రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
దేశంలో 2021 ఖరీఫ్ సీజన్‌లో ఎరువులను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు
Posted On:
10 APR 2021 4:22PM by PIB Hyderabad
2020-21 రబీ సీజన్‌లో దేశవ్యాప్తంగా ఎరువుల అందుబాటు సంతృప్తికరంఆ ఉంది. కొవిడ్ -19 మహమ్మారి కారణంగా ఎదురైన సవాళ్లు ఉన్నప్పటికీ ఎరువుల ఉత్పత్తి, దిగుమతులు, సకాలంలో వాటి రవాణా చాలినంతగా ఉన్నాయి.
2021 ఖరీఫ్‌సీజన్‌కు సంబంధించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సంప్రదించి డిపార్టమెంట్ ఆఫ్ అగ్రికల్చర్, ఫార్మర్‌వెల్ఫేర్ (డిఎసి, ఎఫ్.డబ్ల్యు) తగిన అంచనాలను రూపొందించింది. దీనిని డిపార్టమెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్‌కు తెలియజేసింది. డిపార్టమెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ వివిధ ఎరువుల తయారీదారులతొ సమావేశమై దేశీయంగా ఎరువుల ఉత్పత్తి లక్ష్యాలనుఖరారు చేసింది. అలాగే దానిని ఎప్పటికప్పుడు గమనిస్తూవచ్చింది.
దేశీయ యూరియా ఉత్పత్తి, దేశంలో డిమాండ్ అంచనాకు మధ్య ఉన్నతేడాను పూడ్చేందుకు సకాలంలో దిగుమతులను తగినంతగా అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికరూపొందించడంజరిగింది. పిఅండ్ కె ఎరువుల విషయంలో దిగుమతులు ఒజిఎల్ ( ఓపెన్ అండ్ జనరల్ లైసెన్స్ కింద వస్తాయి. ఇందులో ఫర్జిలైజర్ కంపెనీలు వాటి వాణిజ్య అవసరాలకు అనుగుణంగా ముడిసరుకును దిగుమతి చేసుకోవచ్చు.
2021 ఖరీఫ్ సీజన్ కుసన్నద్ధత ను అంచనావేసేందుకు కేంద్ర సి అండ్ ఎఫ్ మంత్రి శ్రీ డి . వి. సదానంద గౌడ్ వివిధ ఎరువుల కంపెనీల సిఎండిలు, ఎండిలతో 15-03-2021న సమావేశమయ్యారు. దేశీయంగా ఉత్పత్తి, రానున్న ముడిసరుకుల దిగుమతులు, తుది రూపం సంతరించుకున్న ఎరువులఅందుబాటు గురించి సవివరంగా చర్చించారు. ఇందుకు తదనంతర పరిస్థితులపై తిరిగి సమీక్షా సమావేశాన్ని 2021 ఏప్రిల్ 1న ఫర్టిలైజర్స్ శాఖ కార్యదర్శి అధ్యక్షతన వివిధ ఎరువల కంపెనీల తో సమావేశం నిర్వహించారు. వివిధ ఎరువుల కంపెనీలు తమ సన్నద్ధత, ఇన్వెంటరీ పొజిషన్, 2021 ఖరీఫ్‌కు సరకురవాణా ప్రణాళికలకు సంబంధించిన ప్రణాళికల వివరాలను సమర్పించారు. పిఅండ్ కె ఎరువుల ముడి సరకుల ధరలు పెరిగినట్టు ఈ సమావేశంలో ఎరువుల కంపెనీలు తెలియజేశాయి.
ఇఫ్‌కో కాంప్లెక్స్ ఎరువుల ధరలు సవరించే విషయంపై కేంద్ర సిఅండ్ఎఫ్ మంత్రి శ్రీ డి.వి.సదానంద డౌడ డిపార్టమెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్, ఇఫ్కో ప్రతినిధులతో 08-04-2021న సమావేశం నిర్వహించారు. అలాగే ప్రస్తుత డిఎపి నిల్వలను పాత ధరలకే రైతులకు విక్రయించాలని సూచించారు. దీనిని ఇఫ్కో ధృవీకరించింది. డిఎపి ,కాంప్లెక్స్ ఎరువులను అందుబాటులో ఉన్న సుమారు 11.26 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్‌ను పాత ధరలకు విక్రయించనున్నట్టు తెలిపింది.
ఇందుకు సంబంధించి తిరిగి ఫర్టిలైజర్జ్ కార్యదర్శి అధ్యక్షత న 2021ఏప్రిల్ 9న సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో ఎరువుల అందుబాటు అంశాన్ని ప్రత్యేకించి పిఅండ్ కె ఎరువుల అందుబాటు ను సమీక్షించడం జరిగింది. ఖరీఫ్ సీజన్ లో బాగా డిమాండ్ ఉండే సమయానికంటే ముందుగానే ఎరువులను తగినంతగా ఆయా ప్రాంతాలకు తరలించి ఉంచాల్సిందిగా కంపెనీలకు సూచించడం జరిగింది. ఇందుకు తయారీ దారులు, దిగుమతిదారులు నిర్దేశిత లక్షాలకు అనుగుణంగా దేశీయంగా ఉత్పత్తి సాధించేందుకు, ఎరువులను దిగుమతి చేసుకునేందుకు హామీ ఇచ్చారు.
ఇటీవలి సంవత్సరాలలో ఎరువుల లభ్యత సంతృప్తికర స్థాయిలో ఉంటూ వచ్చిందని,అన్ని కంపెనీలు నిరంతర కృషి ద్వారా అదే పరిస్థితిని కొనసాగించాలని అన్ని కంపెనీలకూ స్పష్టంగా సూచించడం జరిగింది. ఫర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎ.ఐ) ఇందుకు సంబంధించి ఒక విశ్లేషణను అందిస్తూ, వివిధ రాష్ట్రాలలో ఉన్న వివిధ ఎరువులు రాగల మూడు నెలల వరకు సరిపోతాయనితెలిపింది. రైతుల ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకుని, ఎరువుల నిల్వలు, ఎరువుల ధరల విషయంపై ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నది.
***
(Release ID: 1710949)
Visitor Counter : 218