమాచారాన్ని అందించడం జరుగుతోంది. ఎన్.సి.డి.సి. డైరెక్టర్, 2021 మార్చి, 24వ తేదీన, విలేకరుల సమావేశం నిర్వహించి, దేశంలో కనుగొనబడిన కోవిడ్ వైరస్ యొక్క వివిధ వైవిధ్యాలపై, వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు.
ఇటీవల, ఐ.ఎన్.ఎస్.ఏ.సి.ఓ.జి. మార్గదర్శకాలను మళ్ళీ రాష్ట్రాలతో పంచుకోవడం జరిగింది. పోజిటివ్ వ్యక్తులకు అందిస్తున్న చికిత్స సమాచారాన్ని కూడా అందించడం ద్వారా జన్యువుల అనుక్రమణ సమాచారం కోసం నమూనాలను పంపాలని రాష్ట్రాలకు సూచించారు. ఇది వివిధ ప్రదేశాలలో ఉధృతంగా కొనసాగుతున్న వైవిధ్యాలకు అనుసంధానం గురించి భారీ సాంక్రమిక రోగ విజ్ఞాన అంతర్ దృష్టిని అనుమతించడంతో పాటు, సమాజంలో ఉన్నట్లయితే, ఆందోళన యొక్క ఇతర వైవిధ్యాలను కనుగొనడానికి వీలుగా, ఐ.ఎన్.ఎస్.ఏ.సి.ఓ.జి. కి ని ప్రారంభించడం జరిగింది. పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాలు, ఎన్.సి.డి.సి.తో, తమ సమాచారాన్ని, పంచుకోగా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళతో సహా పలు రాష్ట్రాలు ఎన్.సి.డి.సి.తో, తమ సమాచారాన్ని, ఇంకా పంచుకోలేదు.
2021 ఏప్రిల్, 15వ తేదీ నాటికి, 10 నియమించబడిన ఐ.ఎన్.ఎస్.ఏ.సి.ఓ.జి. ప్రయోగశాలల్లో 13,614 డబ్ల్యూ.జి.ఎస్. నమూనాలను విశ్లేషించడం జరిగింది. వీటిలో, 1,189 నమూనాలు భారతదేశంలో సార్స్ కోవ్-2 ద్వారా సంభవించే ఆందోళనల వైవిధ్యాలను తెలుసుకోడానికి పరీక్షించబడ్డాయి. ఇందులో యు.కె. వేరియంట్ లతో 1109 నమూనాలు ఉన్నాయి; దక్షిణాఫ్రికా వేరియంట్ తో 79 నమూనాలు, బ్రెజిల్ వేరియంట్ తో 1 నమూనా చొప్పున ఉన్నాయి.
కోవిడ్-19 వైరస్ పరివర్తన చెందుతోంది. అనేక దేశాలతో పాటు, భారతదేశంలో కూడా వివిధ ఉత్పరివర్తనలు కనుగొనబడ్డాయి. వీటిలో యు.కె. (17 ఉత్పరివర్తనలు); బ్రెజిల్ (17 ఉత్పరివర్తనలు); దక్షిణాఫ్రికా (12 ఉత్పరివర్తనలు) వేరియంట్లు ఉన్నాయి. ఈ వేరియంట్లు అధిక వ్యాప్తి స్వభావాన్ని కలిగి ఉన్నాయి. యు.కె. వేరియంట్ యు.కె. తో పాటు యూరప్ అంతా విస్తృతంగా కనుగొనబడింది. అదేవిధంగా ఆసియా, అమెరికా దేశాల్లో కూడా వ్యాపించింది.
డబుల్ మ్యుటేషన్ (2 ఉత్పరివర్తనలు) మరొక వేరియంట్. ఇది ఆస్ట్రేలియా, బెల్జియం, జర్మనీ, ఐర్లాండ్, నమీబియా, న్యూజిలాండ్, సింగపూర్, యునైటెడ్ కింగ్ డమ్, యు.ఎస్.ఎ. వంటి అనేక దేశాలలో కనుగొనబడింది. ఈ వేరియంట్ యొక్క అధిక వ్యాప్తి స్వభావం ఇంకా నిర్ధారణ కాలేదు.
· భారతదేశంలో ఉపయోగించబడుతున్న ఆర్.టి.పి.సి.ఆర్. పరీక్షలు రెండు జన్యువులకు పైగా లక్ష్యంగా ఉన్నందున భారతదేశంలో ఉపయోగించబడుతున్న ఆర్.టి.పి.సి.ఆర్. పరీక్షలు ఈ ఉత్పరివర్తనాలను తప్పకుండా గుర్తిస్తాయి.
· ఆర్.టి.పి.సి.ఆర్. పరీక్షల యొక్క సున్నితత్వం, విశిష్టత మునుపటి మాదిరిగా నే కొనసాగుతాయి.
ఈ ఉత్పరివర్తనాలను గుర్తించడం ద్వారా, నిర్వహణ యొక్క వ్యూహం మారదు. పరీక్షించడం, వెతకడం, గుర్తించడం, చికిత్స చేయడం వంటి ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. కోవిడ్-19 వ్యాప్తిని నివారించడానికి మాస్క్ వాడకం చాలా ముఖ్యమైన కవచం గా కొనసాగాలి.
*****
(Release ID: 1712423)
Visitor Counter : 295