ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రెండవ డోస్ కోవిడ్-19 టీకా వేయించుకున్న - డాక్టర్ హర్ష వర్ధన్ మరియు శ్రీమతి నూతన్ గోయెల్


"మొదటి డోస్ తీసుకున్న తర్వాత మనం ఎటువంటి అసౌకర్యాన్ని అనుభవించలేదు"

"అందరూ సురక్షితంగా ఉండే వరకు మనలో ఎవరూ సురక్షితంగా లేరు"

సి.ఏ.బి. ని అనుసరించాలనీ, అర్హులైన ప్రతి కుటుంబ సభ్యునికీ, టీకాలు వేయాలని విజ్ఞప్తి చేసిన - డాక్టర్ హర్ష వర్ధన్

Posted On: 30 MAR 2021 3:21PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ తో పాటు ఆయన భార్య శ్రీమతి నూతన్ గోయల్, న్యూ ఢిల్లీ లోని హార్ట్ అండ్ లంగ్ ఇన్స్టిట్యూట్ ‌లో, ఈ రోజు, కోవిడ్-19 టీకా (కోవాక్సిన్) యొక్క రెండవ డోస్ వేయించుకున్నారు. వారు  28 రోజుల ముందు టీకా యొక్క మొదటి డోస్ ను  2021 మార్చి, 2వ తేదీన, వేయించుకున్నారు.  

ముఖ్యంగా 45 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికీ టీకాలు వేయాలని ఇటీవల తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో, టీకాలు వేయించుకోడానికి అర్హత ఉన్న ప్రతి వ్యక్తి, టీకాలు వేయించుకోవాలని, డాక్టర్ హర్ష వర్ధన్, విజ్ఞప్తి చేశారు. "మొదటి డోస్ తీసుకున్న తర్వాత మనం ఎటువంటి అసౌకర్యాన్ని అనుభవించలేదు", అని తెలియజేశారు.  ప్రోటోకాల్‌ లో పొందుపర్చిన ఏ.ఈ.ఎఫ్.ఐ. (రోగనిరోధకత తరువాత ప్రతికూల సంఘటనలు) పర్యవేక్షణ మరియు ఏ.ఈ.ఎఫ్.ఐ. ని నివేదించే లబ్ధిదారుల నిష్పత్తి చాలా తక్కువగా ఉందని ఆయన ఈ సందర్భంగా ఉదహరిస్తూ,  "అన్ని టీకాలు ఖచ్చితంగా సురక్షితమైనవి, రోగనిరోధక శక్తి కలిగినవి  మరియు ప్రభావవంతమైనవి." అని పునఃరుద్ఘాటించారు.  టీకాలు వేసుకున్న తర్వాత కరోనా వ్యాధి సోకుతోందన్న వ్యక్తుల గురించి విలేకరులు వ్యక్తం చేసిన ఆందోళనలపై ఆయన స్పందిస్తూ, “ఇటువంటి  కేసులు చాలా తక్కువగా ఉన్నాయి.  టీకా యొక్క రెండవ మోతాదు తర్వాత యాంటీబాడీస్ పూర్తిగా అభివృద్ధి చెందడానికి రెండు వారాలు పడుతుంది, ఇది వ్యాధి వ్యాప్తిని నిరోధిస్తుంది. అయితే, టీకాలు వేయించుకునే ప్రక్రియతో సంబంధం లేకుండా కోవిడ్ నియమ నిబంధనలకు (సి.ఏ.బి) కి కట్టుబడి ఉండాలన్న, మన మునుపటి విజ్ఞప్తిని మరచిపోరాదని, ఇది మనకు గుర్తుచేస్తుంది.” అని సూచించారు.  టీకాలు వేయించుకున్న వారికి, కోవిడ్ సోకే అవకాశాలు చాలా తక్కువనీ, సోకినా, అది తీవ్ర స్థాయికి చేరుకోదనీ కూడా, ఆయన తెలియజేశారు.  టీకాలకు సంబంధించి, సామాజిక మాధ్యమాల్లో, వివిధ పుకార్లను ప్రచారం చేస్తున్నారనీ,  ఇది సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదని, ఆయన హెచ్చరించారు.  వాట్సాప్ లో అతిగా ప్రసారమవుతున్న వందంతులు కంటే, శాస్త్ర పరిజ్ఞానాన్ని విశ్వసించాలని, ఆయన,  గట్టిగా కోరారు. 

