ప్రధాన మంత్రి కార్యాలయం

ఒకటో ఇంటర్ నేశనల్ జుడిశల్ కాన్ఫరెన్స్ 2020 న్యూ ఢిల్లీ లో జరిగిన సందర్భం లో ప్రారంభోపన్యాసమిచ్చిన ప్రధాన మంత్రి

Posted On: 22 FEB 2020 11:45AM by PIB Hyderabad

భారతదేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్ డే, చట్ట శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ గారు, వేదిక మీద ఉన్నటువంటి సర్వోన్నత న్యాయస్థానం యొక్క న్యాయాధీశులు, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఈ సమావేశాని కి ప్రపంచం నలు మూల ల నుండి హాజరు అయినటువంటి ఇతర ఉన్నత న్యాయస్థానాల కు చెందిన న్యాయమూర్తులు, భారతదేశ సర్వోన్నత న్యాయస్థానాని కి, భారతదేశం లోని ఉన్నత న్యాయస్థానాల కు చెందినటువంటి గౌరవనీయులైన న్యాయాధిపతులు, అతిథులు, మహిళ లు మరియు సజ్జనులారా,

ప్రపంచం లో కోట్లాది పౌరుల కు న్యాయాని కి మరియు హుందాతనాని కి పూచీ పడే మీ చిరకాల అనుభవశీలురు అందరి మధ్య కు విచ్చేయడం దానంతట అదే ఒక చాలా ఆనందభరితమైనటటువంటి అనుభవాన్ని ప్రసాదిస్తున్నది. 

మీరు ఆసీనులు అయ్యే న్యాయ పీఠాని కి సామాజిక జీవనం లో భరోసా మరియు నమ్మకం లతో కూడినటువంటి ఒక మహత్వపూర్ణమైన స్థానం ఉన్నది.

మీకు అందరి కి అనేకానేక అభినందన లు.

మిత్రులారా,

ఈ సమావేశం 21వ శతాబ్దం లోని మూడో దశాబ్ది యొక్క ఆరంభం లో జరుగుతూ ఉన్నది.  ఈ దశాబ్దం లో భారతదేశం తో సహా యావత్తు ప్రపంచం లో  పెద్ద మార్పు లు చోటు చేసుకొన్న దశాబ్దం అని చెప్పాలి.  ఈ పరివర్తన లు ప్రతి ఒక్క రంగం లో- అది సామాజిక రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, సాంకేతిక విజ్ఞాన రంగం కావచ్చు- దృగ్గోచరం అవుతాయి.

ఈ మార్పు లు తర్క బద్ధం గాను, న్యాయ బద్ధం గాను ఉండి తీరాలి.  ఈ పరివర్తన లు భావి కాల ఆవశ్యకతల ను దృష్టి లో పెట్టుకొని, ప్రతి ఒక్కరి కి హితాన్ని కలుగజేసేవి గా ఉండాలి; మరి ఈ కారణం గా, ‘మారుతున్న ప్రపంచం లో న్యాయ యంత్రాంగం’ అనే అంశం పైన మేధో మథనం జరపడం అనేది చాలా ప్రధానమైనటువంటిది.

మిత్రులారా,

మన దేశం జాతి పిత గాంధీ మహాత్ముని యొక్క 150వ జయంతి ని జరుపుకొంటున్న కాలం లోనే ఇటువంటి ఒక ప్రముఖ సమావేశం ఈ రోజు న సాగుతూవుండటం వాస్తవం లో భారతదేశాని కి ఒక ప్రసన్నభరితం అయినటువంటి సందర్భం గా ఉంది సుమా.

సత్యాని కి మరియు సేవ కు పూజ్యుడైన బాపూ యొక్క జీవనం సమర్పితం అయింది; ఈ సద్లక్షణాలే ఏ న్యాయ యంత్రాంగాని కి అయినా పునాదిరాళ్లు గా పరిగణించబడుతూ ఉన్నాయి.

మరి మన బాపూ స్వయం గా ఒక వకీలు గాను, న్యాయవాది గాను ఉండే వారు.  గాంధీజీ తన జీవనం లో తాను వాదించినటువంటి ఒకటో దావా ను గురించి ఎంతో విపులం గా తన ఆత్మకథ లో వివరించారు. 

గాంధీజీ అప్పట్లో బొంబాయి (దీని నే ప్రస్తుతం ముంబయి అని పిలుస్తున్నారు) లో ఉన్నారు.  అవి సంఘర్షణ తాలూకు రోజులు.  ఎలాగో అలాగ ఆయన తన ఒకటో దావా ను అందుకొన్నారు; అయితే ఆ దావా కు ప్రతిఫలం గా ఎవరికో దక్షిణ ను సమర్పించుకోవలసివుంటుంది అని ఆయన కు వెల్లడి చేయడం జరిగింది.

