నీతి ఆయోగ్
ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయ ఆవిష్కరణల కోసం బేయర్ సంస్థతో కలిసి పనిచేయనున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్
Posted On:
13 APR 2021 4:19PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా మిషన్ యొక్క ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకత కార్యక్రమాలకు కృషి చేయడానికి అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం), నీతి ఆయోగ్‌లు ఈ రోజు ఆరోగ్య సంరక్షణ మరియు పోషణ రంగాలలో ప్రధాన సామర్థ్యాలతో కూడిన ప్రపంచస్థాయి సంస్థ బేయర్‌తో జట్టుకట్టాయి. ఇరు పక్షాల మధ్య సహకారాన్ని అధికారికం చేసేందుకు వీలుగా ఏఐఎం, బేయర్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం యొక్క స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ (ఎస్ఓఐ) సంతకం చేయబడింది. సాంకేతిక విద్య యొక్క ప్రోత్సాహాన్ని, సరఫరా గొలుసులను మరియు ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను బలోపేతం చేయడానికి డిజిటల్ సొల్యూషన్స్ మరియు అగ్రి-టెక్ను అభివృద్ధి చేసేందుకు ఈ ఎస్ఓఐ దోహదం చేస్తుంది. దీనికి తోడు, బేయర్ వారి ప్రస్తుత, భవిష్యత్తు కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి మరియు వ్యవసాయం మరియు ఆరోగ్య సంరక్షణ రంగాలలో ఆవిష్కరణలు మరియు వ్యవస్థాపకతను పెంపొందించడానికి ఏఐఎంతో కలిసి పని చేస్తుంది. ఏఐఎం యొక్క ప్రధాన కార్యక్రమం.. ‘అటల్ టింకరింగ్ ల్యాబ్స్’ (ఏటీఎల్) బడికి వెళ్తున్న పిల్లలలో సృజనాత్మకత మరియు సాంకేతిక ఊహలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. బేయర్ పాఠశాల పిల్లలకు మార్గదర్శకత్వం, డిజైన్ ఆలోచన, సమస్య పరిష్కారం మరియు అనుకూల అభ్యాస నైపుణ్యాలను పెంపొందించే అవకాశాలను అన్వేషిస్తుంది మరియు పరస్పరం అంగీకరించిన పాఠశాలలకు మద్దతు ఇవ్వడం మరియు స్వీకరించేలా దోహదం చేస్తుంది. దీనికితోడు ‘అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్’ (ఏఐసీ) మరియు ‘అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్స్’లో (ఎసీఐసీ) భాగంగా, బేయర్ సంస్థ యువ ఆవిష్కర్తలకు మరియు స్టార్టప్‌లకు మార్గదర్శకత్వం చేస్తుంది. నూతనమైన ఆవిష్కరణలకు మరింతగా కారణమయ్యేలా వారితో సహకరిస్తుంది. వ్యవసాయం మరియు ఆరోగ్య సంరక్షణ రంగాలలో డిజిటల్ పరిష్కారాల విభాగంలో ఏఎన్ఐసీ, అపరైజ్ కార్యక్రమాల నుండి టెక్నో-ప్యూనర్లతో అనుబంధాన్ని పెంపొందించేలా బేయర్ అవకాశాలను అన్వేషిస్తుంది.
జట్టుకట్టడం దీర్ఘకాలిక వ్యూహాత్మకమైనది..
వర్చువల్ విధానంలో బేయర్‌తో ఎస్ఓఐని మార్చుకొనే సందర్భంలో ఏఐఎం, నీతి ఆయోగ్ మిషన్ డైరెక్టర్ ఆర్ రమణన్ మాట్లాడుతూ “అటల్ ఇన్నోవేషన్ మిషన్.. బేయర్‌తో సహకార ఒప్పందం చేసుకోవడం అనేదిక ఒక దీర్ఘకాలిక వ్యూహాత్మకమైనది. ఎందుకంటే వారి ప్రత్యేకత వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ మరియు జీవ శాస్త్రాలలో మేటిగా ఉన్నారు. వీరితో జట్టు కట్టడం మన జాతీయ ప్రాముఖ్యత అంశం. ముఖ్యంగా మహమ్మారి విస్తరిస్తున్న కాలంలో ఈ సౌజన్యం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇరు సంస్థల భాగస్వామ్యం సమగ్రంగా ఉంటుంది. పాఠశాల, విశ్వవిద్యాలయం మరియు స్టార్టప్‌లలో బేయర్ యొక్క డొమైన్ నైపుణ్యం, గ్లోబల్ రీచ్ మరియు సదుపాయాలను పెంచే జ్ఞానం మరియు ఆవిష్కరణలకు ఎంతగానో తోడ్పడుతుంది.” అన్నారు.
