రైల్వే మంత్రిత్వ శాఖ

2020-21 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి తుక్కు అమ్మకాలు సాధించిన భారతీయ రైల్వే తుక్కు అమ్మకాల ద్వారా 2020-21లో రూ.4573 కోట్లు సంపాదించిన రైల్వే


2019-20లో వచ్చిన రూ.4333 కోట్లతో పోలిస్తే, ఇది 5.5 శాతం అధికం
తుక్కును సమీకరించి ఈ-వేలం ద్వారా అమ్మేందుకు వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్న రైల్వే

Posted On: 07 APR 2021 4:49PM by PIB Hyderabad

గత ఆర్థిక సంవత్సరం ‍(2020-21)లో, భారతీయ రైల్వే అత్యధిక తుక్కు అమ్మకాలను సాధించింది. ఈ అమ్మకాల ద్వారా రూ.4573 కోట్లు సంపాదించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరమైన 2019-20లో వచ్చిన రూ.4333 కోట్లతో పోలిస్తే, గతేడాది వచ్చిన మొత్తం 5.5 శాతం అధికం. ఇప్పటివరకు 2009-10లో వచ్చిన రూ.4409 కోట్లు అత్యధిక రికార్డుగా ఉంది. తుక్కును సమీకరించి ఈ-వేలం ద్వారా అమ్మేందుకు వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా అన్ని ప్రయత్నాలను రైల్వే చేస్తోంది.

    పనికిరాని వస్తువుల సమీకరణ, అమ్మకాలు రైల్వేలో నిరంతర ప్రక్రియ. ప్రాంతీయ, రైల్వే బోర్డు స్థాయిలో దీనిని పర్యవేక్షిస్తారు. నిర్మాణ ప్రాజెక్టుల్లో, గేజ్‌ మార్పిడి ప్రాజెక్టుల్లో సాధారణంగానే తుక్కు తయారవుతుంది. పూర్తిస్థాయి తుక్కుగా నిర్ధారించిన వాటిని ట్రాక్‌ నిర్మాణంలో మళ్లీ వినియోగించరు. నిబంధనల ప్రకారం వాటిని పక్కన పడేస్తారు.

 

***


(Release ID: 1710336) Visitor Counter : 164