ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
'అరుదైన వ్యాధుల జాతీయ విధానం' సంబంధించి 2021 స్పష్టీకరణ
प्रविष्टि तिथि:
06 APR 2021 10:15AM by PIB Hyderabad
అరుదైన వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం కింద చికిత్స అందుతుందని పేర్కొంటూ ఇటీవల ఒక వార్తాపత్రికలో ప్రచురించిన వార్తా కథనానికి సంబంధించిన సమాచారం ఇది. ఈ విషయంమై, ఇటీవల నోటిఫై చేసిన అంశం మేరకు “అరుదైన వ్యాధుల జాతీయ విధానం-2021”లో భాగంగా రాష్ట్రీయ ఆరోగ్య నిధి పథకం గొడుగు కింద రూ.20 లక్షల మేర ఆర్థిక సహాయానికి సంబంధించి ఒక నిబంధన ఉంది. ఆ తరహా వ్యాధులు కలిగి ఉన్న వారికి ఒకేసారి చికిత్స అవసరమైన మేరకు అరుదైన వ్యాధులు (అరుదైన వ్యాధి విధానంలో గ్రూప్-1 కింద జాబితా చేయబడిన వ్యాధులకు మాత్రమే) కలిగిన వారికి దీనిని అందిస్తారు. ఈ తరహా ఆర్థిక సహాయం కేవలం బీపీఎల్ కుటుంబాల వారికి మాత్రమే పరిమితం కాదు. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జనారోగ్య యోజన (పీఎంజేఏవై) కింద అర్హులైన వారికి అంటే జనాభాలో 40 శాతం మందికి విస్తరించబడుతుంది. అరుదైన వ్యాధుల చికిత్సకు ఈ ఆర్థిక సహాయం రాష్ట్రీయ ఆరోగ్య నిధి (ఆర్ఏఎన్) గొడుగు పథకం క్రింద ప్రతిపాదించబడింది. ఆయుష్మాన్ భారత్ (పీఎంజేఏవై) కిందన కాదు. అంతేకాకుండా, అరుదైన వ్యాధుల విధానం క్రౌడ్ ఫండింగ్ విధానాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో అరుదైన వ్యాధుల చికిత్స కోసం ఆర్థికంగా బలమైన ఐటీ వేదిక ద్వారా కార్పొరేట్, వ్యక్తులు ఆర్థిక సహాయాన్ని అందించమని ప్రోత్సహిస్తారు. అలా సేకరించిన నిధులను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ మూడు వర్గాల అరుదైన వ్యాధుల చికిత్సకు మొదటి ఛార్జీగా ఉపయోస్తార. మిగిలిన ఆర్థిక వనరులను పరిశోధన కోసం కూడా ఉపయోగించుకుంటారు.
***
(रिलीज़ आईडी: 1709854)
आगंतुक पटल : 258