రైల్వే మంత్రిత్వ శాఖ
ప్రపంచంలోనే అతి ఎత్తైన చీనాబ్ వంతెనలో వంపు నిర్మాణ ప్రక్రియ సంపూర్ణం!
అతిపెద్ద సివిల్ఇంజనీరింగ్ సవాలును దీటుగా ఎదుర్కొన్న రైల్వేశాఖ
కాత్రా-బనీలాల్ సెక్షన్ పూర్తిచేసే ప్రక్రియలో ఇదో గొప్ప ముందడుగు
వంతెన వంపునకు 359 మీటర్ల దిగువన ఇక చీనాబ్ జలాల ప్రవాహం
Posted On:
05 APR 2021 3:22PM by PIB Hyderabad
జమ్ము కాశ్మీర్ లోని చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ఎత్తైన వంతెనలో వంపు ఆకృతిని రైల్వేశాఖ ఈ రోజు పూర్తి చేసింది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా పేర్కొంటున్న ఈ రైలు వంతెన జమ్ము కాశ్మీర్ లో ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టు (యు.ఎస్.బి.ఆర్.ఎల్.) భాగంగా చేపట్టారు. ప్రధాన భాగమైన ఉక్కులోహపు వంపు నిర్మాణాన్ని ఈ రోజు పూర్తి చేయడంతో ఈ వంతెన నిర్మాణంలో ముఖ్యమైన ఘట్టం ముగిసింది. చీనాబ్ నదిపై వంతెన నిర్మాణంలో ఇది చాలా క్లిష్టతరమైన దశల్లో ఒకటిగా భావిస్తున్నారు. దీనితో కాత్రా నుంచి బనీహల్ మధ్య 111కిలోమీటర్ల రైలుమార్గ నిర్మాణంలో ఇది గొప్ప ఘట్టంగా చెబుతున్నారు. రైల్వేశాఖ ఇటీవల చేపట్టిన ప్రాజెక్టుల్లో ఇది దేశంలో మరెక్కడాలేని అతిపెద్ద సివిల్ ఇంజినీరింగ్ సవాలుగా చెప్పవచ్చు. ఈ వంతెనలో భాగంగా అల్లంత ఎత్తువ చివరిగా 5.6మీటర్ల పొడవైన లోహపు నిర్మాణాన్ని ఈ రోజు అమర్చారు. అంటే,.. చీనాబ్ నది రెండు తీరాలను అనుసంధానించేలా వంతెన వంపులోని రెండు భాగాలను ఈ రోజు కలిపేశారు. దీనితో వంతెన వంపు ఆకృతి పూర్తయింది. దిగువగా 359మీటర్ల లోతున ప్రవహించే చీనాబ్ నదిపై ఈ నిర్మాణం జరిగింది. ఈ వంపు ఆకృతి నిర్మాణం ముగియడంతో, పట్టుకోసం ఇదివరకు ఏర్పాటు చేసిన స్టే కేబుల్స్.ను ఇక తొలగిస్తారు. కాంక్రీటుతో వంపు బాక్స్.లను నింపేశి వంపును మరింత పటిష్టం చేయడం, వంపు భద్రతకు అవసరమైన ఉక్కు చట్రాన్ని ఏర్పాటు చేయడం, వయడక్టును ప్రారంభించడం, ఈ వంపు పొడవునా రైలు మార్గాన్ని నిర్మించడం వంటి కార్యకలాపాలను పూర్తి చేస్తారు.
చాతిత్రాత్మకమైన వంతెన వంపును పూర్తి చేసే ప్రక్రియను రైల్వే, వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖల మంత్రి పీయూష్ గోయెల్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తిలకించారు. రైల్వే బోర్డు చైర్మన్, ముఖ్యకార్యనిర్వణాధికారి సునీత్ శర్మ, ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్ అశుతోష్ గంగాల్ కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ ప్రక్రియను వీక్షించారు.
చీనాబ్ వంతెనలో వంపు నిర్మాణంలో ప్రధాన అంశాలు:
- కాశ్మీర్ లోయను దేశంలోని మిగతా ప్రాంతాలతో అనుసంధానం చేసే లక్ష్యంతో చీనాబ్ నదిపై ఈ చారిత్రాత్మకమైన వంపు వంతెన భారతీయ రైల్వే శాఖ చేపట్టింది. యు.ఎస్.బి.ఆర్.ఎల్. ప్రాజెక్టులో భాగంగా ఈ పనులను చేపట్టారు.
- ఈ వంతెన నిడివి 1,315మీటర్లు ఉంటుంది.
- ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెన. చీనాబ్ నదీ గర్భంనుంచి 359 మీటర్ల ఎత్తులో ఈ వంతెన ఉంటుంది.
- ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలోని చారిత్రాత్మక ఈఫిల్ టవర్ కంటే ఈ వంతెన ఎత్తు 35 మీటర్లు ఎక్కువ.
