రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్సరానికి సంబంధించి రూ.174.43 కోట్ల విలువైన రెండో తాత్కాలిక డివిడెండ్ చెక్కును ర‌క్ష‌ణ‌ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌కు అంద‌జేసిన బీఈఎల్

Posted On: 30 MAR 2021 5:19PM by PIB Hyderabad

ర‌క్ష‌ణ రంగంలోని నవరత్న, ప్ర‌భుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్‌) 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత ప్రభుత్వానికి చెల్లించిన మూలధనంపై 140% మేర రెండో మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించింది. మంగ‌ళ‌వారం (30వ తేదీ‌) న్యూఢిల్లీలో  సంస్థ
ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎం.వి.గౌతమ ఈ ఏడాదికి సంబంధించిన రెండో తాత్కాలిక డివిడెండ్ కింద‌ రూ.174,43,63,569.20/-(నూటా డెబ్బై నాలుగు కోట్ల నలభై మూడు లక్షల అరవై మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయ‌ల ఇరవై పైసలు మాత్రమే) చెక్కును ర‌క్ష‌ణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌కు అంద‌జేశారు. సంస్థ‌లో భారత రాష్ట్రపతి క‌లిగున్న వాటాలకు ప్ర‌తిఫ‌లంగా ఈ మొత్తంను డివిడెండ్‌గా చెల్లించారు. రక్షణ ఉత్పత్తి శాఖ‌ కార్యదర్శి  శ్రీ రాజ్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంస్థ‌ తన వాటాదారులకు 140% శాతాన్ని రెండవ మధ్యంతర డివిడెండ్‌గా (షేరు ఒక్కింటికి రూ.1.40/-) ప్రకటించింది. సంస్థ సర్కారుకు తాత్కాలిక డివిడెండ్ చెల్లిస్తూ వ‌స్తుండ‌డం వరుసగా ఇది 18వ సంవత్సరం. 2019- 20 ఆర్థిక సంవత్సరానికి తన చెల్లించిన మూలధనంపై బీఈఎల్ సంస్థ మొత్తం 280% మేర డివిడెండ్‌ను చెల్లించింది.

***


(Release ID: 1708571) Visitor Counter : 215