గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

75 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని స్మ‌రించుకుంటూ దీన్ దయాల్ ఉపాధ్యాయ కౌశల్య యోజన (డిడియు-జికెవై) కింద దేశవ్యాప్తంగా పూర్వ విద్యార్థుల సమావేశాలు

Posted On: 15 APR 2021 4:01PM by PIB Hyderabad

ప్ర‌పంచ‌స్థాయి ప్ర‌మాణాల స్థాయిలో వేత‌న నియామ‌క‌- అనుసంధాన కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌న్న ప్ర‌తిష్ఠాత్మ‌క అజెండాతో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ‌, జాతీయ గ్రామీణ జీవ‌నోపాధి మిష‌న్ కింద నైపుణ్యాల‌తో అనుసంధాఆన‌మైన నియామ‌కాల అభివృద్ధి కార్య‌క్ర‌మాన్ని దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశ‌ల్య యోజ‌న (డిడియు-జికెవై)గా 25 సెప్టెంబ‌ర్, 2014లో పున‌రుద్ధ‌రించింది. డిడియు-జికెవై - భార‌త ప్ర‌భుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ నిధుల‌తో దేశ‌వ్యాప్తంగా నియామ‌క‌తో అనుసంధాన‌మైన  నైపుణ్యాల శిక్ష‌ణా కార్య‌క్ర‌మం. 
ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌స్తుతం 27 రాష్ట్రాలు, 3 కేంద్ర‌పాలిత ప్రాంతాల‌లో అమ‌లు చేస్తుండ‌గా, దాదాపు 1822 ప్రాజెక్టుల‌లో 2198 శిక్ష‌ణా కేంద్రాల‌ను 56 రంగాలలో శిక్ష‌ణ‌ను 839 ప్రాజెక్టు అమ‌లు ఏజెన్సీల భాగ‌స్వామ్యంతో  అమ‌లు చేస్తున్నారు. ఇందులో దాదాపు 600 ర‌కాల ఉపాధి అవ‌కాశాలు ఉన్నాయి. ఆర్థిక సంవ‌త్స‌రం 2020-21లో దాదాపు 28687మంది అభ్య‌ర్ధుల‌కు శిక్ష‌ణ‌ను అందించ‌గా, 49396 మందిని 31.03.2021వ‌ర‌కు నియ‌మించారు. ఈ కార్య‌క్ర‌మ ప్రారంభం నుంచి మొత్తం 10.81 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్ధుల‌కు 56 రంగాల‌కు చెందిన 600 వృత్తుల‌లో శిక్ష‌ణ‌ను ఇవ్వ‌గా, 6.92మందికి ఉపాధి క‌ల్పించారు (31.03.2021 వ‌ర‌కు). 
పూర్వ‌విద్యార్ధుల స‌మావేశం అనేది ఈ ప‌థ‌కంలో ముఖ్య‌మైన అంశం. నియామ‌కాలు, వృత్తిప‌ర‌మైన ల‌క్ష్యాలు, శిక్ష‌ణ తీసుకోక ‌ముందు ‌వారు ఉపాధిఇ వెతుక్క‌కోవ‌డంలో ఎదుర్కొన్న స‌వాళ్ళు, శిక్ష‌ణ పొందిన  త‌ర్వాత వారు పొందిన లాభాల‌ను అంత‌కు ముందు శిక్ష‌ణ పొందిన వారు ప్ర‌స్తుతం శిక్ష‌ణ పొందుతున్న వారితో పంచుకునేందుకు ఈ పూర్వ విద్యార్ధుల స‌మావేశం ఒక ఆరోగ్య‌క‌ర‌మైన వేఏదిక‌. ఈ స‌మావేశాల‌లో పూర్వ‌పు ట్రైనీలు త‌మ కార్యాల‌యాల్లో అత్య‌ద్భుతంగా రాణించినందుకు స‌న్మానం కూడా చేస్తారు. 
75 సంవ‌త్స‌రాల భార‌త స్వాతంత్ర్యాన్ని స్మ‌రించుకుంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అమృత మ‌హోత్స‌వ్ వేడుక‌ల‌లో భాగంగా, 5 ఏప్రిల్ నుంచి 11 ఏప్రిల్ 2021 మ‌ధ్య‌న దేశ‌వ్యాప్తంగా 119 పూర్వ‌విద్యార్ధుల స‌మావేశాల‌ను భార‌త ఎంతో ఉత్సాహంతో నిర్వ‌హించాయి. ఈ అఖిల భార‌త‌ కార్య‌క్ర‌మాన్నివిజ‌య‌వంతం చేయ‌డానికి దాదాపు 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రాష్ట్ర గ్రామీణ ఉపాధి మిష‌న్ల, వివిధ ప్రాజెక్టు అమ‌లు ఏజెన్సీల‌తో (పిఐఎ) క‌లిసి ప‌ని చేశాయి. 
అమృత మ‌హోత్స‌వ్ వేడుక‌ల‌లో భాగంగా, యాభై క‌క‌న‌న్నా ఎక్కువ పిఐఎలు వివిధ‌ద డిడియు-జికెవై కేంద్రాల‌లో వివిధ వృత్తుల‌లో శిక్ష‌ణ పొందిన త‌ర్వాత విజ‌య‌వంతంగా ఉపాధి పొందిన గ‌త ట్రైనీల‌న‌ను సంప్ర‌దించాయి. ఈ స‌మావేశాల‌ను కోవిడ్ ర‌క్ష‌ణ ప్రోటోకాళ్ళ‌ను అనుస‌రిస్తూ పిఐఎ కేంద్రాల‌లో దృశ్య మాధ్య‌మం ద్వారాను, భౌతికంగానూ నిర్వ‌హించారు. ఈ స‌మావేశాల‌లో కోవిడ్‌కు త‌గిన ప్ర‌వ‌ర్త‌న‌, అర్హులైన వ్య‌క్తుల‌కు వాక్సినేష‌న్ అవ‌స‌రాన్ని నొక్కి చెప్పారు. కేర‌ళ‌, ఒడిషా, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, బీహార్‌, అస్సాం త‌దిత‌ర రాష్ట్రాల‌లో గ‌రిష్ట సంఖ్య‌లో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ‌

 

***
 



(Release ID: 1712062) Visitor Counter : 217