ఆయుష్

‘హోమియోపతి - రోడ్‌మ్యాప్‌ ఫర్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్’ అనే ఆంశంపై రెండు రోజుల సదస్సు నిర్వహించనున్నారు.

Posted On: 09 APR 2021 4:00PM by PIB Hyderabad

ఆయుష్ మంత్రిత్వ శాఖలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (సిసిఆర్‌హెచ్‌) హోమియోపతి - రోడ్ మ్యాప్ ఫర్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ సదస్సును 2021 ఏప్రిల్ 10, 11 తేదీలలో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహిస్తుంది. హోమియోపతి వ్యవస్థాపకులు శామ్యూల్‌ హనీమాన్‌ జయంతిని ప్రపంచ హోమియోపతి దినోత్సవంగా నిర్వహిస్తారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సదస్సును ఏర్పాటు చేశారు.

సమగ్ర సంరక్షణలో హోమియోపతిని సమర్థవంతంగా  ఉపయోగించడానికి అవసరమైన వ్యూహాత్మక చర్యలను గుర్తించడానికి అందులో భాగంగా నిపుణుల అనుభవం తెలుసుకోవడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా హోమియోపతి క్లినికల్ కేస్ రిపోజిటరీని ప్రారంభించాలని సిసిఆర్‌హెచ్‌. హోమియోపతి ద్వారా చికిత్స పొందిన కేసులను దేశవ్యాప్తంగా ఉన్న వైద్యుల నుండి రిపోర్టులను రూపొందించడానికి ఈ డేటాబేస్‌ను రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా సిసిఆర్‌హెచ్ ఈ-లైబ్రరీ కూడా ప్రారంభించబడుతుంది. వాటితో పాటు క్లినికల్ ప్రాక్టీస్ మరియు విద్య పరిశోధనకు చెందిన అనువాదాన్ని పెంచే సిసిఆర్‌హెచ్‌ ప్రచురణలు కూడా విడుదల చేయబడతాయి.

ప్రారంభ సెషన్ తరువాత  భారతదేశంలో ఇంటిగ్రేటివ్ మెడిసిన్ పరిధిలో హోమియోపతికి  అవకాశాలపై విధాన రూపకర్తలకు ప్యానెల్ చర్చ జరుగుతుంది. ఈ చర్చలకు విధాన నిర్ణేతలు మరియు హోమియోపతి నిపుణులు హాజరవుతారు.

కొవిడ్- 19 చికిత్స మరియు నివారణ పేరుతో హోమియోపతికి ప్రత్యేకమైన సెషన్ నిర్వహిస్తారు. కొవిడ్ అధ్యయనాలపై పరిశోధకులు మరియు కొవిడ్ 19 చికిత్స మరియు నివారణలో హోమియోపతి పాత్రపై ప్రముఖ విద్యావేత్తలు ఈ సెషన్‌లో వివరాలు అందిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన ఇద్దరు అంతర్జాతీయ వక్తలు డాక్టర్ మైఖేల్ ఫ్రాస్, ప్రొఫెసర్ మెడిసిన్, వియన్నాలోని ఇంటర్నల్ మెడిసిన్ మరియు ఇంటర్నల్ ఇంటెన్సివ్ కేర్ మెడిసిన్ స్పెషలిస్ట్ మరియు హాంకాంగ్‌కు చెందిన హెచ్‌కే అసోసియేషన్ ఆఫ్ హోమియోపతి అధ్యక్షులు డాక్టర్ టు కా లూన్ ఆరోన్ వర్చువల్ విధానంలో సదస్సులో పాల్గొంటారు. ఇంటిగ్రేటివ్ క్లినికల్ కేర్‌పై వారి అనుభవాన్ని పంచుకుంటారు. అలాగే కేలంబక్కం, చెట్టినాడ్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, రీజెనరేటివ్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ విభాగం డాక్టర్ అంటారా బ్యానర్జీ అసోసియేట్ ప్రొఫెసర్ హోమియోపతిపై తన పరిశోధన ఆధారాలను పంచుకోనున్నారు.

నేషనల్ హెల్త్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ క్యాన్సర్, డయాబెటిస్, హృదయ సంబంధ వ్యాధులు మరియు స్ట్రోక్ (ఎన్‌పిసిడిసిఎస్), క్యాన్సర్ మరియు కేరళ రాష్ట్రంలో  ఉపశమన సంరక్షణ కార్యక్రమాలు, వృద్ధాప్య సంరక్షణ, పోషకాహారలోపాన్ని అరికట్టడానికి కమ్యూనిటీ ఆధారిత చొరవ మొదలైన ఆంశాలపై నిపుణులు తమ అనుభవాలను సూచనలను హోమియోపతిపై  సదస్సులో పంచుకుంటారు.

సిసిఆర్‌హెచ్ షార్ట్ టర్మ్ స్టూడెంట్‌షిప్ ఇన్ హోమియోపతి (ఎస్‌టిఎస్‌హెచ్) / ఎమ్‌డి స్కాలర్‌షిప్ మరియు విజేతల పోస్టర్ ప్రెజెంటేషన్లకు సర్టిఫికెట్లు అందించే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ‘మిత్ బస్టింగ్ ఇన్ హోమియోపతి’వీడియో తయారీ పోటీలో విజేతలను కూడా సత్కరిస్తారు.

రెండు రోజుల సమావేశంలోని చర్చలు ప్రజారోగ్యంతో పాటు పరిశోధనలో హోమియోపతి సమైక్యతకు భవిష్యత్ రోడ్‌మ్యాప్‌కు దిశానిర్దేశం అందిస్తాయి. 

***



(Release ID: 1710868) Visitor Counter : 196