తనకు ఒక దావా దక్కినా గాని, లేదా దక్కకపోయినా గాని తాను మాత్రం ఎటువంటి దక్షిణ ను ఇచ్చేది లేదు అంటూ గాంధీ గారు స్పష్టం గా చెప్పేశారు.

సత్యం పట్ల మరియు తన ఆలోచన ల పట్ల గాంధీ గారి కి ఆయన మస్తిష్కం లో ఎంతో స్పష్టత ఉండేది.

మరి ఈ స్పష్టత ఎక్కడ నుండి వచ్చింది?

అది ఆయన పెంపకం నుండి, ఆయన అలవరచుకొన్నటువంటి సంస్కారం నుండి మరియు భారతీయ తత్వ శాస్త్రాన్ని నిరంతరం అధ్యయనం చేస్తుండడం నుండి సంప్రాప్తించింది.

మిత్రులారా,

భారతీయ సమాజం లోని సామాజిక విలువల కు చట్ట నియమం మూలాధారం గా ఉంటూ వచ్చింది.


అది ఇలాగ అని చెప్పింది - ‘क्षत्रयस्य क्षत्रम् यत धर्म:’

ఈ మాటల కు, ‘చట్టం అనేది రాజుల కు రాజు, చట్టం అన్నిటి కంటే మిన్న’ అని భావం.  వేల సంవత్సరాల నుండి ఆచరింపబడుతూ వచ్చినటువంటి ఈ భావ స్రవంతి యే భారతదేశం లో ప్రతి ఒక్కరు న్యాయపాలిక పట్ల ఒక దృఢమైన విశ్వాసాన్ని కలిగివుండడాని కి ప్రధాన కారణం గా ఉంది.

మిత్రులారా,

ఇటీవల వెలువడ్డ కొన్ని ప్రముఖమైనటువంటి తీర్పుల ను గురించి ప్రపంచం అంతటా చర్చించుకోవడం జరిగింది.

న్యాయస్థాన ఉత్తర్వు వెలువడడానికి పూర్వం అనేక భయానుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ జరిగింది ఏమిటి?  న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి ఈ యొక్క నిర్ణయాల ను 130 కోట్ల మంది భారతీయులు పూర్తి సమ్మతి తో స్వీకరించారు.  వేల కొలదీ సంవత్సాలు గా, భారతదేశం న్యాయం పట్ల విశ్వాసం తో కూడిన ఈ యొక్క విలువల ఆచరణ తోనే పురోగమిస్తున్నది.  ఇది మా రాజ్యాంగాని కి కూడాను ఒక ప్రేరణ గా నిలచింది.  గత సంవత్సరం తో మా రాజ్యాంగాని కి 70 సంవత్సరాలు పూర్తి అయ్యాయి.

రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ ఆంబేడ్ కర్ అన్నారు కదా-

‘‘రాజ్యాంగం కేవలం ఒక వకీలు యొక్క దస్తావేజు పత్రం ఏమీ కాదు, అది జీవనాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి ఒక మాధ్యమం; మరి అలాగే విశ్వాసమే ఎల్లప్పటి కీ దీని యొక్క ఆధారం గా ఉంది’’ అని.

ఈ భావన ను మన దేశం లోని న్యాయస్థానాలు మరియు మన దేశం యొక్క సర్వోన్నత న్యాయస్థానం ముందుకు తీసుకు పోతూ ఉన్నాయి.

ఈ భావన ను మన చట్టసభ లు మరియు కార్యనిర్వాహక యంత్రాంగాలు సజీవం గా ఉంచుతున్నాయి.

అనేక పర్యాయాలు, అన్ని రకాల సవాళ్ల మధ్య రాజ్యాంగపు మూడు స్తంభాలు ఒక స్తంభం యొక్క పరిమితుల ను మరొక స్తంభం గ్రహించడం ద్వారా,  దేశాని కి ఒక సరి అయినటువంటి పరిష్కారాన్ని కనుగొన్నాయి.

మరి మేము భారతదేశం లో రూపుదాల్చినటువంటి ఒక సుసంపన్నమైన ఆ తరహా సంప్రదాయాన్ని చూసుకొని గర్వపడుతూ ఉన్నాము.

గడచిన అయిదు సంవత్సరాల లో, భారతదేశం లోని వేరు వేరు సంస్థ లు ఈ యొక్క సంప్రదాయాన్ని బల పరచాయి.

దేశం లో కాలం చెల్లిన చట్టాల ను, దాదాపు గా 1500 చట్టాల ను- రద్దు చేయడమైంది; ఆ చట్టాలు ప్రస్తుత కాలం లో వాటి యొక్క ప్రాసంగికత ను కోల్పోయాయి.

