ప్రధాన మంత్రి కార్యాలయం

మొద‌టి సారి గా నిర్వ‌హిస్తున్న ఖేలో ఇండియా యూనివ‌ర్సిటీ గేమ్స్ ఆరంభమవుతున్నట్లు ప్ర‌క‌టించనున్న ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 21 FEB 2020 2:20PM by PIB Hyderabad

దేశం లో మొట్ట‌మొద‌టిసారి గా ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2020వ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 22వ తేదీ న కటక్ లోని జవాహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియమ్ లో పెద్ద ఎత్తు న జరిగే ప్రారంభ కార్యక్రమం ద్వారా మొదలుకానున్నాయి. 

బహుళ విభాగాల ఆటల తో కూడిన ఈ కార్యక్రమాన్ని మాన్య ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రారంభమైనట్లు ప్రకటించనున్నారు.

ఖేలో ఇండియా యూనివ‌ర్సిటీ గేమ్స్ ను భార‌త ప్ర‌భుత్వం ఒడిశా రాష్ట్ర ప్ర‌భుత్వం తో క‌ల‌సి ప్రారంభించ‌నుంది.

గేమ్స్ ను 2020వ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 22వ తేదీ నాటి నుండి  మార్చి నెల ఒక‌టో తేదీ వ‌ర‌కు భువ‌నేశ్వ‌ర్ లో నిర్వ‌హించ‌నున్నారు.

ఇది భార‌త‌దేశం లో విశ్వ‌విద్యాల‌య స్థాయి లో నిర్వ‌హించే అతి పెద్దదైన పోటీ.  దీని లో దేశవ్యాప్తం గా 150కి పైగా విశ్వ‌విద్యాల‌యాల కు చెందిన దాదాపు గా 3500 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.

విలువిద్య‌, అథ్లెటిక్స్‌, కుస్తీ, ఫెన్సింగ్‌, జూడో, ఈత‌, వెయిట్ లిఫ్టింగ్‌, మ‌ల్ల‌యుద్ధం, బ్యాడ్ మింటన్, బాస్కెట్ బాల్‌, ఫుట్ బాల్‌, హాకీ, టేబ‌ల్ టెనిస్‌, టెనిస్‌, వాలీబాల్, ర‌గ్బి, ఇంకా కబడ్డీ.. ఇలా మొత్తం 17 ఆట లు ఉంటాయి.  విద్య మరియు క్రీడ రంగాలు రెంటిలో సమతుల్యత ను సాధించడం లో భారతదేశ యువజనుల కు సహాయకారి గా మలచాలనే రెండు లక్ష్యాల తో చేపడుతున్న ఆకాంక్షభరిత స్పర్ధ గా ఖేలో ఇండియా యూనివ‌ర్సిటీ గేమ్స్ నిలవనుంది. 

ఖేలో ఇండియా ప్రోగ్రాము ప్ర‌ధాన మంత్రి ఆలోచ‌న‌ల లో నుండి జనించింది.  భార‌త‌దేశం లో ఆడేట‌టువంటి అన్ని ఆట‌ల కు సంబంధించి ఒక బ‌ల‌మైన ఫ్రేమ్ వ‌ర్క్ ను నిర్మించ‌డం ద్వారా క్రీడాసంస్కృతి ని అట్ట‌డుగు స్థాయి నుండి పున‌రుద్ధ‌రించ‌డం కోసం మరియు భార‌త‌దేశాన్ని ఒక ఘ‌న‌మైన‌టువంటి క్రీడ‌ ల దేశం గా ప్ర‌తిష్టించడం కోసం దీనిని ప్ర‌వేశ‌పెట్ట‌డ‌మైంది.

భారత ప్రభుత్వం 2018వ సంవత్సరం లో ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ ను, అలాగే 2019వ సంవత్సరం లో మరియు 2020వ సంవత్సరం లో నేశనల్ యూత్ గేమ్స్ ను జయప్రదం గా నిర్వహించింది.

 

***


(रिलीज़ आईडी: 1708412) आगंतुक पटल : 150
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada