సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ద‌వాయీ భీ, క‌డాయీ భీ అన్న సందేశాన్ని ప్ర‌చారం చేయ‌వ‌ల‌సిందిగా ప్రైవేటు టీవీ ఛానెళ్ళ‌కు ఐ&బి మంత్రిత్వ శాఖ స‌ల‌హా, సూచ‌న

Posted On: 06 APR 2021 6:30PM by PIB Hyderabad

దేశంలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ మంగ‌ళ‌వారం అన్ని ప్రైవేటు ఛానెళ్ళ‌కు స‌ల‌హా, సూచ‌న‌ల‌ను జారీ చేసింది. ప్ర‌స్తుతం త‌లెత్తుతున్న ప‌రిస్థితిని స‌మీక్షించేందుకు 4 ఏప్రిల్ 2021న ప్ర‌ధాన‌మంత్రి నేతృత్వంలో జ‌రిగిన స‌మావేశంలొ ప‌రీక్ష‌లు, గుర్తించ‌డం, చికిత్స, కోవిడ్‌కు త‌గిన ప్ర‌వ‌ర్త‌న‌, వాక్సినేష‌న్ అన్న ఐదు అంశాల‌తో కూడిన వ్యూహంపై దృష్టి పెట్టాల‌ని నిర్ణ‌యించిన విష‌యాన్ని ఆ సూచ‌న‌లో పేర్కొన్న‌ది. 
ప్ర‌జా ప్ర‌యోజ‌నాల నేప‌థ్యంలో ఈ సందేశాన్ని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్ళ‌డంలో ప్రైవేటు ఛానెళ్ళు ఉన్న‌త పాత్ర‌ను పోషించేందుకు నాయ‌క‌త్వం వ‌హిస్తాయ‌ని మంత్రిత్వ శాఖ పున‌రుద్ఘాటించింది. కోవిడ్‌కు త‌గిన ప్ర‌వ‌ర్త‌న‌, అర్హులైన వ్య‌క్తుల‌కు వాక్సినేష‌న్ కోసం ద‌వాయీ భీ క‌డాయీ భీ అన్న సందేశంపై మ‌రింత చైత‌న్యం తీసుకురావ‌ల‌సిందిగా ఛానెళ్ళ‌కు మంత్రిత్వ శాఖ విజ్ఞ‌ప్తి చేసింది. 

***



(Release ID: 1710129) Visitor Counter : 159