సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

దేశ 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా "75" సిరీస్ పెన్షన్ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్

Posted On: 12 APR 2021 5:10PM by PIB Hyderabad

భారతదేశ 75 సంవత్సరాల వేడుకల్లో భాగంగా కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సిబ్బంది వ్యవహారాలు, ప్రజాఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ (స్వతంత్ర) మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ ఈ రోజు పెన్షన్లపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన "75" సిరీస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న " అమృత్ మహోత్సవ్" లో భాగంగా "75"తో ప్రారంభం అయ్యే వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని పెన్షన్లు, పెన్షనర్ల సంక్షేమ శాఖ నిర్ణయించింది. 

ఈ కార్యక్రమాలు వినూత్నంగా అందరిని ఆకట్టుకొనే విధంగా వుంటాయని డాక్టర్ జితేంద్రసింగ్ అన్నారు. సీనియర్ సిటిజన్లు, పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించామని అన్నారు. సృజనాత్మకంగా రూపొందించిన ఈ కార్యక్రమాలు ఇటీవల కాలంలో కొత్తగా అభివృద్ధి సామాజిక మాధ్యమాల ద్వారా "భారత్ కా అమృత్ మహోత్సవ్" ద్వారా  సీనియర్ సిటిజన్లకు చేరేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. 

 రానున్న సంవత్సరంలో వారానికి రెండు ట్వీట్ల ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా కుటుంబ పెన్షనర్లకు  సంబంధించిన 75 ముఖ్యమైన నిబంధనలకు విస్తృత ప్రసారం కల్పిస్తామని మంత్రి  వివరించారు.   పెన్షన్ నిబంధనలకు సంబంధించి  తరచు వచ్చే సందేహాలను నివృత్తి చేయడానికి తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్ఎక్యూ)  రూపంలో వివిధ అంశాలపై అవగాహన పెంచడానికి మరియు కుటుంబ పెన్షనర్లతో సహా అన్ని విభాగాలకు చెందిన పెన్షనర్ల సంక్షేమం కోసం తీసుకువచ్చిన కొత్త సంస్కరణల గురించి  ట్వీట్ల రూపంలో ప్రచారం కల్పిస్తామని మంత్రి తెలిపారు. 

దీనితోపాటు, "75" సిరీస్ లో భాగంగా " భవిష్య" ( ఆన్ లైన్ లో పెన్షనలను మంజూరు చేసే విధానం) కార్యక్రమంపై దేశవ్యాపితంగా వున్న 75 కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ద్వారా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామని డాక్టర్ జితేంద్రసింగ్ తెలిపారు. తొలుత ఈ కార్యాలయాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ ఇస్తారని ఆ ఆ తరువాత ప్రశ్నలు జవాబుల కార్యక్రమం ఉంటుందని అన్నారు. ఏప్రిల్ 2021 నుంచి " భవిష్య" శిక్షణా కార్యక్రమాలు విడతలవారీగా అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ప్రారంభం అవుతాయని అన్నారు. దీనిలో కేంద్ర సాయుధ పోలీస్ బలగం (సిఎపిఎఫ్) కార్యాలయాలు కూడా వుంటాయని మంత్రి పేర్కొన్నారు.

"75" సిరీస్ లో భాగంగా 75 సంవత్సరాల వయస్సు పైబడిన ప్రభుత్వ, కుటుంబ పెన్షనర్లకు పెన్షన్ నిబంధనలపై అవగాహన కల్పించడానికి ఆన్ లైన్ లో వర్క్ షాపును నిర్వహిస్తామని తెలిపారు. 2021 మే నెల నుంచి ఈ కార్యక్రమం దేశవ్యాపితంగా ప్రారంభం అవుతుంది. "75" స్ఫూర్తిని కొనసాగిస్తూ అనుభవ్ పోర్టల్ నుంచి అవార్డులు పొందిన లేదా అవార్డులకు ఎంపికైన 75 రచనలను ఎంపిక చేసి వాటిని డిజిటల్ విధానంలో ఆందునాటులోకి తీసుకుని రావడానికి పెన్షన్లు పెన్షనర్ల సంక్షేమ శాఖ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమం 2021 జూన్ నుంచి ప్రారంభం అవుతుంది. 

 

***(Release ID: 1711198) Visitor Counter : 229