దేశవ్యాప్తంగా కోవిడ్ రెండవ దశ కేసుల పెరుగుదల గురించి కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, డాక్టర్ హర్ష వర్ధన్, దేశంలోని ప్రతి ఒక్కరికీ భరోసా ఇస్తూ,  "కోవిడ్ వ్యాప్తికి వ్యతిరేకంగా తగిన నియమ నిబంధనలు అనుసరించడంలో ప్రజల కఠినమైన వైఖరి ద్వారా లభిస్తున్న ప్రయోజనానికి, ఈ పరిస్థితి అద్దం పడుతోంది. కోవిడ్ కి వ్యతిరేకంగా, నిర్వహిస్తున్న మన జన్ ఆందోళన లో - టీకాలు వేసే కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు, ఈ నిబంధనలను కొనసాగించడం, ప్రధాన చర్యలుగా నిలిచాయి", అని వివరించారు.   తీవ్రంగా కోవిడ్  సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న క్లినికల్ వైద్య విధానాలతో పాటు ‘టెస్ట్, ట్రాక్ & ట్రీట్’ వ్యూహం వంటివి - వ్యాధి వ్యాప్తిని నియంత్రించడంలో చాలా అవసరమని, ఇప్పుడు, అందరికీ,  బాగా తెలిసిందని,  ఆయన పేర్కొన్నారు.   రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ల  గురించి,  కేంద్ర ఆరోగ్య కార్యదర్శి తన సహచరులతో కలిసి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఉన్నతాధికారులతో తరచుగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు ల గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ, కోవిడ్ పరిస్థితిని పర్యవేక్షించడంలో అత్యున్నత స్థాయిలో కృషి కొనసాగుతోందని కూడా ఆయన వివరించారు.  మరణాల రేటు అత్యల్పంగా కేవలం 1.34% గా ఉండగా, భారతదేశం యొక్క రికవరీ రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని, ఆయన అందరికీ గుర్తు చేశారు.  దేశంలో 46 జిల్లాల నుండి కేసులు నమోదవుతూ ఉండగా, 400 జిల్లాలు కోవిడ్-రహిత జిల్లాలుగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.  (7 రోజుల్లో 187 జిల్లాలు, 14 రోజుల్లో 84 జిల్లాలు, 21 రోజుల్లో 20 జిల్లాలు, 28 రోజుల్లో 139 జిల్లాల్లో  - తాజా కేసులు నమోదు కాలేదు). 

భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా 84 దేశాలకు, 6 కోట్లకు పైగా టీకా మోతాదులను సరఫరా చేసినట్లు కూడా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, తెలియజేశారు. కాగా, మరో ఏడు రకాల టీకాలు, క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయని, ఆయన చెప్పారు.  వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమానికి, ముఖ్య ఆశయమైన, ‘ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండే వరకు మనలో ఎవరూ సురక్షితంగా ఉండరు’ అనే సూత్రం, మన ప్రియమైన మరియు సన్నిహితులకు టీకాలు వేయించడం లో కూడా వర్తిస్తుందని,  ఆయన నొక్కి చెప్పారు. టీకాలు వేయడంలో శిక్షణ పొందిన 7 లక్షల మంది వ్యక్తులు, కోవిన్ పోర్టల్ ‌లో 10 లక్షలకు పైగా టీకాల సెషన్ల కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా నమోదు చేయడం, టీకాలు వేసే ప్రభుత్వ, ప్రైవేట్ సౌకర్యాలు,  టీకాలు వేసే కార్యక్రమం విజయవంతం కావడానికి దోహదం చేస్తున్నాయని, ఆయన పేర్కొన్నారు.

 

*****



(Release ID: 1708576) Visitor Counter : 593