ఆవిష్కరణలు, వ్యవస్థాపకత పెంపొందించేలా ప్రయత్నిస్తాం..
బేయర్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, బేయర్ క్రాప్ సైన్స్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డి. నరేన్ తన ఆలోచనలను పంచుకుంటూ, “బేయర్ అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్ తో భాగస్వామి కావడం ఆనందంగా ఉంది. ఈ సహకారం ద్వారా, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ రంగాలలో భారతదేశంలో తగు ఆవిష్కరణలు మరియు వ్యవస్థాపకతను పెంపొందించడానికి మేము ప్రయత్నిస్తాము. ‘అటల్ టింకరింగ్ ల్యాబ్స్’ చొరవలో భాగంగా దేశపు పాఠశాల పిల్లలకు మార్గదర్శకత్వం వహించడానికి మరియు శాస్త్రీయ ఉత్సుకతను పెంపొందించడానికి, విలువ గొలుసుల్లో డిజిటల్ పరిష్కారాలను ప్రారంభించడానికి, మరియు ఇన్వెంటివ్ స్టార్ట్-అప్‌లతో భాగస్వామిగా ఉండటానికి ఈ భాగస్వామ్యం మాకు బహుళ అవకాశాలను అందిస్తుంది. ఈ క్లిష్ట సమయంలో, రైతు ఆదాయాలను రెట్టింపు చేయడంలో, భారతదేశం అంతటా పలు ఆరోగ్య పరిష్కారాలకు తగు ప్రాప్యతను విస్తరించే దిశగా మన పురోగతిని వేగవంతం చేయడంలో వ్యవస్థాపకత, మరియు సైన్స్ నేతృత్వంలోని ఆవిష్కరణలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.” అన్నారు.
120 సంవత్సరాలకు పైగా భారత్‌లో..
బేయర్ సంస్థ గత 120 సంవత్సరాలకు పైగా భారత్‌లో ఉంది. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ మరియు పోషణలో నాయకుడిగా ఉంటూనే సమాజంలో అది పెద్ద వర్గానికి ప్రయోజనం చేకూర్చడానికి సాంకేతికత మరియు టెక్నాలజీలను ఉపయోగించడం లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతోంది. ఏఐఎం మరియు బేయర్ సంస్థల మధ్య వ్యవసాయం మరియు ఆరోగ్య సంరక్షణ రంగాలలో ఈ రకమైన సహకారం ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకతను పెంపొందించడంలో సహాయపడుతుంది.
బేయర్ గురించి..
బేయర్ ఆరోగ్య సంరక్షణ మరియు పోషణ యొక్క లైఫ్ సైన్స్ రంగాలలో మేటి ప్రధాన సామర్థ్యాలతో కూడిన ప్రపంచ స్థాయి సంస్థ. పెరుగుతున్న మరియు వృద్ధాప్య ప్రపంచ జనాభా అందించే ప్రధాన సవాళ్లను సాధించే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రజలు, మరియు భూగోళం అభివృద్ధి చెందడానికి దీని ఉత్పత్తులు మరియు సేవలు రూపొందించబడ్డాయి. బేయర్ సంస్థ సుస్థిరమైన అభివృద్ధిని నడిపించడానికి, మరియు దాని వ్యాపారాలతో సానుకూల ప్రభావాన్ని సృష్టించడానికి కట్టుబడి ఉంది. అదే సమయంలో, గ్రూప్ తన సంపాదన శక్తిని పెంచడం మరియు ఆవిష్కరణ మరియు వృద్ధి ద్వారా విలువను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా బేయర్ బ్రాండ్ నమ్మకం, విశ్వస నీయత మరియు నాణ్యతకు ప్రతీకగా నిలుస్తుంది. 2020 ఆర్థిక సంవత్సరంలో, గ్రూప్ సుమారు 100,000 మందికి ఉపాధి కల్పించింది మరియు 41.4 బిలియన్ యూరోల అమ్మకాలను నమోదు చేసింది. ప్రత్యేక వస్తువులకు ముందు ఆర్ అండ్ డీ ఖర్చులు 4.9 బిలియన్ యూరోలుగా ఉన్నాయి. మరింత సమాచారం కోసం www.bayer.com వెబ్‌సైట్‌ను వీక్షించండి.
***
(Release ID: 1711714)
Visitor Counter : 136