నీతి ఆయోగ్
ఆన్‌లైన్ వివాదాల పరిష్కార కరదీపికను శనివారం ఆవిష్కరించనున్న నీతి ఆయోగ్
प्रविष्टि तिथि:
09 APR 2021 3:05PM by PIB Hyderabad
ఆగామి, ఒమిడియార్ నెట్‌వర్క్ ఇండియా సహకారం, ఐసిఐసిఐ బ్యాంక్, అశోక ఇన్నొవేటర్స్ ఫర్ ది పబ్లిక్, ట్రైలీగల్, దల్‌బెర్గ్, ద్వార, ఎన్ ఐపిఎఫ్‌పి మద్దతుతో నీతి ఆయోగ్ - తొలిసారి భారతదేశంలో ఆన్‌లైన్ వివాద తీర్మాన (ఒడిఆర్) కరదీపకను రేపు విడుదల చేయనుంది.
భారత దేశ అత్యున్నత న్యాయ స్థానమైన గౌరవనీయ న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఈ పుస్తకాన్ని విడుదల చేసి, ప్రారంభోపన్యాసం చేయనున్నారు. నీతి ఆయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్, టాటా సన్స్ ఉపాధ్యక్షురాలు పూర్ణిమ సంపత్, ఉడాన్ (Udaan) హెడ్ కలెక్షన్స్ సుమిత్ గుప్తా కూడా ఈ ఆవిష్కరణ సభలో పాల్గొంటారు.
ఈ కరదీపిక భారత దేశంలోని అగ్ర వాణిజ్యవేత్తలు ఓడిఆర్ ను అనుసరించేందుకు ఆహ్వానం. అటువంటి యంత్రాంగం అవసరాన్ని, వ్యాపారాలు అవలంబించగల ఒడిఆర్ నమూనాలు, వాటి కార్యాచరణను ఇది ప్రముఖంగా పేర్కొంటుంది.
ముఖ్యంగా చిన్న, మధ్య విలువగల కేసులలో, చర్చలు, మధ్యవర్తిత్వం, పంచాయితీ వంటి ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారానికి (ఎడిఆర్ - ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్) డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని, పద్ధతులను ఉపయోగించి కోర్టుల బయిట వివాదాల పరిష్కారం చేయడమే ఒడిఆర్. న్యాయ వ్యవస్థ కృషి ద్వారా ఒకవైపు కోర్టులు డిజిటైజ్ అవుతున్న నేపథ్యంలో అవి మరింత సమర్ధవంతం, కొలవదగిన, అత్యవసరంగా వివాదాల పరిష్కారం, వాటిని నియంత్రించడం కోసం సహకార విధానాలు అవసరం. ఓడిఆర్ వివాదాలను సమర్ధవంతంగా, అందుబాటులో పరిష్కరించేందుకు ఒడిఆర్ తోడ్పడుతుంది.
***
(रिलीज़ आईडी: 1710754)
आगंतुक पटल : 237