రైల్వే మంత్రిత్వ శాఖ
కోవిడ్ సంవత్సరంలో అంకితభావం మరియు అద్భుతమైన కృషి చేసిన రైల్ పరివార్ కి ధన్యవాదాలు తెలిపిన శ్రీ పియూష్ గోయల్
"మన సొంత నష్టాన్ని ఎప్పటికీ మరచిపోలేము, అయినా ఈ అసాధారణమైన మహమ్మారి నేపథ్యంలో రైల్ పరివార్ ప్రదర్శించిన ధైర్యం, చిత్తశుద్ధి, సంకల్పం విజయవంతం అయింది" - శ్రీ పియూష్ గోయల్
Posted On:
03 APR 2021 11:08AM by PIB Hyderabad
కోవిడ్ సంవత్సరంలో అన్ని రికార్డులని ఛేదించి అంకితభావం మరియు అద్భుతమైన కృషి చేసిన రైల్ పరివార్ కి రైల్వే, వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహరం, ప్రజాపంపిణీ వ్యవస్థ శాఖల మంత్రి శ్రీ పియూష్ గోయల్ కృతజ్ఞతలు తెలిపారు. దార్శనికుడు, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ జి నాయకత్వంలో మరో ఆర్థిక సంవత్సరానికి వీడ్కోలు పలికినందున ఇది చాలా గర్వంగా, సంతృప్తిగా ఉందని ఆయన అన్నారు.
గత సంవత్సరం మనం ఇంతకు ముందు అనుభవించిన వాటికి భిన్నంగా ఉందని ఆయన అన్నారు. మన స్వంత నష్టాన్ని ఎప్పటికీ మరచిపోలేము, ఇది అపూర్వమైన మహమ్మారి నేపథ్యంలో విజయవంతం అయిన రైల్ పరివార్ ధైర్యం, సంకల్పం అని ఆయన అభివర్ణిస్తూ కేంద్ర మంత్రి ఒక లేఖ రాశారు.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో, రైల్వే కుటుంబం దేశ సేవలో అంకితమైందని శ్రీ పియూష్ గోయల్ అన్నారు. ప్రపంచం నిలిచిపోయినప్పటికీ, రైల్వేమెన్ ఎప్పుడూ ఒక రోజు సెలవు తీసుకోలేదు మరియు ఆర్థిక చక్రాలు కదిలేలా మరింత కష్టపడ్డారు. అందరి నిబద్ధత కారణంగా, విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు, రైతులకు ఎరువులు లేదా దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఆహార ధాన్యాలు నిరంతరాయంగా అవసరమైన వస్తువుల సరఫరాను అందించగలిగాము అని మంత్రి తెలిపారు. కోవిడ్-19 కు వ్యతిరేకంగా సమిష్టి పోరాటంలో రైల్ పరివార్ చేసిన నిస్వార్థ సహకారాన్ని దేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని శ్రీ గోయల్ రాశారు.
"మీ సంపూర్ణ సంకల్ప శక్తి మరియు పునరుత్తేజంతో, ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోగలిగాము" అని మంత్రి అన్నారు. కుటుంబాలను ఏకం చేయడానికి మరియు 63 లక్షలకు పైగా విభిన్న ప్రాంతాల్లో చిక్కుకున్న పౌరులను తీసుకువెళ్ళడానికి 4,621 శ్రామిక్ స్పెషల్స్ నడిపాము. లాక్డౌన్ సమయంలో పరిమితులు ఉన్నప్పటికీ, 370 ప్రధాన భద్రత మరియు మౌలిక సదుపాయాల పనులు పూర్తయ్యాయి. కిసాన్ రైల్ సర్వీసెస్ మన అన్నదాతలకు నేరుగా పెద్ద మార్కెట్లతో అనుసంధానించే మాధ్యమంగా మారింది. మీరు, మీ సేవ ద్వారా మాత్రమే ఇది సాధ్యమైంది మరియు క్రమంగా, లక్షలాది మంది ప్రజల హృదయాలను మరియు జీవితాలను తాకింది.. అని శ్రీ పియూష్ గోయల్ తన లేఖలో పేర్కొన్నారు.
రైల్వే తన ఆదర్శప్రాయమైన పనితో ఆర్థిక పునరుద్ధరణకు నాయకత్వం వహించడం నాకు ఎంతో గర్వకారణం. 1,233 మిలియన్ టన్నుల సరుకును లోడ్ చేశారు, ఇది అన్ని సంవత్సరాల కన్నా ఉత్తమమైన ప్రగతి. గత ఆర్థిక సంవత్సరంలో 6,015 ఆర్‌కెఎం రైల్ విద్యుదీకరణ పనులు సాధించారు. "రికార్డులు విచ్ఛిన్నం కావాలి" మరియు భారత రైల్వేల కంటే ఎవ్వరూ దీనిని సాధించలేరు, అని మంత్రి తెలిపారు.
రైల్వేలు కస్టమర్-కేంద్రీకృతమై పనిచేసాయి. అలాగే వేగాన్ని మెరుగుపరచడానికి, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. సరుకు రవాణా రైళ్ల సగటు వేగం దాదాపు 44 కిలోమీటర్లకు రెట్టింపు కావడంతో ఈ మార్పు కనిపిస్తుంది. ప్రయాణీకుల రైళ్ల సమయపాలన 96% స్థాయిలో నిర్వహించారు. ప్రయాణీకుల సున్నా మరణాలు రికార్డు అయ్యాయి, గత 2 సంవత్సరాల్లో రైలు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గింది.
"మీ అంకితభావం మరియు అద్భుతమైన కృషికి ధన్యవాదాలు. ఈ ప్రేరేపిత బృందంతో, మనం రికార్డులు బద్దలు కొడుతూనే ఉంటాము, పెద్ద లక్ష్యాలను సాధిస్తాము, మా పనితీరుతో ఇతరులకు ఉదాహరణలను నిర్దేశిస్తాము మరియు భారతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదం చేస్తామని నేను నమ్మకంగా చెప్పగలను" అని శ్రీ గోయల్ తన లేఖలో ఆశాభావం వ్యక్తం చేశారు.
*****
(Release ID: 1709515)
Visitor Counter : 175