నౌకారవాణా మంత్రిత్వ శాఖ
సూరత్, డయ్యూల మధ్య మొట్టమొదటిసారి క్రూయిజ్ సర్వీస్ ప్రారంభమైంది.
జల రవాణాకు అద్భుత అవకాశాలు ఉన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం దీనిపై ప్రధానంగా దృష్టి పెడుతుంది:
క్రూయిజ్ సర్వీస్ ఈ–ఫ్లాగింగ్ సందర్భంగా కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవియా
Posted On:
31 MAR 2021 6:02PM by PIB Hyderabad
కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్ & జలమార్గాల శాఖ మంత్రి (ఇండిపెండెంట్ చార్జ్) మన్సుఖ్ మాండవియా ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హజీరా పోర్ట్ ఆఫ్ సూరత్ నుండి డయ్యూ వరకు క్రూయిజ్ సేవను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రూయిజ్ టూరిజం అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని అన్నారు. ‘2014 కి ముందు, భారతీయ ఓడరేవులలో 139 క్రూయిజ్ కాల్స్ వచ్చాయని ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. కోవిద్-19 మహమ్మారి ఉన్నప్పటికీ దేశంలో 450 క్రూయిజ్ కాల్స్ వచ్చాయి. 2014 నుండి క్రూయిజ్ సర్వీసుల్లో ప్రయాణించే పర్యాటకుల సంఖ్యలో భారీ పెరుగుదల ఉంది. 2014 కి ముందు సంఖ్య లక్ష మంది క్రూయిజ్లో ప్రయాణించగా, 2019-20లో పర్యాటకుల సంఖ్య 4.5 లక్షలు ’ అని మాండవియా తెలిపారు. భారత తీరప్రాంతం క్రూయిజ్ టూరిజం పరిశ్రమకు ఎంతో అనువుగా ఉంటుందని, పశ్చిమ తీరం (ముంబై, గోవా, కొచ్చి) తూర్పు తీరం (విశాఖపట్టణం, కోల్‌కతా, చెన్నై) రెండింటిలోనూ 6 అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్స్ ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని మాండవియా ప్రకటించారు. దక్షిణ గుజరాత్ గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతాల మధ్య ఫెర్రీ, రోరో రోపాక్స్ సేవలు అభివృద్ధి చెందుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. జల రవాణాలో అత్యాధునిక ఫెర్రీ టెర్మినల్స్, క్రూయిజ్‌లకు అపారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. క్రూయిజ్లో ఒక వైపు ప్రయాణ సమయం సుమారు 13 నుండి 14 గంటలు ఉంటుంది. ఒక్కో క్రూయిజ్ కు 300 మంది ప్రయాణీకుల సామర్థ్యం ఉంటుంది. 16 క్యాబిన్లు ఉంటాయి. ఈ క్రూయిజ్ వారం రెండు రౌండ్ ట్రిప్పులు ప్రయాణించనుంది. గేమింగ్ లాంజ్, విఐపి లాంజ్, ఎంటర్టైన్మెంట్ ఆన్ డెక్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఒక వైపు ప్రయాణానికి రూ .900 + పన్నులు (ఒక్కొక్కరికి) ఖర్చవుతుంది. గత నవంబరులో ప్రధాని నరేంద్ర మోడీ 'హజీరా-ఘోగా' రోపాక్స్ సేవను ప్రారంభించారు. మొదటి నాలుగు నెలల్లోనే లక్ష మంది ప్రయాణికులు, వేలాది వాహనాలు ఫెర్రీ సేవను ఉపయోగించుకున్నాయి. హజీరా (సూరత్) నుండి ఘోఘా వరకు ప్రయాణ ఖర్చును, సమయాన్ని తగ్గించుకున్నారు. (భవనగర్). ఫెర్రీ సేవ విజయం గుజరాత్ భారతదేశం అంతటా మరెన్నో నీటి రవాణాలకు ద్వారాలను తెరిచిందని మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు.
***
(Release ID: 1708856)
Visitor Counter : 209