మంత్రిమండలి

యునైటెడ్ కింగ్‌డ‌మ్ కు చెందిన ఫైనాన్శియ‌ల్ కండ‌క్ట్ ఆథారిటి (ఎఫ్‌సిఎ)కు మ‌రియు ఎస్‌ఇబిఐ కి మ‌ధ్య సంత‌కాలైన యూరోపియ‌న్ యూనియ‌న్ ఆల్ట‌ర్నేటివ్ ఇన్‌ వెస్ట్‌ మంట్ ఫండ్ మేనేజ‌ర్స్ డైరెక్టివ్‌ (ఎఐఎఫ్ఎమ్‌డి)ని ప్రస్తుత పరిస్థితి కి అనుగుణంగా సవరించడానికి ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 19 FEB 2020 4:34PM by PIB Hyderabad

యునైటెడ్ కింగ్‌డ‌మ్ కు చెందిన ఫైనాన్శియ‌ల్ కండ‌క్ట్ ఆథారిటి (ఎఫ్‌సిఎ)కు మ‌రియు సెక్యూరిటీస్ ఎండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఇబిఐ)  కి మ‌ధ్య సంత‌కాలైన యూరోపియ‌న్ యూనియ‌న్ ఆల్ట‌ర్నేటివ్ ఇన్‌ వెస్ట్‌మంట్ ఫండ్ మేనేజ‌ర్స్ డైరెక్టివ్‌ (ఎఐఎప్ఎమ్‌డి)ని ప్రస్తుత పరిస్థితి కి అనుగుణంగా సవరించాలనే ప్ర‌తిపాద‌న కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగి న కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.  యుకె 2020వ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 31వ తేదీ న యూరోపియ‌న్ యూనియ‌న్ నుండి నిష్క్ర‌మించిన ద‌రిమిలా ఈ చొర‌వ ను తీసుకోవ‌ల‌సి వ‌చ్చింది.

ప్ర‌ధాన ప్ర‌భావం 

ఇయు నుండి యుకె 2020వ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 31వ తేదీ న బ‌య‌ట‌కు వ‌చ్చింది.  యూరోపియ‌న్ యూనియ‌న్ నుండి యుకె నిష్క్ర‌మించే (బ్రెగ్జిట్) తేదీ క‌న్నా ముందు స‌వ‌రించిన‌టువంటి అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం ఎంఒయు పై సంత‌కం చేయ‌క‌పోయిన‌ట్ల‌యితే ఎటువంటి తాత్కాలిక చ‌ర్య‌ల కు అవ‌కాశం ల‌భించ‌దు అంటూ ఎస్ఇబిఐ దృష్టి కి యుకె తీసుకువస్తూ సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఒక ఎంఒయు ను స‌రిక్రొత్త గా కుదుర్చుకోవాల‌ని అభ్య‌ర్ధించింది.  అందువల్ల, ఈ ప్ర‌తిపాద‌న భార‌త‌దేశం లో ఉద్యోగ క‌ల్ప‌న పై ఎటువంటి ప్ర‌భావాన్నిచూపుతుందని గాని, భార‌త‌దేశం లో ఉద్యోగ క‌ల్ప‌న పై ఎటువంటి ప్రభావాన్ని కల్పించడానికి ఉద్దేశించింది గాని కాదు అని భావిస్తున్నారు.
 

***


(Release ID: 1708394) Visitor Counter : 101