కేవలం చట్టాల ను సమాప్తం చేయడం లోనే వేగం నమోదు చేసినట్లు కాదు.

సమాజాన్ని పటిష్ట పరచే క్రొత్త చట్టాల కు సైతం అంతే వేగం గా చట్ట రూపాన్ని ఇవ్వడం జరిగింది.

ట్రాన్స్ జెండర్ పర్సన్స్ యొక్క హక్కుల కు సంబంధించినటువంటి చట్టం కావచ్చు, మూడు సార్లు తలాక్ పలకడాని కి విరుద్ధం గా వెలువడిన చట్టం కావచ్చు, లేదా దివ్యాంగ జనుల హక్కుల పరిధి ని విస్తరించేటటువంటి చట్టం కావచ్చు.. ప్రభుత్వం అత్యంత సూక్ష్మగ్రాహ్యత తో వ్యవహరించింది.

మిత్రులారా,

ఈ సమావేశాని కి ఇతివృత్తం గా ‘స్త్రీ పురుషుల కు సమాన అవకాశాల తో కూడినటువంటి ప్రపంచం’ అనే అంశాన్ని తీసుకొన్నందుకు గాను నేను సంతోషిస్తున్నాను.

మహిళల కు, పురుషుల కు సమాన న్యాయానికి తావు ఇవ్వనిదే ప్రపంచం లో ఏ దేశం, ఏ సమాజం కూడా పూర్తి స్థాయి అభివృద్ధి ని చేజిక్కించుకోజాలదు; అలాగని అది న్యాయాన్ని పాలిస్తున్నట్లుగా చెప్పుకోనూ లేదు.  మా యొక్క రాజ్యాంగం సమానత్వ హక్కు లో భాగం గా స్త్రీ పురుషుల కు సమ న్యాయాని కి పూచీ పడుతున్నది.

స్వాతంత్ర్యం లభించిన నాటి నుండి మహిళల కు వోటు హక్కు కు పూచీ పడిన అతి కొద్ది దేశాల లో భారతదేశం ఒక దేశం గా ఉన్నది.  నేటి రోజు న,  70 సంవత్సరాలు గడచిన అనంతరం, ఎన్నికల లో మహిళ ల ప్రాతినిధ్యం విషయం లో అత్యున్నతమైన స్థాయి నమోదు అయింది.

ప్రస్తుతం 21వ శతాబ్దపు భారతదేశం, ఈ భాగస్వామ్యం తాలూకు ఇతర దృష్టికోణాల లోనూ మరింత వేగం గా ముందంజ వేస్తున్నది.
 
‘బేటీ బచావో, బేటీ పఢావో’ వంటి ప్రచార ఉద్యమాలు సఫలత ను సాధించిన పర్యవసానం గా భారతదేశం లో విద్యాసంస్థల లో ఆడ పిల్లల ను చేర్చడం అనేది మొట్టమొదటి సారి గా బాలుర చేరిక ల కంటే కూడా అధికం అయిపోయింది. 

అదే మాదిరి గా, సైన్య సేవ లో పుత్రిక ల నియామక నియమాల లోను, ఫైటర్ పైలట్ లు గా అమ్మాయి లు ఎంపిక అయ్యేలాగాను సంబంధిత ప్రక్రియ లో అవసరమైన మార్పుల ను  ప్రవేశపెట్టింది.  దీనికి అదనం గా, గనుల లో రాత్రి పూట శ్రమించే స్వతంత్రత ను మహిళల కు ప్రభుత్వం ఇచ్చింది.

ప్రస్తుతం ప్రపంచం లో వృత్తిజీవనాన్ని సాగిస్తున్న మహిళల కు 26 వారాల పాటు ఆర్జిత సెలవు ను ఇస్తున్నటువంటి కొద్ది దేశాల లో భారతదేశం ఒక దేశం గా ఉంది.

మిత్రులారా,

ఈ పరివర్తన యుగం లో, భారతదేశం కూడా సరిక్రొత్త నిర్వచనాల ను చెప్పుకొంటూ, పాత భావనల లో మార్పు చేర్పు లు చేసుకొంటూ నూతన శిఖరాల ను అధిరోహిస్తున్నది.

శీఘ్ర గతి న అభివృద్ధి ని సాధించడం మరియు పర్యావరణాన్ని పరిరక్షించడం అనేవి ఏక కాలం లో సంభవం అయ్యేవి కావు అని ఘోషించిన కాలం అంటూ ఒకటి ఉండింది. 

