మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

2021 ఏప్రిల్ 07 న "పరీక్షా పే చర్చ" సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ముఖాముఖి

Posted On: 05 APR 2021 5:41PM by PIB Hyderabad

విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం పరీక్షా పే చర్చ 4వ ఎడిషన్ కొవిడ్-19 నిబంధనలకు లోబడి మొదటిసారిగా వర్చువల్ మోడ్‌లో  జరుగుతుంది. ఈ కార్యక్రమం 2021 ఏప్రిల్ 7 బుధవారం సాయంత్రం 7 గంటలకు టీవీ ఛానెల్స్ మరియు డిజిటల్ మీడియాలో హిందీ మరియు ఇతర ప్రధాన భారతీయ భాషలలో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమాన్ని విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం వరుసగా నాలుగో ఏడాది విజయవంతంగా నిర్వహిస్తోంది.

9 నుండి 12 తరగతుల విద్యార్ధులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు ఫిబ్రవరి 17 నుండి మార్చి 14, 2021 వరకు వివిధ అంశాలపై https://innovateindia.mygov.in/ppc-2021/ లో ఆన్‌లైన్ సృజనాత్మక రచన పోటీ జరిగింది.

పిపిసి 4వ ఎడిషన్ పోటీలో దాదాపు 14 లక్షల మంది పాల్గొన్నారు. సృజనాత్మక రచన పోటీలో 10.5 లక్షల మంది విద్యార్థులు, 2.6 లక్షల మంది ఉపాధ్యాయులు, 92 వేల మంది తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాల్గొన్న విద్యార్థులలో 60% కంటే ఎక్కువ 9 మరియు 10 తరగతులకు చెందినవారు. ప్రీ పిపిసి క్రియేటివ్ రైటింగ్ పోటీలో 81 విదేశీ దేశాల విద్యార్థులు తొలిసారిగా పాల్గొన్నారు.

పిపిసి ప్రధాన కార్యక్రమం టీవీ ఛానెల్స్‌తో పాటు డిజిటల్ మీడియాలో EduMinofIndia, నరేంద్రమోదీ, పిఎంవోఇండియా, పిఐబిఇండియా, దూరదర్శన్ నేషనల్, మైగవ్‌ఇండియా, డిడిన్యూస్, రాజ్యసభ టివి, స్వయంప్రభకు చెందిన ఫేస్‌బుక్‌ మరియు యూట్యూబ్ ఛానెళ్ళలో 7వ తేదీ సాయంత్రం  7గంటలనుండి ప్రసారమవుతుంది. #ExamWarriors #PPC2021 వంటి హ్యాష్‌ ట్యాగ్స్‌ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

"పరీక్షా పే చర్చ 2021" పేరుతో జరుగుతున్న పరీక్షల ఉత్సవాలను జరుపుకోవడంలో దేశం మొత్తం చేతులు కలుపుతుంది. తద్వారా దేశవ్యాప్తంగా గరిష్ట సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు గౌరవ ప్రధాన మంత్రి అనుభవాలు, సూచనల ద్వారా ప్రయోజనం పొందుతారు.

***



(Release ID: 1709734) Visitor Counter : 172