మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

ఆయుర్వేదం, దాని అనుబంధ శాస్త్రాల విధానాలతో పశు వైద్య చికిత్సలు చేసేందుకు పశు సంవర్ధక &పాడి పరిశ్రమ విభాగం, ఆయుష్ మంత్రిత్వ శాఖ మధ్య ఎంవోయూ

Posted On: 08 APR 2021 1:53PM by PIB Hyderabad

కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖకు చెందిన పశు సంవర్ధక &పాడి పరిశ్రమ విభాగం, ఆయుష్ మంత్రిత్వ శాఖ మధ్య బుధవారం ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. పరిశోధన, అభివృద్ధి దిశగా ఆయుర్వేదం, దాని అనుబంధ శాస్త్రాల విధానాలను ప్రోత్సహించేందుకు, పశువైద్యంలో ఆయా పద్ధతులను ప్రవేశపెట్టేలా ఈ ఎంవోయూ కుదిరింది. ఔషధ మూలికల ద్వారా పశు వైద్యంలో నాణ్యమైన ఔషధాల తయారీకి పరిశోధనలు చేయడం కూడా ఈ ఒప్పందంలో భాగం.

    పశువుల ఆరోగ్యం, వాటి యజమానులు, సమాజానికి భారీ ప్రయోజనం కోసం వైశు వైద్య రంగంలో ఆయుర్వేద చికిత్సలను ఉపయోగించేందుకు ఒక నియంత్రణ యంత్రాంగం రూపొందడానికి ఈ ఎంవోయూ తోడ్పడుతుంది. శిక్షణ, పశు వైద్యంలో మూలిక ఔషధాల మార్కెటింగ్‌ అవకాశాలను అన్వేషించడం, ఔషధ మొక్కల పెంపకం, సంరక్షణ సహా చికిత్సల కోసం వాటిని అందించడం ద్వారా సంబంధిత రంగాల్లో సామర్థ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటుంది. మూలిక పశు వైద్య విద్య విధానాలు అభివృద్ధి చేయడానికి, పశు వైద్య మూలికల వినియోగం, ప్రాముఖ్యత, ఔషధ మొక్కల పెంపకంపై పాడి, వ్యవసాయ రైతుల్లో అవగాహన కల్పించడానికి ఈ ఎంవోయూ సాయపడుతుంది.

***



(Release ID: 1710446) Visitor Counter : 223