- ఈ వంతెన నిర్మాణంకోసం ఏకంగా 28,660 మెట్రిక్ టన్నుల ఉక్కును ఫాబ్రికేట్ చేశారు. పదిలక్షల ఘనపు మీటర్ల పరిమాణంలో మట్టిపనులు జరిగాయి. 66,000 ఘనపు మీటర్ల మేర కాంక్రీటును వినియోగించారు. వాహనాలు ప్రయాణానికి అనువుగా 26కిలోమీటర్ల నిడివితో రహదారులను నిర్మించారు.
- ఉక్కు బాక్సులతో ఈ వంతెన వంపును తీర్చిదిద్దారు. వంపు భాగం పటిష్టతను మెరగుపరచడానికి ఈ బాక్సుల్లో కాంక్రీటును నింపేస్తారు.
- ఈ వంపు మొత్తం బరువు 10,619 మెట్రిక్ టన్నులు.
- భారతీయ రైల్వే చరిత్రలో తొలిసారిగా, భారీ స్థాయి ఓవర్ హెడ్ కేబుల్ క్రేన్ల సహాయంతో ఆర్చ్ మెంబర్లను వంతెన వంపుకోసం అమర్చారు.
- ఈ వంతెన ఆకృతి రూపకల్పనకోసం ఎంతో అధునాతనమైన ‘టెక్లా’ సాఫ్ట్ వేర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు.
- పది డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలను తట్టుకునేలా తీర్చిదిద్దిన ఉక్కు లోహాన్ని ఈ వంతెన నిర్మాణంలో వినియోగించారు.
వంతెనకు సంబంధించిన మరిన్ని అంశాలు:
1. నిర్మాణసంస్థ: ఉత్తర రైల్వే
2. పథకం అమలుచేసే ఏజెన్సీ: వెస్సర్స్ కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్.
3. వంతెన నిర్మాణ వ్యయం: రూ. 1,486కోట్లు.
4. కంట్రాక్టర్: మెస్సర్స్ చీనాబ్ బ్రిడ్జి ప్రాజెక్ట్ అండర్ టేకింగ్ [Ultra-AFCONS-VSL(JV)]
5. వంతెన మొత్తం నిడివి: 1.315కిలోమీటర్లు
6. స్పాన్ల సంఖ్య: 17.
7. ప్రధాన వంపుకు సంబంధించిన స్పాన్ నిడివి: 467మీటర్లు (లీనియర్); 550మీటర్లు (కర్వీ లీనియర్)
8. వంతెన ఆకృతి గడువు: 120 సంవత్సరాలు
9. నమూనా వేగం: గంటకు100 కిలోమీటర్లు
10. మొత్తం ఫ్యాబ్రికేట్ చేసిన ఉక్కు బరువు: దాదాపుగా 28,660 మెట్రిక్ టన్నులు
11. నమూనా గాలి వేగం: గంటకు 266కిలోమీటర్లు
12. డిజైన్ రూపశిల్పులు:
ఎ. వయడక్ట్, పునాదులు: మెస్సర్స్ డబ్య్లుఎస్.పి. (ఫిన్లండ్)
బి. వంపు నిర్మాణం: మెస్సర్స్ లియోన్ హర్డ్, ఆండ్రా అండ్ పార్టనర్స్ (జర్మనీ)
సి. పునాది భద్రత: ఇండియన్ ఇన్.స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు
13. ప్రూఫ్ కన్సల్టెంట్:
ఎ. పునాది, పునాది భద్రత: మెస్సర్స్ యు.ఆర్.ఎస్., యునైటెడ్ కింగ్.డమ్ (యు.కె.)
బి. వయడక్ట్ సూపర్ స్ట్రక్చర్, వంతెన వంపు: మెస్సర్స్ సి.ఒ.డబ్ల్యు.ఐ., యు.కె.
14. వంతెన వాలు స్థిరత్వంపై విశ్లేషణ: (స్వతంత్ర సలహాదారు) మెస్సర్స్ ఐ.టి.ఎ.ఎస్.సి.ఎ., అమెరికా (యు.ఎస్.ఎ.)
15. వంతెన వాలు స్థిరత్వంపై విశ్లేషణ: ఇండియన్ ఇన్.స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐ.ఐ.టి.) ఢిల్లీ
16. భూకంపాలనుంచి రక్షణపై విశ్లేషణ: ఇండియన్ ఇన్.స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐ.ఐ.టి.), ఢిల్లీ, రూర్కీ
వంతెనకు సంబంధించిన వినూత్నమైన అంశాలు:
- గంటకు 266కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచినా తట్టుకునేలా పటిష్టమైన రీతిలో వంతెనకు రూపకల్పన చేశారు.
- పేలుడును తట్టుకునే సామర్థ్యంపై తొలిసారిగా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఒ.)ను సంప్రదించి ఈ వంతెన నమూనాను తయారు చేశారు.
- వంతెన నిర్మాణంలోని ఏదైనా ఒక స్తంబం తొలగినా ఈ వంతెన 30కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునేలా పనిచేయగలదు.
