గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

స్వయం సహాయక బృందాల నెట్‌వర్క్ ద్వారా గ్రామీణ ప్రజలు కరోనా నిబంధనలను పాటించడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, కొవిడ్‌-19టీకాల తీసుకోవడాన్ని దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన- జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్లు ప్రోత్సహిస్తున్నాయి

Posted On: 09 APR 2021 3:28PM by PIB Hyderabad

టైర్ 2 , 3 పట్టణాలు సహా అన్ని చోట్లా ఇటీవల కొవిడ్‌-19కేసులలో వేగవంతమైన పెరుగుదలను, వైరస్ వ్యాప్తిని ఆపడానికి తక్షణ చర్యలు అవసరం. ఇందుకోసం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన- జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అధికారులు ఆన్‌లైన్ శిక్షణలను ప్రారంభించారు. దేశంలోని 69 లక్షలకు పైగా స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జి)లకు తర్ఫీదును ఇస్తున్నారు. కొవిడ్‌-19 టీకా వేయించుకోవడం, కొవిడ్‌-19 ప్రొటోకాల్స్ను పాటించడం, ఆరోగ్యం సంరక్షణ విధానాలు, రోగనిరోధక శక్తి పెంచుకోవడంపై అవగాహన కలిగించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ శిక్షణా ఈ కార్యక్రమాలు 2021 ఏప్రిల్ 8 నుండి జాతీయ స్థాయిలో ప్రారంభమయ్యాయి. తరువాత స్వయం సహాయక బృంద సభ్యులకు క్షేత్రస్థాయి శిక్షణ ఉంటుంది. గత జూన్ లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని కొవిడ్‌-19 నివారణ చర్యలపై ఇది వరకే ఇచ్చిన శిక్షణలకు ఇది కొనసాగింపు. రాష్ట్ర, జిల్లా , బ్లాక్ స్థాయిలోని ప్రధాన శిక్షకులకు , ముఖ్య సిబ్బందికి జాతీయ స్థాయి రిసోర్స్ పర్సన్లు శిక్షణ ఇస్తారు.  మాస్టర్ ట్రైనర్లు క్లస్టర్ స్థాయి ఫెడరేషన్ ఆఫీస్ బేరర్లకు, సోషల్ యాక్షన్ కమిటీ సభ్యులకు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ (సిఆర్పి) , కమ్యూనిటీ కేడర్కు తర్ఫీదు ఇస్తారు. శిక్షణ పొందిన సిఆర్‌పిలు స్వయం సహాయక సంఘ సభ్యులకు, ఇతర సంఘ సభ్యులకు గ్రామ స్థాయిలో శిక్షణ ఇస్తారు. ముఖ్యమైన సందేశాలను  స్వయం సహాయక సంఘాల నాయకులు వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తారు. వీటిలో కరపత్రాలు పంచడం, ప్రకటనలు ఇవ్వడం, గోడ రచనలు, రంగోళీలు వేయడం వంటివి ఉంటాయి. శారీరక దూర నిబంధనలకు కట్టుబడి చిన్న సమూహాలతో సమావేశాలు ఉంటాయి. దీనిని సులభతరం చేయడానికి 29 రాష్ట్రాలు , 5 కేంద్రపాలిత ప్రాంతాల నుండి వచ్చిన రాష్ట్ర మిషన్ సిబ్బంది కోసం ఏప్రిల్ 8, 21 న ఆన్‌లైన్ శిక్షణ ఇచ్చారు.

ఈ శిక్షణా కార్యక్రమాల్లో కొవిడ్‌-19  నివారణ చర్యలు, పాటించాల్సిన నిబంధనలు, కొవిడ్‌-19 వ్యాక్సిన్లను పొందే  సమాచారం  వంటి వాటి గురించి వివరించారు. కొవిడ్‌ నిబంధనలు, టీకా  ప్రాముఖ్యత, టీకా షెడ్యూల్, ప్రతి టీకాకు రెండు మోతాదుల మధ్య అంతరం, టీకా నమోదు , ధృవీకరణ గురించి కూడా విశదీకరించారు.  రెండు టీకాలతో కలిగే దుష్ప్రభావాలకు సంబంధించిన భయాలను పోగొట్టడం కూడా ఈ కార్యక్రమాల లక్ష్యం. ఈ సెషన్లు ప్రజారోగ్య వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచుతాయి.  వివిధ మత , సాంస్కృతిక సమూహాలు టీకాలకు వ్యతిరేకంగా ఏర్పరుచుకున్న అపోహలను తొలగిస్తాయి. లింగపరమైన పక్షపాతాలను కూడా పరిష్కరిస్తాయి. టీకా స్వీకరించడానికి పురుషులకు ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్య సంరోణ , పోషకాహార సేవలు , అందుబాటులో ఉన్న సామాజిక భద్రతా పథకాలకు సంబంధించిన సమాచారంతో పాటు అన్ని వయసులవారికి నిర్దిష్ట ఆరోగ్య ప్రమాదాలపైనా అవగాహన కలిగిస్తాయి. నిరంతరం మంచి ఆహారం తీసుకోవడం, ముఖ్యంగా స్థానికంగా లభించే పోషకమైన ఆహారాల ద్వారా కూడా వ్యాధితో పోరాడటానికి వ్యక్తి  రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని శిక్షణా కార్యక్రమాల్లో వివరిస్తున్నారు.

***



(Release ID: 1710762) Visitor Counter : 263