గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

సంకల్ప్‌ సే సిద్ది పేరుతో ట్రైఫెడ్‌ విలేజ్‌ డిజిటల్‌ కనెక్ట్‌ డ్రైవ్‌ ప్రారంభం

Posted On: 04 APR 2021 11:35AM by PIB Hyderabad

విలేజ్ డిజిటల్ కనెక్ట్ కార్యక్రమం విజయవంతం అయిన తరువాత దేశవ్యాప్తంగా ట్రైఫెడ్‌ ప్రాంతీయ అధికారులు  గిరిజన జనాభా అధికంగా ఉన్న  గ్రామాలకు వెళ్లి 2021లో వివిధ కార్యక్రమాలను వాటి అమలును పర్యవేక్షించారు. అందులో భాగంగా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రింద ట్రైఫెడ్‌ 'సంకల్ప్ సే సిద్ధి'- విలేజ్ & డిజిటల్ కనెక్ట్ డ్రైవ్ ప్రారంభించింది. వంద రోజుల డ్రైవ్‌లో భాగంగా ఏప్రిల్ 1, 2021 నుండి 150 బృందాలు (ప్రతి ప్రాంతంలో 10 మంది ట్రైఫెడ్ మరియు స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలు / మెంటరింగ్ ఏజెన్సీలు / భాగస్వాములు) పది గ్రామాలను సందర్శిస్తాయి. రాబోయే 100 రోజుల్లో ప్రతి ప్రాంతంలో 100 గ్రామాల చొప్పున దేశంలో 1500 గ్రామాలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతాయి. ఈ గ్రామాల్లో వందన్ వికాస్ కేంద్రాలను యాక్టివేట్‌ చేయడమే ఈ డ్రైవ్ యొక్క ప్రధాన లక్ష్యం.

సమాజంలో వెనుకబడిన గిరిజన వర్గాలకు సహాయం చేయడానికి ట్రైఫెడ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు, పథకాలు అమలవుతున్నాయి. ట్రైఫెడ్‌ పథకంలో మైనర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ (ఎంఎఫ్‌పి) కార్యక్రమం ద్వారా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) అందుస్తుంది. ఎంఎఫ్‌పి కోసం విలువ అధారిత అభివృద్ధి,  అటవీ ఉత్పత్తులను సేకరించేవారికి ఎంఎస్‌పి అందిస్తుంది. గిరిజన సమూహాలకు విలువతో పాటు అదనంగా మార్కెటింగ్‌ను పరిచయం చేస్తుంది. వందన్‌ వికాస్ కేంద్రాలు దేశవ్యాప్తంగా విస్తృతంగా ఆమోదం పొందాయి. ముఖ్యంగా 2020లో మహమ్మారి సమయంలో ఈ పథకం గిరిజనులకు అండగా నిలిచింది.

గిరిజనులు సేకరించే ఉత్పత్తులకు ప్రాధమిక ప్రాసెసింగ్, నిల్వ, రవాణా మొదలైన వాటికి సరసమైన ధరలను నిర్ధారించడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం ఎంఎస్‌పి ఫర్ ఎంఎఫ్‌పి పథకం యొక్క లక్ష్యం. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వనరుల స్థావరం యొక్క స్థిరత్వాన్ని నిర్ధారించడంతో పాటు ప్రభుత్వ జోక్యం ద్వారా ఉత్పత్తుల పాడైపోయే స్వభావం, హోల్డింగ్ సామర్థ్యం లేకపోవడం, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడం, మధ్యస్థుల దోపిడీ వంటి వాటిని నివారిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా 1500 గ్రామాల్లో విడివికెలను యాక్టివేట్ చేసిన తర్వాత వచ్చే 12 నెలల్లో రూ.200 కోట్ల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకున్నారు. సందర్శించే బృందాలు ట్రైఫుడ్‌ క్లస్టరింగ్ కోసం స్థానాలు మరియు విడివికేలను ఎస్‌ఎఫ్‌యుఆర్‌టిఐ యూనిట్లను గుర్తిస్తాయి. ఈ బృందాలు గిరిజన చేతివృత్తులవారిని మరియు ఇతర సమూహాలను కూడా గుర్తిస్తారు. వారిని సరఫరాదారులుగా ఎంపానెల్ చేస్తారు. తద్వారా వారు ట్రైబ్స్ ఇండియా నెట్‌వర్క్ ద్వారా - అవుట్‌లెట్‌లు మరియు ట్రైబ్స్ ఇండియా.కామ్ ద్వారా పెద్ద మార్కెట్లకు ప్రవేశం పొందవచ్చు.

దేశవ్యాప్తంగా గిరిజన వ్యవస్థ పూర్తి పరివర్తనకు సంకల్ప్ సే సిద్ధి కార్యక్రమం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

***



(Release ID: 1709523) Visitor Counter : 211