- దేశంలో వి-జోన్ తో సమానమైన భూకంప ప్రతికూలతల తీవ్రతను తట్టుకునేలా వంతెననను రూపొందించారు.
- ఈ వంతెనలో వెల్డింగ్ భద్రతను పరీక్షించేందుకు ఫేస్డ్ అర్రే అల్ట్రాసోనిక్ టెస్టింగ్ మెషీన్ ను వినియోగించారు. రైల్వేల్లో ఈ మెషీన్ ను వినియోగించడం ఇదే తొలిసారి.
- వెల్డింగ్ భద్రతను పరీక్షించేందుకు ఎన్.ఎ.బి.ఎల్. గుర్తింపు ఉన్న లేబరేటరీని ప్రాజెక్టు స్థలంలో ఏర్పాటు చేశారు. భారతీయ రైల్వేల్లో ఇలా చేయడం ఇదే తొలిసారి.
- వంతెన నిర్మాణంలో రెండు విడిభాగాలను అనుసంధానం చేయడానికి దాదాపు 584కిలోమీటర్ల మేర వెల్డింగ్ ప్రక్రియను నిర్వహించారు. ఈ నిడివి జమ్ము తావి, న్యూఢిల్లీ మధ్య దూరానికి సమానం.
- శ్రీనగర్ వైపు కేబుల్ క్రేన్ పైలాన్ ఎత్తు 127 కిలోమీటర్లు. ఇది కుతుబ్ మీనార్ కట్టడం ఎత్తుకంటే 72 మీటర్లు ఎక్కువ.
- ఎండ్ లాంచింగ్ పద్ధతిలో వంపుతో కూడిన వయడక్ట్ భాగాన్ని ప్రారంభించడం రైల్వేల చరిత్రలో ఇదే తొలిసారి.
- ఈ వంతెన నిర్మాణం సందర్భంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్య పర్యవేక్షణ, హెచ్చరికల వ్యవస్థలను ఏర్పాటు చేశారు.
వంతెన వంపు నిర్మాణ ప్రక్రియ వివరాలు:
- వంపు నిర్మాణం ముగింపునకు ముందు, ప్రారంభంలోనూ స్టే కేబుల్స్ బిగువన ఈ వంపు ఆకృతిని నిలబెట్టారు.
- ఎనిమిది విభాగాల పూర్తి నిర్మాణంతో వంతెన వంపు అమరిక ప్రక్రియను పూర్తి చేశారు.
- వంతెనలో వంపు భాగం భర్తీ చేసే ప్రక్రియను ఈ ఏడాది ఫిబ్రవరి 20న ప్రారంభించారు. ముగింపు ప్రక్రియ కార్యక్రమానికి ముందస్తుగానే 7 విభాగాల నిర్మాణం పూర్తయింది.
- వంపు నిర్మాణం పూర్తి చేసే సమయానికి డబ్ల్యు.టి. 28 నంబరు గల సెగ్మెంటును నిలబెట్టారు. ఈసెగ్మెంటు కౌరీ ప్రాంతం వైపు అంటే పశ్చిమ దిశలో ఉంది.
- పేరు: డబ్ల్యు,టి. 28 (ఎగువ ప్రాంతంలో ఉండే సెగ్మెంటు)
- పరిమాణం: 5.6 మీటర్లు x 4.0 మీటర్లు x 0.98 మీటర్లు ( పొడవు x వెడల్పు x ఎత్తు); బరువు=18.95 మెట్రిక్ టన్నులు
వంతెన వంపు అనుసంధానాన్ని పూర్తి చేసిన నేపథ్యంలో స్టే కేబుళ్లు తొలగించడం, వంతెన వంపు బాక్సులను కాంక్రీటుతో నింపి పటిష్ట పరచడం, స్తంబాలను నిలబెట్టడం, ప్రధాన వంపుపై డెక్ ను ఏర్పాటు చేయడం తదితర కార్యకలాపాలను ఇకపై చేపట్టబోతున్నారు.
వంతెన నిర్మాణంలో ముఖ్యమైన కార్యకలాపాల ప్రగతి, వివరాలు:
క్రమ సంఖ్య.
|
పనులు
|
పరిమాణం
|
ముగింపుదశ
|
1.
|
ఫ్యాబ్రికేషన్
|
28,660 మెట్రిక్ టన్నులు
|
28,595 మెట్రిక్ టన్నులు
|
2.
|
మొత్తం నిర్మాణం
|
28,660 మెట్రిక్ టన్నులు
|
16,902 మెట్రిక్ టన్నులు
|
3.
|
వంపు ఏర్పాటు
|
10,619 మెట్రిక్ టన్నులు
|
10,236 మెట్రిక్ టన్నులు
|
4.
|
రాక్ బోల్టులు
|
69,343 ఆర్.ఎం.టి.
|
66,683 ఆర్.ఎం.టి.
|
5.
|
షాట్.క్రీట్
|
75,061 చదరపు మీటర్లు
|
73,761 చదరపు మీటర్లు
|
******
(Release ID: 1709735)
Visitor Counter : 292