ప్రధాన మంత్రి కార్యాలయం
ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
Posted On:
22 FEB 2020 9:01PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒడిశా లో తొలి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ను ఈ రోజు న వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, నేడు ఒక టూర్నామెంట్ కేవలం ఆరంభం అవడమే కాదు భారతదేశం లోని క్రీడా ఉద్యమం యొక్క తదుపరి దశ కూడా ఆరంభం అవుతున్నది అని స్పష్టం చేశారు. ఇక్కడ మీరు మరొకరి తో పోటీ పడడం ఒక్కటే కాదు, స్వయం గా మీ తో సైతం పోటీ పడుతున్నారు అని ఆయన అన్నారు.
‘‘నేను సాంకేతిక విజ్ఞానం ద్వారా మీ తో జోడింపబడ్డాను, అయితే అక్కడి శక్తి, ఉద్వేగం మరియు ఉత్సాహభరిత వాతావరణాన్ని నేను గమనించగలుగుతున్నాను. ఒకటో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఈ రోజు న ఒడిశా లో మొదలవుతున్నాయి. ఇది భారతదేశ క్రీడ ల చరిత్ర లో ఒక చరిత్రాత్మకమైన ఘట్టం. ఇది భారతదేశ క్రీడారంగ భవిష్యత్తు లో కూడాను ఒక పెద్ద అడుగు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
దేశం లోని ప్రతి మూలన యువ ప్రతిభావంతుల కు క్రీడల పట్ల ఆసక్తి ని పెంపొందింపచేయడం లో మరియు గుర్తింపు ను తీసుకు రావడం లో ఖేలో ఇండియా ప్రచార ఉద్యమం ఒక ముఖ్యమైన పాత్ర ను పోషించింది అని ప్రధాన మంత్రి అన్నారు. 2018వ సంవత్సరంలో ఖేలో ఇండియా గేమ్స్ ఆరంభం అయినప్పుడు అందులో 3500 మంది క్రీడాకారులు పాలుపంచుకొన్నారు. అయితే, కేవలం మూడు సంవత్సరాల కాలం లో క్రీడాకారుల సంఖ్య దాదాపు గా రెండింతలు అయ్యి, 6 వేల కు పైబడింది.
‘‘ఈ సంవత్సరం లో ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ 80 రికార్డుల ను బద్దలు కొట్టాయి. వాటిలో 56 రికార్డు లు మన పుత్రికల పేరిట ఉన్నాయి. మన పుత్రిక లు గెలిచారు. మన పుత్రిక లు అద్భుతాలు చేశారు. ముఖ్యమైన సంగతి ఏమిటి అంటే ఈ ప్రచార ఉద్యమం లో భాగం గా పెల్లుబుకుతున్న ప్రతిభ పెద్ద నగరం నుండి కాకుండా చిన్న పట్టణాల నుండి వస్తుండటం’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
గడచిన అయిదారు సంవత్సరాలు గా భారతదేశం లో క్రీడల లో పాలుపంచుకోవడం కోసం, క్రీడల ను ప్రోత్సహించడం కోసం చిత్తశుద్ధి తో కూడిన ప్రయత్నాలు జరిగాయని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ప్రతిభ ను గుర్తించడంలో, శిక్షణ ఇవ్వడం లో మరియు ఎంపిక ప్రక్రియ లో పారదర్శకత్వాన్ని ప్రోత్సహించడం జరుగుతోంది.
‘‘ఈ క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్ లో పాలుపంచుకొనే అవకాశాన్ని దక్కించుకోబోతున్నారు. ఈ పథకం లో భాగం గా లబ్ధి ని పొందే క్రీడాకారులు కామన్ వెల్త్ గేమ్స్, ఏశియన్ గేమ్స్, ఏశియన్ పారా గేమ్స్, ఇంకా యూత్ ఒలంపిక్స్ తదితర అనేక క్రీడా కార్యక్రమాల లో దేశాని కి 200కు పైగా పతకాల ను అందించారు. రానున్న కాలం లో 200కు పైగా స్వర్ణ పతకాల ను చేజిక్కించుకోవాలనేది లక్ష్యం గా ఉంది. మరీ ముఖ్యం గా మన స్వీయ ప్రదర్శన ను మెరుగు పరచుకోవడాని కి, మీ యొక్క సొంత సామర్ధ్యాన్ని నూతన శిఖరాల కు తీసుకు పోవడానికి కృషి చేయవలసి ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
***
(Release ID: 1708435)
Visitor Counter : 97