ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆధార్, ఇతర నిర్ధిష్ట కాలపరిమితుల ఆఖరు తేదీల పొడిగింపు
Posted On:
31 MAR 2021 8:18PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వివిధ పన్ను, బినామీ చట్టాల కింద నిర్దేశించిన కొన్ని కాల పరిమితులను టాక్సేషన్, ఇతర చట్టాలు (సరళీకరణ, కొన్ని అంశాల సవరణ) చట్టం, 2020 కింద పొడిగించి, తదుపరి ఈ చట్టం కింద నోటిఫికేషన్లను జారీ చేయడం జరిగింది.
ఆదాయపు పన్ను చట్టం, 1961 (ది యాక్ట్) కింద ఆధార్ ను పాన్‌తో అనుసంధానం చేసేందుకు ఆధార్ సంఖ్యను తెలియచేయడానికి గడువు 31 మార్చి, 2021..కాగా, కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో ఆధార్ సంఖ్యను తెలియచేసేందుకు ఆఖరు తేదీని పొడిగించవలసిందిగా పన్ను చెల్లింపుదారుల నుంచి వినతులను ఆదాయపు పన్ను శాఖ అందుకుంది. పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని, కేంద్రప్రభుత్వం బుధవారం నాడు ఆధార్ సంఖ్యను తెలియజేసి, దానిని పాన్ తో అనుసంధానం చేసే తేదీని 30 జూన్, 2021వరకు పొడిగిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది.
ఈ నోటిఫికేషన్ లోనే చట్టంలోని 148 సెక్షన్ కింద నోటీసులు జారీ చేసే కాలపరిమితిని, వివాదాల పరిష్కార ప్యానెల్ (డిఆర్‌పి) ఆదేశాలతో జారీ చేసిన తదుపరి ఉత్తర్వులను, ఈక్వలైజేషన్ లెవీ స్టేట్ మెంట్ల ప్రాసెసింగ్ ను కూడా30 ఏప్రిల్, 2021 వరకు పొడిగించింది.
****
(Release ID: 1708859)
Visitor Counter : 309