ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశంలో కొవిడ్‌ పరిస్థితులు మెరుగుపడే వరకు ఇంజెక్షన్ రెమ్‌డెసివిర్‌ మరియు రెమ్‌డెసివిర్‌ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ కావలసిన ముడిపదార్ధాలు (ఏపిఐ) ఎగుమతులను కేంద్రం నిషేధించింది.


రోగులు మరియు ఆసుపత్రులు రెమిడెసివిర్‌ను సులభంగా పొందటానికి కేంద్రం వివిధ చర్యలు తీసుకుంటోంది

Posted On: 11 APR 2021 5:25PM by PIB Hyderabad

భారతదేశం ఇటీవల కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. 11.04.2021 నాటికి దేశంలో 11.08 లక్షల క్రియాశీల కొవిడ్  కేసులు ఉన్నాయి. అవి క్రమంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి కొవిడ్  రోగుల చికిత్సలో ఉపయోగించే ఇంజెక్షన్ రెమ్‌డెసివిర్‌ డిమాండ్‌ పెరగడానికి దారితీసింది. రాబోయే రోజుల్లో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

ఎం/ఎస్‌ గిలియడ్ సైన్సెస్, యూఎస్‌ఏ తో స్వచ్ఛంద లైసెన్సింగ్ ఒప్పందం ప్రకారం ఏడు  భారతీయ కంపెనీలు రెమ్‌డెసివిర్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటికి నెలకు సుమారు 38.80 లక్షల యూనిట్ల సామర్థ్యం ఉంది.

పై విషయాల దృష్ట్యా, పరిస్థితి మెరుగుపడే వరకు భారత ప్రభుత్వం ఇంజెక్షన్ రెమ్‌డెసివిర్ మరియు రెమ్‌డెసివిర్‌ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ కావలసిన ముడిపదార్ధాలు (ఏపిఐ) ఎగుమతులను నిషేధించింది.

అదనంగా, ఆసుపత్రి మరియు రోగులు రెమ్‌డెసివిర్‌కు సులభంగా పొందేందుకు భారత ప్రభుత్వం ఈ క్రింది చర్యలు తీసుకుంది:

1. రెమ్‌డెసివిర్‌కు సంబంధించి అందరు దేశీయ తయారీదారులు తమ వెబ్‌సైట్‌లో వారి స్టాకిస్టులు / పంపిణీదారుల వివరాలను ప్రదర్శించాలని సూచించారు. తద్వారా ఔషధలను పొందేందుకు అవకాశం లభిస్తుంది.

2. డ్రగ్స్ ఇన్స్‌పెక్టర్లు మరియు ఇతర అధికారులు స్టాక్లను ధృవీకరించడానికి మరియు ఇతర అక్రమాలను నిరోధించడానికి తనిఖీలు చేయాలని మరియు హోర్డింగ్ మరియు బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శులు ఈ కార్యక్రమాన్ని సంబంధిత రాష్ట్రాలు/యుటిల డ్రగ్ ఇన్స్‌పెక్టర్లతో సమీక్షిస్తారు.

3. రెమ్‌డెసివిర్ ఉత్పత్తిని పెంచడానికి ఫార్మాస్యూటికల్స్ విభాగం దేశీయ తయారీదారులతో సంప్రదింపులు జరిపింది.

నిపుణుల కమిటీ అనేక చర్చల తరువాత "నేషనల్ క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్ ఫర్‌ కొవిడ్‌-19" అభివృద్ధి చేయబడిందని, మరియు కోవిడ్ చికిత్సకు మార్గదర్శక పత్రం అని భారత ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. కొవిడ్-19 రోగుల చికిత్స ప్రోటోకాల్‌లో రెమ్‌డెసివిర్ ఇన్వెస్టిగేషనల్ థెరపీగా జాబితా చేయబడింది. సమాచారం మరియు భాగస్వామ్య నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. అంతేకాకుండా వివరణాత్మక మార్గదర్శకాలలో పేర్కొన్న సూచనలు గమనించాలి.

ఈ దశలను ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలోని అన్ని ఆసుపత్రులకు మళ్ళీ తెలియజేయాలని మరియు సమ్మతిని పర్యవేక్షించాలని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించబడింది.

***



(Release ID: 1711050) Visitor Counter : 245