ఈ భావన ను భారతదేశం సైతం మార్చివేసింది.  ఇవాళ భారతదేశం సూచకవేగం తో వృద్ధి చెందుతోంది; మన అటవీ సంబంధ కవచం కూడాను శర వేగం గా విస్తరిస్తోంది.  అయిదారు సంవత్సరాల క్రిందట భారతదేశం ప్రపంచం లో 11వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా ఉండింది.  మూడు నాలుగు రోజుల క్రితం వెలువడిన ఒక నివేదిక ప్రకారం, భారతదేశం ప్రస్తుతం ప్రపంచం లో 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా ఉంది.

అంటే, మౌలిక సదుపాయాల కల్పన తో పాటే పర్యావరణాన్ని కూడా పరిరక్షించవచ్చని భారతదేశం చాటిందన్న మాట.

మిత్రులారా,

ఈ సందర్భం లో, భారతదేశపు న్యాయ యంత్రాంగాని కి నేను నా యొక్క కృత‌జ్ఞత‌ల ను కూడా వ్యక్తం చేయదలుస్తున్నాను.. భారతదేశపు న్యాయ యంత్రాంగం అభివృద్ధి కి మరియు పర్యావరణాని కి మధ్య ఒక సమతౌల్యాన్ని ఏర్పరచవలసిన ఆవశ్యకత ఎంతయినా ఉందని గ్రహించి, మరి ఆ దిశ లో ఒక నిరంతర పథదర్శి గా ఉంటున్నది.

అనేక ప్రజా హిత వ్యాజ్యాల (పిఐఎల్ ల) విచారణ క్రమం లో, సర్వోన్నత న్యాయస్థానం సైతం పర్యావరణాని కి సంబంధించిన అంశాల ను పునర్ నిర్వచించింది.

మిత్రులారా,

న్యాయాన్ని అందించడం తో పాటు, వేగవంతం గా న్యాయాన్ని చెప్పవలసినటువంటి సవాలు ఎల్లప్పటి కి మీ ముందు ఉంటున్నది.  దీని కి పరిష్కారం కొంత వరకు సాంకేతిక విజ్ఞానం లో ఉంది.

భారతదేశం యొక్క న్యాయ ప్రదాన వ్యవస్థ ఇంటర్ నెట్ ఆధారితమైన సాంకేతిక విజ్ఞానం నుండి గొప్ప గా లబ్ధి ని పొందగలుగుతుంది; ప్రత్యేకించి న్యాయస్థానం యొక్క ప్రక్రియ ల నిర్వహణ కు సంబంధించిన అటువంటి సవాళ్ల లో దీనికి తావు ఉంది.

దేశం లోని ప్రతి ఒక్క న్యాయస్థానం e-court Integrated Mission Mode Project కు సంధానింపబడేటట్టు చూడటాని కి ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తున్నది.  నేశనల్ జుడిశల్ డేటా గ్రిడ్ ను ఏర్పాటు చేయడం వల్ల కూడాను న్యాయస్థాన ప్రక్రియ లు సులభతరం గా మారగలుగుతాయి.

కృత్రిమ మేధ మరియు మానవ వివేకాల మేలుకలయిక సైతం భారతదేశం లో న్యాయ సంబంధి ప్రక్రియల కు మరింత ఉత్తేజాన్ని ఇవ్వగలుగుతుంది.  కృత్రిమ మేధ యొక్క సహాయాన్ని ఏ రంగం లో ఎంత స్థాయి వరకు తీసుకోవచ్చనే అంశం పై భారతదేశం ల న్యాయస్థానాలు కూడా మేధోమథనం జరుపవచ్చును.

దీనికి అదనం గా, మారుతున్న కాలాల్లో, డేటా పరిరక్షణ మరియు సైబర్ క్రైమ్ లు కూడా న్యాయస్థానాల కు ఒక నూతనమైనటువంటి సవాలు గా నిలుస్తున్నాయి.  ఈ సవాళ్ల ను దృష్టి లో పెట్టుకొని, ఈ సమావేశం లో అనేక విషయాల పైన గంభీరమైనటువంటి మేధోమథనం చోటు చేసుకోనుంది; మరి దీని ఫలితం గా కొన్ని అనుకూల పరిష్కారాలు, ఇంకా సూచన లు వస్తాయని ఆశిద్దాము.  ఈ సమావేశం భవిష్యత్తు కాలాని కి అనేక ఉత్తమమైనటువంటి పరిష్కారాల ను చూపేందుకు కూడా దారి తీస్తుంది అనేటటువంటి నమ్మకం నాలో ఉంది. 

మరొక్క మారు, మీకు అందరి కి నా యొక్క శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.  మీకు ఇవే ధన్యవాదాలు.


 

***



(Release ID: 1708418) Visitor Counter : 73