రైల్వే మంత్రిత్వ శాఖ
6000కు పైగా రూట్ కిలోమీటర్లతో రైల్వేలు మున్నెన్నడు లేని రీతిలో గరిష్ఠ స్థాయిలో రూట్ల విద్యుదీకరణ. చేపట్టింది. ఒక్క ఏడాదిలో 37 శాతం వృద్ధిని సాధించింది. 45,881 రూట్ కిలోమీటర్లు అంటే 71 శాతం 31-03-2021 నాటికి విద్యుదీకరింపబడింది.
మొత్తం రైల్వే విద్యుదీకరణలో 34 శాతం విద్యుదీకరణ గత మూడు సంవత్సరాలలోనే పూర్తి అయింది.
ఇది పర్యావరణానికి ఎంతో మేలు.
ప్రాజెక్టుల వేగం పెంచేందుకు రైల్వే కోవిడ్‌ను ఒక అవకాశంగా తీసుకుంది.
Posted On:
02 APR 2021 2:15PM by PIB Hyderabad
ఇండియన్ రైల్వే 2020-21 ఒక్క సంవత్సరంలోనే 6.015 రూట్‌కిలోమీటర్లు ( ఆర్.కె.ఎం) మేర గరిష్ఠ స్థాయిలో విద్యుదీకరణ చేపట్టింది.
కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ 2018-19 సంవత్సరంలో సాధించిన 5,276 ఆర్.కె.ఎం లను రైల్వే దాటింది.
2020-21 కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా రైల్వే విద్యుదీకరణలో 6000 కిలోమీటర్లపైగా మైలురాయిని దాటడం భారతీయ రైల్వేలు గర్వించదగిన సమయం. దీనితో భారతీయ రైల్వేల పర్యావరణ హిత కరమైన ఇంధన భద్రత కలిగిన సంస్థగా రూపుదిద్దుకుంటున్నది.
భారతీయ రైల్వేకి సంబంధించి తాజా గా బ్రాడ్‌గేజ్ నెటవర్క్ 63,949 రూట్‌కిలోమీటర్లు (ఆర్.కె.ఎం) కొంకణ్‌రైల్వేతోకూడాకలుపుకుంటే 64,689రూట్‌కిలోమీటర్లు. ఇందులో 45,881 రూట్ కిలోమీటర్లు అంటే 71 శాతం 31-03-2021 నాటికి విద్యుదీకరింపబడింది.
ఇటీవలి కాలంలో రైల్వే విద్యుదీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంజరిగింది. దేశం దిగుమతి చేసుకుంటున్న పెట్రోలియం ఆధారిత ఇంధన వనరుల వినియోగం తగ్గించడానికి , దేశ ఇంధన భద్రతను పెంపొందించడానికి, పర్యావరణ హితకర మైన, ఇంధన సామర్థ్యంతో కూడిన సమర్ధమైన రవాణా దార్శనికతతో రైల్వే విద్యుదీకరణపై దృష్టిపెట్టడం జరిగింది.
2014-21 సంవత్సరాల మధ్య గత ఏడు సంవత్సరాలలో 2007-14 సంవత్సరాల మధ్య సాధించిన విద్యుదీకరణతో పోల్చినపుడు 5 రెట్లు ఎక్కువ విద్యుదీకరణ జరిగింది. 2014నుంచి రికార్డు స్థాయిలో 24,080 ఆర్.కె.ఎం ( ప్రస్తుత బ్రాడ్‌గేజ్ రూట్లలో 37 శాతం) విద్యుదీకరణ కాగా 2007-14 మధ్య 4,337 ఆర్‌కెఎం ( ప్రస్తుత బ్రాడ్‌గేజ్‌రూట్లలో 7 శాతం) విద్యుదీకరణ జరిగింది.
మొత్తం విద్యుదీకరణ జరిగిన 45,881 ఆర్.కె.ఎం లలో ఇప్పటివరకు 34 శాతం విద్యుదీకరణ గత మూడు సంవత్సరాలలోనే జరిగింది.
ఇండియన్ రైల్వే రికార్డు స్థాయిలో 56 టిఎస్ ఎస్ లను ( ట్రాక్షన్ సబ్ స్టేషన్లను) 2020-21 సంవత్సరాలలో ఏర్పాటు చేసింది. అంతకు ముందు వీటి ఏర్పాటు సంఖ్య గరిష్ఠంగా 42. కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ 33 శాతం మెరుగుదల సాధించింది.
గత ఏడు సంవత్సరాలో 201 ట్రాక్షన్ సబ్ స్టేషన్లు ప్రారంభమయ్యాయి.
ఏడాదిగా భారతీయ రైల్వే విద్యుదీకరణ చేసిన కొన్ని ప్రధానరైల్వే సెక్షన్‌లు కిందివిధంగా ఉ న్నాయి.
సీరియల్ నెంబర్ -- ప్రధాన రూట్
1. ముంబాయి- హౌరా వయా జబల్‌పూర్
2. ఢిల్లీ- దర్భంగా -జయనగర్
3. గోరఖ్‌పూర్- వారణాశి వయా అవునరిహార్
4. జబల్‌పూర్ -నయిన్‌పూర్- గోండియా- బలార్ష
5. చెన్నై- ట్రిచి
6. ఇండోర్- గునా- గ్వాలియర్- అమృతసర్
7. ఢిల్లీ-జైపూర్- ఉదయ్‌పూర్
8. న్యూఢిల్లీ- న్యూకూచ్ బెహర్-శ్రీరామ్‌పూర్ అస్సాం వయా పట్నా, కతిహార్
9. అజ్మీర్- హౌర
10. ముంబాయి- మార్వార్
11. ఢిల్లీ- మోరాదాబాద్-తనక్‌పూర్
ఇండియన్ రైల్వే 2023 డిసెంబర్ నాటికి ట్రాక్‌లన్నింటినీ విద్యుదీకరించాలని ప్రణాళిక రూపొందించింది.
మొత్తం రైల్వే విద్యుదీకరణ వల్ల 2030 నాటి ఉద్గారాలు పూర్తిగా లేకుండా చేయాలన్నది లక్ష్యం.అది కూడా దాని మొత్తం విద్యుత్ అవసరాలను పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సమకూర్చుకోనున్నది.
*****
(Release ID: 1709327)
Visitor Counter : 251