ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఒక్క రోజులో 43 లక్షల టీకాలతో మరో మైలురాయి దాటిన భారత్


8 కోట్లు దాటిన మొత్తం కోవిడ్ టీకా డోసులు దేశవ్యాప్తంగా 25 కోట్లు దాటిన కోవిడ్ పరీక్షలు

Posted On: 06 APR 2021 11:48AM by PIB Hyderabad

భారత దేశం కోవిడ్ టీకాలలో మరో చరిత్రాత్మక  మైలురాయి దాటింది. గత 24 గంటలలో 43 లక్షల టీకా డోసుల పంపిణీ జరిగింది. ఒక్క రోజులోనే ఇన్ని టీకాలివ్వటం ఇప్పటి దాకా అత్యధికం.  టీకాల కార్యక్రమం మొదలైన 80వ రోజైన ఏప్రిల్ 5న 43,00,966 టీకా డోసులిచ్చారు. అందులో  39,00,505 లబ్ధిదారులకు 48,095 శిబిరాల ద్వారా మొదటి డోసు ఇవ్వగా 4,00,461మంది లబ్ధిదారులకు రెండో డోస్ ఇచ్చారు.  

తేదీ: ఏప్రిల్ 5, 2021

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ మధ్య దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

 

29,819

27,117

83,159

1,28,453

23,33,147

45,189

14,54,380

1,99,702

39,00,505

4,00,461

 

 

దేశవ్యాప్తంగా ఇచ్చిన కోవిడ్ టీకాల మొత్తం సంఖ్య నేడు 8.31 కోట్లు దాటటం మరో  కీలక పరిణామం.  అందులో మొదటి డోస్ 7 కోట్లు దాటి 7,22,77,309 డోసులుగా నమోదైంది. ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం ప్రకారం 12,83,816 శిబిరాల ద్వారా 8,31,10,926 టీకా డోసులిచ్చారు. ఇందులో 89,60,061 డోసులు ఆరోగ్య సిబ్బందికిచ్చిన మొదటి డోసులు, 53,71,162 డోసులు ఆరోగ్య సిబ్బందికిచ్చిన రెండో డోసులు,   97,28,713 డోసులు కోవిడ్ యోధులకిచ్చిన మొదటి డోసులు,  42,64,691 డోసులు కోవిడ్ యోధులకిచ్చిన రెండో డోసులు, 3,41,06,071 డోసులు 60 ఏళ్ళు పైబడిన వారి మొదటి డోసులు,    8,12,237 డోసులు వారికిచ్చిన రెండో డోసులు కాగా 1,94,82,464 డోసులు 45 ఏళ్ళు దాటినవారికిచ్చిన మొదటి డోసులు,  3,85,527 రెండ డోసులు ఉన్నాయి.

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

 45 ఏళ్ళు పైబడ్డవారు

 60 ఏళ్ళు పైబడ్డవారు

 

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

89,60,061

53,71,162

97,28,713

42,64,691

1,94,82,464

3,85,527

3,41,06,071

8,12,237

8,31,10,926

 

దేశంలో ఇచ్చిన రోజువారీ టీకా డోసుల వివరాలను ఈ క్రింది చిత్రపటం తెలియజేస్తుంది.

 

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా చేసిన కోవిడ్ పరీక్షల సంఖ్య 25 కోట్లు దాటింది. మొత్తం పాజిటివ్ శాతం స్వల్పంగా పెరిగి 5.07% అయింది.

 

దేశంలో రోజువారీ కొత్త కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటలలో  96,982 కేసులు నమోదయ్యాయి. ఎనిమిది రాష్ట్రాలు – మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్ లలో రోజువారీ కేసులు పెరుగుతూ మొత్తం కేసుల్లో 80.04% వాటా పొందాయి.  మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులో  47,288 కేసులు రాగా, చత్తీస్ గఢ్ లో 7,302, కర్నాటకలో  5,279 నమోదయ్యాయి.  

 

 

ఈ దిగువ చూపిన విధంగా పన్నెండు రాష్ట్రాలలో కోవిడ్ కేసుల పెరుగుదల కనబడుతోంది. 

 

 

భారత్ లో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసుల సంఖ్య నేటికి 7,88,223 కి చేరింది. ఇది దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసులలో  6.21%. దీంతో నికరంగా చికిత్సలో ఉన్న వారి సంఖ్య గత 24 గంటలలో 46,393  పెరిగింది. దేశ వ్యాప్తంగా చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులలో మహారాష్ట్ర వాటా 57.42% నమోదైంది.  

 

దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి బైటపడినవారి మొత్తం సంఖ్య  1,17,32,279 కు చేరగా జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం  92.48%. గత 24 గంటలలో 50,143 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. 

గడిచిన 24 గంటలలో 446 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.  మరణాలలో 80.94% వాటా ఎనిమిది రాష్ట్రాలదే కాగా మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులో 155 మంది, పంజాబ్ లో 72 మంది కోవిడ్ తో చనిపోయారు..

 

గత 24 గంటలలో పదమూడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కోవిడ్ మరణం ఒకటి కూడా నమోదు కాలేదు. అవి: ఒడిశా, అస్సాం. పుదుచ్చేరి. లద్దాఖ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, లక్షదీవులు, మిజోరం, అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్.

 

****


(Release ID: 1709869) Visitor Counter : 314