మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఈ9 దేశాల విద్యా మంత్రుల సమావేశంలో ప్రసంగించిన విద్యాశాఖ సహాయ మంత్రి

Posted On: 07 APR 2021 2:40PM by PIB Hyderabad

ఈ9 చొరవతో జరిగిన ఈ9 దేశాల విద్యా మంత్రుల సంప్రదింపుల సమావేశంలో విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే ప్రసంగించారు: 2021 ఏప్రిల్ 6 న జరిగిన సదస్సులో ఎస్‌డిజి4 దిశగా పురోగతిని వేగవంతం చేయడానికి డిజిటల్ అభ్యాసాన్ని పెంచడంపై చర్చించారు. సమావేశంలో బంగ్లాదేశ్ విద్యా మంత్రి శ్రీమతి దీపు మోని, ఐక్యరాజ్యసమితి ఉప కార్యదర్శి, ఎంఎస్ అమీనా మొహమ్మద్, ఈ9 దేశాల విద్యా మంత్రులు, ఐక్యరాజ్యసమితి, యునిసెఫ్, యునెస్కో అధికారులు పాల్గొన్నారు. ఈ9 దేశాలలో బంగ్లాదేశ్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, నైజీరియా మరియు పాకిస్తాన్ ఉన్నాయి.

ఈ సందర్భంగా శ్రీ ధోత్రే మాట్లాడుతూ "కోవిడ్ 19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విద్యను దెబ్బతీసింది. భారతదేశంలో ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులకు విద్యను అందించడం నిజంగా ఒక సవాలు. డిజిటల్, టెలివిజన్ మరియు రేడియో వంటి విభిన్న రీతులను ఉపయోగించడం ద్వారా భారత ప్రభుత్వం అందరికీ నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా, పిల్లలు విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూసుకోవడం ఆనందంగా ఉంది. ఈ మహమ్మారి సమయంలో మా విద్యా మంత్రిత్వ శాఖ ప్రీమియర్ ఇంజనీరింగ్ మరియు మెడికల్ కోర్సుల యొక్క అతిపెద్ద ప్రవేశ పరీక్షలను దాదాపు 2.3 మిలియన్ల విద్యార్థుల కోసం విజయవంతంగా నిర్వహించింది. పరీక్షలను సురక్షితంగా నిర్వహించడంపై ఇది ఇతర దేశాలకు ఒక ఉదాహరణగా నిలిచింది" అని చెప్పారు.

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ విజన్‌కు అనుగుణంగా మేము డిజిటల్ సాధనాలను విస్తృతంగా ఉపయోగించుకున్నాము. దేశంలోని మారుమూల ప్రాంతానికి విద్యను తీసుకెళ్లడానికి వన్ నేషన్-వన్ డిజిటల్ ప్లాట్‌ఫాం-దీక్ష, వన్ నేషన్-వన్ ఛానల్ ప్రోగ్రామ్ -స్వయం ప్రభ, స్వయం మూక్స్ మరియు రేడియో ప్రసారాలను ఉపయోగించాము.దివ్యాంగ విద్యార్ధులకు కూడా ఆన్‌లైన్ విద్యను అందించాము. ఆత్మనిర్భర్ భారత్ సాకారం దిశగా పిఎం ఈ-విద్యాను ప్రారంభించామని, ఇది భారతదేశం అంతటా పాఠశాలలకు వెళ్లే దాదాపు 250 మిలియన్ల పిల్లలకు ప్రయోజనం చేకూర్చిందని శ్రీ ధోత్రే తెలియజేశారు.

అందరికీ సరసమైన విద్యను అందించేందుకు డిజిటల్ మరియు మల్టీ-మోడల్ విద్య తప్పనిసరి అని మహమ్మారి నిరూపించిందని శ్రీ ధోత్రే పేర్కొన్నారు. దీనికి డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, సాధనాలు మరియు డిజిటల్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం అవసరం. ఉపాధ్యాయ శిక్షణ, డేటా భద్రత మరియు గోప్యత, నిధులు మరియు అంచనా సాధనాలు కూడా అవసరం. బోధన మరియు అభ్యాసానికి తోడ్పడటానికి "డిజిటల్ ఫస్ట్" విధానాన్ని అందించడానికి భారతదేశంలో ప్రభుత్వం నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్‌ను ఏర్పాటు చేస్తోందని ఆయన తెలియజేశారు.

డిజిటల్ విద్య కోసం సమర్థవంతమైన వ్యవస్థను రూపొందించడానికి సమిష్టిగా మరియు సంఘీభావంగా పనిచేయవలసిన సమయం ఆసన్నమైందని శ్రీ ధోత్రే పిలుపునిచ్చారు. సమిష్టి చర్చ కోసం ఈ వేదికను అందించినందుకు యుఎన్, యునెస్కో, యునిసెఫ్ మరియు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా వివిధ ఆంశాలై ఈ9 సహచరులతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాము అని తెలిపారు.

విద్యా వ్యవస్థల్లో వేగంగా మార్పు తీసుకురావడం ద్వారా రికవరీని వేగవంతం చేయడం మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 ఎజెండాను ముందుకు తీసుకెళ్లడం ఈ చొరవ లక్ష్యం.  (i) ఉపాధ్యాయులకు మద్దతు; (ii) నైపుణ్యరంగంలో పెట్టుబడి; మరియు (iii) డిజిటల్ అసమానతలు తొలగింపు ఈ 2020 గ్లోబల్ ఎడ్యుకేషన్ మీటింగ్ ప్రాధాన్యతలలో మూడు ఆంశాలు.

***



(Release ID: 1710208) Visitor Counter : 172